Revanth Reddy Hot Comments: మెట్రో విస్తరణ, మూసి అభివృద్ధి అడ్డుకుంది కిషన్‌రెడ్డేనని కేంద్రమంత్రులే చెప్పారు: రేవంత్ సంచలన ఆరోపణలు
Telangana Latest News: తెలంగాణ అభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అడ్టుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం కేంద్రమంత్రులే చెప్పారని అన్నారు.

Telangana CM Revanth Reddy Sensational Comments On Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఒకరు కేటీఆర్ అరెస్ట్‌ను అడ్డుకుంటుంటే, మరొకరు హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
నిజామబాద్‌లో శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లడుతూ బిఆర్‌ఎస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో కేంద్రం సహకరించకుండా తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. మెట్రో విస్తరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేగంగా కార్యచరణ మొదలుపెట్టింది. నిధులు కొరత ఉన్నప్పటికీ సొంత నిధులతోనైనా ముందుకు సాగేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అయితే భూసేకరణతోపాటు మెట్రో విస్తరణకు అవసరమైన వేలకోట్ల రూపాయలు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారాయి. అందులోనూ ఉచిత బస్సు, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మెట్రోను విస్తరించడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఆధారపడక తప్పలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి .
కిషన్ రెడ్డిపై చేసినవి ఆరోపణలు కాదని, తనకు బీజేపీ మంత్రులతో పరిచాయాలున్నాయని, వాళ్లే చెప్పారని రేవంత్ అనడం మాట్లడటం రాజకీయ దుమారం రేపుతోంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ - ఈ సారి పది స్థానాలకు ఎన్నికలు
నిధులు విడుదల చేసి, మెట్రో విస్తరణకు సహకరిస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పేరు వస్తుందే కానీ, బీజేపీకి రాదు అని కిషన్ రెడ్డి చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో ముందుకు వెళ్లకుండా ఆపుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి చెందడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదంటూనే తీవ్ర స్థాయిలో విమర్శించారు.
మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం రాకపోవడానికి ప్రధాన కారణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డేనని ఆరోపించారు రేవంత్. యూపిలో గంగా, గుజరజాత్‌లో సబర్మతి, ఢిల్లో యమున ఇలా అనేక నదులు ప్రక్షాళన చేసిన కేంద్రానికి అదే హైదరాబాద్‌లో మూసి ప్రక్షాళన ఎందుకు కనిపించడలేదన్నారు. మూసీ సుందరీకరణకు కేంద్రం నుంచి నిధులు రాకుండా, పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా కావాలనే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతోపాటు అనేక అభివృద్ది కార్యక్రమాలు కేంద్రం సహకారం లేకుండా నిలిచిపోతున్నాయంటే దానికి ప్రధాన కారణం కిషన్ రెడ్డి మాత్రమేనని రేవంత్ ఆరోపించారు.
సిఎం హోదాలో ఉండి ఓ కేంద్రమంత్రిపై అందులోనూ ఇదే రాష్ట్రానికి చెందిన సినీయర్ బిజెపి నేతపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో మూసీ పరివాహక ప్రాంత ఓటర్ల ఓట్లతో గెలిచిన కిషన్ రెడ్డి అదే మూసీ అభివృద్ధిని ఎందుకు ఓర్వలేకపోతున్నారని నిప్పులు చెరిగారు రేవంత్. కేవలం ఆరోపణలు చేయడమే కాదు, అదే పార్టీకి చెందిన మంత్రులు చెప్పారని అనడం మరింత అగ్గి రాజేసింది.
Also Read: కేసీఆర్, కేటీఆర్ అరెస్టు కాకుండా అడ్డుకుంటోంది బీజేపీనే - సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

