Horoscope 28th February : ఈ రాశులవారి జీవితంలో కొత్త రంగులు.. ఓ శుభవార్త వింటారు!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 28 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. పరిస్థితులను నిశితంగా పరిశీలించండి. మీ ఫ్యూచర్ గురించి ఆందోళన చెందుతారు. అప్పు చేయాల్సి వస్తుంది. కొన్ని పనులపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితేనే పూర్తవుతాయి.
వృషభ రాశి
ఈ రోజు జీవిత భాగస్వామి సలహాలను అనుసరించండి..అది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తుంది. మీరు భౌతిక సుఖాలను పొందుతారు. మీరు మీ దినచర్యలో మార్పును తీసుకురావచ్చు.
మిథున రాశి
ఈ రోజు కొత్త పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఏదో విషయంలో అసంతృప్తి ఉంటుంది. పెద్దల అభిప్రాయలను పరిగణలోకి తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల గురించి కొద్దిగా భావోద్వేగానికి లోనవుతారు. విద్యార్థులు తమ అధ్యయనాలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలి.
Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!
కర్కాటక రాశి
ఈ రోజు ఆదాయ పరంగా చాలా మంచి రోజు. ఉద్యోగం చేసే ప్రదేశంలో కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు అసంపూర్ణమైన పనిని ప్రారంభిస్తారు. మీరు చాలాకాలంగా ఎదురుచూస్తున్న వారిని కలవవచ్చు. మీరు సాయంత్రం శుభవార్త పొందవచ్చు.
సింహ రాశి
ఈ రోజు సవాళ్లను సులభంగా పరిష్కరిస్తారు. మీ సామర్థ్యం, ప్రతిభను మెరుగుపర్చుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పొట్టకు సంబంధించిన చికాకులు ఉంటాయి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.
కన్యా రాశి
ఈ రోజు మీకు పనిపై శ్రద్ధ ఉండదు. యువ ప్రేమికులకు కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. అధికారులపట్ల మీ ప్రరవర్తనను మంచిగా ఉంచండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించండి
తులా రాశి
ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. భాగస్వామ్య వ్యాపారంలో ప్రయోజనం పొందుతారు. స్నేహితులను కలుస్తారు. రాజకీయాలతో సంబంధం ఉండే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చిక రాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ చర్యలతో అధికారులు చాలా సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో వివాదాలకు పోవద్దు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు.
ధనస్సు రాశి
ఈ రోజు వ్యాపారంలో వృద్ధి కోసం ప్రయత్నాలు చేయాలి. భావోద్వేగాలు నియంత్రించుకోవాలి. పెళ్లికాని వారు వివాహ ప్రతిపాదనలను పొందుతారు. అనవసర ప్రయాణం చేయొద్దు. అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు.
మకర రాశి
మీరు ఈ రోజు ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. వైద్య సేవతో సంబంధం ఉన్నవారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. వివాహ జీవితంలో ఇబ్బందులు ఉండొచ్చు.
కుంభ రాశి
ఈ రోజు ఆదాయం పెంచుకునే మార్గాలు వెతుక్కుంటారు. నూతనంగా ప్రారంభించే పనుల నుంచి ప్రయోజనం పొందుతారు. స్నేహితుల ప్రభావం మీపై మంచిగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని ఆందోళనలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది
మీన రాశి
మీరున్న రంగంలో నిర్వహణ సామర్థ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. ప్రేమికులు మనసులో మాట చెప్పేందుకు ఇదే మంచి సమయం. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!





















