అన్వేషించండి

Star Maa Serials TRP Ratings: టీఆర్పీలో మళ్ళీ ఫస్ట్ ప్లేసుకు కార్తీక దీపం 2... స్టార్ మా, జీ తెలుగులో ఈ వారం టాప్ 10 రేటింగ్స్ లిస్టు

Telugu Serials TRP Ratings Latest: 'కార్తీక దీపం 2' సీరియల్ మరోసారి టాప్ లేపింది. టీఆర్పీ రేటింగుల్లో తనకు ఎదురులేదని మళ్లీ మొదటి స్థానానికి వచ్చింది. ఈ వారం టాప్ 10 లిస్టులో ఏవేవి ఉన్నాయో తెలుసా?

Top 10 Telugu serial list TRP Ratings: 'కార్తీక దీపం 2 నవ వసంతం' సీరియల్ మరోసారి టాప్ లేపింది. టీఆర్పీ రేటింగుల్లో తనకు ఎదురు లేదని మళ్లీ చాటి చెప్పింది. గత రెండు మూడు వారాలుగా ఆ సీరియల్ ఆశించిన స్థాయిలో ఆదరణ అందుకోలేదు. అయితే మళ్లీ మొదటి స్థానానికి వచ్చేసింది.‌ తర్వాత స్థానం కోసం స్టార్ మా ఛానల్ సీరియల్స్ మరో రెండు పోటీ పడ్డాయి.‌ మొత్తం మీద ఈ వారం... (ఈ 2025లో ఏడో వారం,‌ ఫిబ్రవరిలో మూడో వారం) తెలుగు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి? టాప్ 10 లిస్టులో ఏవేవి ఉన్నాయి? అనేది ఒకసారి చూడండి.

కార్తీక దీపం 2 దూకుడుకు సాటేది?
గుడి గంటలు, ఇల్లాలు మధ్య పోటీ!
ప్రతి వారం టీఆర్పీ రేటింగుల్లో స్టార్ మా సీరియల్స్ అధిపత్యం చాలా ఎక్కువ. మొదటి ఐదారు స్థానాలలో ఈ ఛానల్‌ సీరియల్స్ మనకు కనిపిస్తాయి. ఈ వారం కూడా 'స్టార్ మా' ఆధిపత్యం కనిపించింది.

'కార్తీక దీపం 2 నవ వసంతం' సీరియల్ ఈ వారం 13.75 టీఆర్పీ అందుకుంది‌‌. దానికి దరిదాపుల్లో మరో సీరియల్ లేదని చెప్పాలి. అయితే రెండో స్థానం కోసం రెండు సీరియల్స్ మధ్య బలమైన పోటీ నెలకొనడంతో టై ఏర్పడింది. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, ఆమని ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'తో పాటు 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్స్ సైతం 12.65 టీఆర్పీ అందుకుంది. మొదటి మూడు స్థానాలలో ఈ మూడు సీరియల్స్ ఉంటే...

'ఇంటింటి రామాయణం' సీరియల్ 12.64 టీఆర్పీ రేటింగుతో నాలుగవ స్థానంలో ఉంది. 'చిన్ని' (9.96), 'నువ్వుంటే నా జతగా' (8.31), 'మగువా ఓ మగువా' (7.05), 'బ్రహ్మముడి' (6.68), 'పలుకే బంగారమాయేనా' (6.17), 'మామగారు' (5.09) టీఆర్పీ అందుకున్నాయి.‌ 

మేఘ సందేశం... మళ్లీ టాప్ లేపింది!
జీ తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్ విషయానికి వస్తే... 'మేఘ సందేశం' సీరియల్ మరోసారి టాప్ లేపింది. దానికి 7.13 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత స్థానం కోసం మరో రెండు సీరియల్స్ మధ్య బలమైన పోటీ నెలకొన్నప్పటికీ... 6.97 టీఆర్పీతో 'చామంతి', 6.95 టీఆర్పీతో 'జగద్ధాత్రి' రెండు మూడు స్థానాల్లో నిలిచాయి.

Also Read:'శబ్దం' రివ్యూ: బొమ్మ భయపెట్టేలా ఉందా? లేదా? తమన్ మ్యూజిక్ అదుర్స్... మరి, ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ హిట్టేనా? కాదా? 

