అన్వేషించండి

Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్ అరెస్టు కాకుండా అడ్డుకుంటోంది బీజేపీనే - సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth: బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా బీజేపీనే కాపాడుతోందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలుచేశారు.

BRS and BJP: టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికా పారిపోతే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాసి ఎందుకు దేశానికి తీసుకురావడం లేదని సీఎం రేవంత్త ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కాకుండా కాపాడుతుందే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్నారు. ఈ కార్ రేస్ కేసులో ఫైళ్లు అన్నీ తీసుకుపోయిన ఈడీ ఎందుకు కేటీఆర్ ను అరెస్ట్ చేయడం లేదుని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో రేవంత్ మాట్లాడారు.  

బండి సంజయ్.. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు  ను ఎప్పుడు అమెరికా నుంచి తీసుకువస్తావో చెప్పాలని.. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ను రాష్ట్రానికి  తెచ్చిన 48 గంటల్లో బీఆర్ఎస్ నాయకులను బొక్కలో వేస్తామని ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకు పంపించిన రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు కు 10 నెలల తర్వాత బెయిల్ వచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో  హరీష్ రావు కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారని.. 
గొర్రెల పెంపకం కేసులో ఫైళ్లు తీసుకుపోయిన  ఈడీ బీఆర్ఎస్ నాయకులును ఎప్పడు అరెస్టు చేస్తుందని ప్రశఅనించారు.   ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఢిల్లీ వెళ్లని  హరీష్ రావు, కేటీఆర్ ఇప్పుడెందుకు వెళ్తున్నారు..? వాళ్లు  కేంద్ర మంత్రులను ఎందుకు కలుస్తున్నారో అర్థం కావడం లేదా..? నితిన్ గడ్కరీ ని కలిసి కేటీఆర్ చిల్లి గవ్వ తెచ్చారా..?. తెలంగాణ కు నిధులు తీసుకువస్తే మా తో కలిసి రావాలి కాదా..? మీరిద్దరు చీకట్లో కలిసేంది ఏందని రేవంత్ ప్రశ్నించారు. 

పదేళ్లు రాని ఉపఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయి ? 

బీఆర్ఎస్ ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయలేదు..? మీ ఓట్లు ఎవరికో చెప్పాలని సవాల్ చేశారు. మోదీని ఓడించాలా,రేవంత్ రెడ్డిని ఓడించాలా... మీ అభ్యర్థి ఎవరో బీఆర్ఎస్ చెప్పాలన్నారు. కేసీఆర్  అసెంబ్లీకి రాడు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడు.. ఉప ఎన్నికల్లో చూపిస్తాడట..పదేళ్లలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఉప ఎన్నికలు వచ్చాయా..?. మరీ ఇప్పుడెందుకు ఉప ఎన్నికలు వస్తాయి..? అవే కోర్టులు, స్పీకర్లు ఉన్నారు కాదా..అని రేవంత్ ప్రశ్నించారు. తలసాని, సబితమ్మ ను కేసీఆర్ సిగ్గు లేకుండా మంత్రులను చేశాడని.. కేసీఆర్ కు మిగిలింది గతమే.. భవిష్యత్తు  లేదన్నారు. ఫామ్ హౌస్ లో పడుకునే కేసీఆర్ మాకు పోటీనా..? అని మండిపడ్డారు. 

ఎన్నికల కోడ్ కారణంగా 9 నెలలే పరిపాలన చేసే చాన్స్ 

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది.. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది..ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు..ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ కి రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హత  లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పట్టభద్రులు ముందుండి నడిపారు..  ఎన్నికల బరిలో నిలబడని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత ఉందా అని మండిపడ్డారు. పది నెలలలో ఏమీ చేయలేని కాంగ్రెస్ ను అంటున్న బీఆర్ఎస్  పదేళ్లలో  ఏం చేసిందో చెప్పాలన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా  ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు మాత్రమే మాకు పరిపాలన చేసే అవకాశం వచ్చింది.. . పదేళ్లలో నిరుద్యోగ సమస్య కారణంగా అనేక మంది యువతీ యువకులు ఆత్మహత్య లు  చేసుకున్నారు.. పదేళ్లలో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడమే సరిపోయింది.. నోటిఫికేషన్లు రాలేదు.. నియామకాలు చేయలేదు.. నోటిఫికేషన్లు ఇస్తే కోచింగ్ సెంటర్ల తో కుమ్మక్కు అయి కోర్టులకు వెళ్లి పరీక్షలు ఆపించారు.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత  55,163 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది నిజం కాదా..? అని రేవంత్ ప్రశ్నించారు. 

మేం  55 వేల ఉద్యోగాలు ఇస్తేనే కాంగ్రెస్ కు  ఓటు వేయండి.. !

35 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు,   22 వేల మంది కి బదిలీలు చేయడంతో పాటు  17 వేల మంది నూతనంగా నియమించాం.. మేం చెప్పింది నిజమైతే  మాకు టీచర్లు ఓటు వేయాలన్నారు. ఆనంద్ మహీంద్రా ను చైర్మన్ గా  యంగ్ స్కిల్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమౌతున్నాం..  ప్రపంచంతో పోటీ పడలేక పోతున్నామనే తెలంగాణ లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు 8 వేల కోట్ల బకాయిలు కేసీఆర్ పెట్టారు.. 8 వేల కోట్లు తీర్చడానికి నా నడుము వంగిపోతోంది.. ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు పోయి పడుకుంటే బకాయిలు ఇవ్వడానికి మాకు చాలా కష్టం అవుతుందన్నారు. ప్రతి నెలా వెయ్యి కోట్ల బకాయిలు చెల్లించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Census India 2027: జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Census India 2027: జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Winter Skin Care Tips : చలికాలంలో చర్మం పొడిబారకుండా, హెల్తీగా ఉండేందుకు ఇంటి చిట్కాలివే
చలికాలంలో చర్మం పొడిబారకుండా, హెల్తీగా ఉండేందుకు ఇంటి చిట్కాలివే
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Embed widget