Bandi Sanjay: మీరు వినబోయేది నమో నమో పాట - పాడిన వారు బండి సంజయ్ !
Singer Sanjay : రాజకీయ నాయకులు పాటలు పాడటం చాలా అరుదు. ఇలాంటి అరుదైన ఫీట్ ను బండి సంజయ్ చేశారు. ఆయన పాట పాడారు.

Bandi Sanjay Sang a song : మడిసన్నాక ..కూతంత కళాపోషణ ఉండాలంటాడు ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలవు. ఆయన అన్నాడని కాదు కానీ దాదాపు అందరికీ ఏదో విషయంలో కళలను పోషిస్తూనే ఉంటారు. అయితే రాజకీయ నేతలు మాత్రం చాలా తక్కువ. వారు ఎక్కువగా కళలను ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే ఎదుటి వారు కళా ప్రదర్శన చేస్తే చూసి చప్పట్లు కొట్టి బహుమతులు ఇస్తూంటారు. కానీ కొద్ది మంది మాత్రం తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు బండి సంజయ్ తన ప్రతిభా ప్రదర్శన చేశారు.
బండి సంజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంజయ్ కు మోదీ ఓ దేవుడు. ఆయనను మాములుగానే బహిరంగసభల్లో పొగడ్తలతో ముంచెత్తుతారు. ఇప్పుడు ఆయన కోసం సింగర్ అవతారం ఎత్తారు. ఏకంగా ఓ పాట పాడేశారు.
'నమో.. నమో.. నరేంద్ర మోదీ' సాంగ్‌కు తన గొంతు కలిపారు. 'నమో.. నమో.. నరేంద్ర మోదీ.. పలుకుతున్నది యువత నాడీ.. ప్రధానిగా తమరే కావాలని.. అంటున్నది మన భరతజాతి.. రామ.. లక్ష్మణ జానకీ.. జైబోలో హనుమానుకి' అంటూ సంజయ్ పాట పాడారు. ఈ పాటను రిలీజ్ చేశారో లేదో ఇంకా స్పష్టత లేదు. కానీ ఆయన పాట పాడుతున్నప్పుడు రికార్డు చేసిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇది క్షణాల్లో వైర్లఅయిపోయింది. బీజేపీ కార్యకర్తలు సంజయ్ పాడిన పాటను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేస్తున్నారు. పాట అద్బుతంగా పాడారని ప్రశంసించారు. అయితే ఇది ఎన్నికలకు ముందు పాడిన పా ట అని ఇప్పుడు వైరల్ చేస్తున్నారని అటున్నారు.
బండి సంజయ్ అన్న నోట @narendramodi ji గారి పాట...@bandisanjay_bjp 👍
— Sravan Kumar Erumalla (@Sravan4Jn) March 13, 2025
ఎన్నికల ముందు పాడిన పాట pic.twitter.com/L2iqQmStcr
సినీ రంగం నుంచి వచ్చిన వారు తప్ప.. ఇతరులు ఇలా పాటలు పాడే ధైర్యం చేయలేరు. ఎందుకంటే.. పాట ఎలా ఉన్నా సరే ట్రోలింగ్ చేసేందుకు చాలా మంది రెడీగా ఉంటారు. ఇప్పటికీ కొంత మంది బండి సంజయ్ ను ట్రోల్ చేస్తున్నారు. కానీ అది కూడా ఆయన పాటకు మరింత రీచ్ తీసుకు వస్తోంది. త్వరలో ఈ పాటను అధికారికంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా పబ్లిసిటీ... పబ్లిసిటీనే అది .. పాజిటివా.. నెగటివా అన్నది మ్యాటర్ కాదు. ఒక్కోసారి నెగెటివ్ పబ్లిసిటీనే చాలా మేలు చేస్తుంది.ఇప్పుడు బండి సంజయ్ పాట కూడా ఈ నెగటివ్ పబ్లిసిటీతోనే వైరల్ అయ్యే అవకాశం ఉంది.
ఏదైతే జరగద్దు అనుకున్నానో అదే జరిగింది…
— levanth reddy (@pachakukka) March 13, 2025
ఇక ఈ జీవితానికి ఇది చాలు ..జన్మ దన్యం అయిపోయింది..
ఎవడన్నా కోహినూర్ డైమండ్ బ్రిటీష్ వాడు తీసుకపోయిండ్ అన్నది అందులో ఒక ముక్క కరీంనగర్ లో పడ్డది ..
కరీంనగర్ వాళ్ళు చేసుకున్న అదృష్టం .. pic.twitter.com/ojPOCk4uwA
కొత్తగా ఉంటే కొలవెరి పాటలా.. దేశవ్యాప్తంగా వైరల్ అయిపోతుంది. అప్పుడు బండి సంజయ్ సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకంటారు.





