జీ తెలుగులో మిగతా సీరియల్స్ విషయానికి వస్తే... 'పడమటి సంధ్యారాగం' (6.77), 'నిండు నూరేళ్ళ సావాసం' (6.03), 'అమ్మాయి గారు' (5.98), 'ప్రేమ ఎంత మధురం' (3.85), 'మా అన్నయ్య' (3.58), 'గుండమ్మ కథ' (3.50), 'కలవారి కోడలు కనక మహాలక్ష్మి' (3.43), 'ఉమ్మడి కుటుంబం' (3.10), 'ముక్కుపుడక' (3.29) టీఆర్పీ అందుకున్నాయి. 

జెమినీ టీవీ సీరియళ్లలో ఒక్క సీరియల్ కూడా వన్ టీఆర్పీ దాటలేదు. 'శ్రీమద్ రామాయణం' 0.95 టీఆర్పీతో అందుకుంది. ఈటీవీ సీరియల్స్ విషయానికి వస్తే... 'రంగుల రాట్నం' (3.66), 'బొమ్మరిల్లు' (3.07), 'మనసంతా నువ్వే' (3.57), 'ఝాన్సీ' (3.03) టీఆర్పీ సాధించాయి.

Also Readఅగత్యా రివ్యూ: భయానికి, వినోదానికి మధ్య సంఘర్షణ... తమిళ హారర్ కామెడీ ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: స్టాలిన్‌ సమావేశానికి వెళ్తామని కేటీఆర్ ప్రకటన - మరి రేవంత్ హాజరైతే ?
స్టాలిన్‌ సమావేశానికి వెళ్తామని కేటీఆర్ ప్రకటన - మరి రేవంత్ హాజరైతే ?
Telangana Assembly: స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు - అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు - అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్
Microsoft AP Govt:  రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
Pavatmala National Ropeway: పర్వతమాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రోప్‌వేలు.. నిర్మించనున్న భారత్
పర్వతమాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రోప్‌వేలు.. నిర్మించనున్న భారత్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kerala teen dies due to water fasting | వాటర్ డైట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన కేరళ యువతీ | ABP DesamYS Jagan YSRCP Formation Day | మెడలో పార్టీ కండువాతో కనిపించిన జగన్..రీజన్ ఏంటంటే | ABP DesamPithapuram Public Talk on Pawan Kalyan | కళ్యాణ్ గారి తాలుకా అని పిఠాపురంలో చెప్పుకోగలుగుతున్నారా.?Gun fire in Chittoor Locals Rescue Operation | పోలీసుల వచ్చేలోపే గన్నులతో ఉన్న దొంగలను పట్టుకున్న స్థానికులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: స్టాలిన్‌ సమావేశానికి వెళ్తామని కేటీఆర్ ప్రకటన - మరి రేవంత్ హాజరైతే ?
స్టాలిన్‌ సమావేశానికి వెళ్తామని కేటీఆర్ ప్రకటన - మరి రేవంత్ హాజరైతే ?
Telangana Assembly: స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు - అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు - అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్
Microsoft AP Govt:  రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
రెండు లక్షల మంది ఏపీ యువతకు ఏఐలో శిక్షణ - మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
Pavatmala National Ropeway: పర్వతమాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రోప్‌వేలు.. నిర్మించనున్న భారత్
పర్వతమాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రోప్‌వేలు.. నిర్మించనున్న భారత్
రీల్స్ పంపించుకుంటూ ..అమ్మాయిలు ఇలా ఉన్నారు
రీల్స్ పంపించుకుంటూ ..అమ్మాయిలు ఇలా ఉన్నారు
Bandi Sanjay: మీరు వినబోయేది నమో నమో పాట -  పాడిన వారు బండి సంజయ్ !
మీరు వినబోయేది నమో నమో పాట - పాడిన వారు బండి సంజయ్ !
చెప్పినట్టుగానే బైక్ ఇచ్చేసిన కిరణ్ అబ్బవరం
చెప్పినట్టుగానే బైక్ ఇచ్చేసిన కిరణ్ అబ్బవరం
Viral News: అమెరికా మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు ఇండియాలో పట్టివేత -  ఏకంగా 8 లక్షల కోట్ ఫ్రాడ్ మరి !
అమెరికా మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు ఇండియాలో పట్టివేత - ఏకంగా 8 లక్షల కోట్ ఫ్రాడ్ మరి !
Embed widget