Posani Krishna Murali Rajampet Jail | రాజంపేట సబ్ జైలుకు పోసాని | ABP Desam
నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న రాత్రి పోలీసులు పోసానిని జడ్జి ముందు హాజరుపర్చారు. రా.9 గంటల నుంచి ఉ.5 గంటల వరకు తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరఫున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ బెయిల్ ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించగా... ఉదయం పోసాని కృష్ణమురళిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. పోసాని కృష్ణమురళి చేశాడని చెబుతున్న నేరానికి శిక్ష ఐదేళ్లలోపే ఉంటుందని..ఐదేళ్లలోపు కేసుల్లో రిమాండ్ విధిస్తే అది సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించటమేనన్నారు ఆయన తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. రైల్వే కోడూరు కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో పోరాడతామన్నారు. పోసాని పై ప్రభఉత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని గతంలో ఆ పార్టీ నాయకులపై విమర్శలు చేసిన వారందరినీ వరుస పెట్టి అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నారంటూ వైసీపీ పార్టీ ఇప్పటికే అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది.





















