Ram Charan - Chiranjeevi: రామ్ చరణ్ సినిమాలో అతిథిగా మెగాస్టార్... అందులో నిజం ఎంతంటే?
Chiranjeevi In RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ అతిధి పాత్ర చేయబోతున్నారంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమా (RC 16 Movie) రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ బరిలో 100 కోట్ల వసూళ్లు సాధించిన 'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు చేస్తున్న చిత్రమిది. ప్రేక్షకులలో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు అనూహ్యంగా ఈ రోజు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొట్టడం మొదలు పెట్టింది. అది ఏమిటంటే...
రామ్ చరణ్ సినిమాలో అతిథిగా మెగాస్టార్!?
Chiranjeevi guest role in RC 16: రామ్ చరణ్, బుచ్చిబాబు సానా సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక అతిథి పాత్ర చేయబోతున్నారనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలోని సారాంశం. తండ్రి కొడుకులు తెరపై కనిపిస్తున్నారని అంటే మెగా అభిమానులకు అదొక మెమొరబుల్ మూమెంట్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అందుకని చరణ్ సినిమాలో చిరు అతిథి పాత్ర న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు అందులో నిజం ఎంత? అని ఆరా తీయగా అటువంటిది ఏమీ లేదని తెలిసింది.
రామ్ చరణ్ సినిమాలో అతిథి పాత్రలు ఏమీ లేవు అని, చిరు చేత ఒక అతిథి పాత్ర చేయించాలని దర్శకుడు బుచ్చిబాబు సానా అనుకుంటున్నారనే మాటల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని, అది ఎవరు పుట్టించిన పుకారు మాత్రమేనని సినిమా యూనిట్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.
క్రికెట్ నేపథ్యంలో రామ్ చరణ్, బుచ్చిబాబు సానా సినిమా రూపొందుతోంది. హీరోగా చరణ్ 16వ సినిమా ఇది. అందుకని RC 16 అని వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల మీద వెంకట్ సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ, టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు 'పెద్ది' టైటిల్ ఖరారు చేశారని టాక్. ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత యువ దర్శకులు అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో సినిమాలు చేయనున్నారు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

