అన్వేషించండి

Hyderabad Metro Fact Check: "అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన

గురువారం అమీర్‌పేట్, మైత్రీవనం సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని కీలల ధాటికి మెట్రో పిల్లర్ క్రాక్ ఇచ్చిందని ప్రచారం సాగింది. దీన్ని అధికారులు ఖండించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమీర్‌పేట అగ్ని ప్రమాదం: మెట్రో పిల్లర్‌కు పగుళ్లు వచ్చాయని ప్రచారం.
  • HMRL ప్రమాదం లేదని, నిర్మాణం సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది.
  • వినైల్ షీట్లే కాలిపోయాయి; మెట్రో సేవలకు ఎటువంటి అంతరాయం లేదు.

Hyderabad Metro Fact Check: గురువారం అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కోట్లలో నష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న మెట్రో పిల్లర్‌కు పగుళ్లు వచ్చాయని ప్రచారం జోరుగా సాగింది. దీనిపై ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిశీలన జరిపారు. ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తేల్చి చెప్పారు. జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారంగా కొట్టిపారేశారు. 

జూన్ 4, 2026 గురువారం మధ్యాహ్నం అమీర్‌పేట్, మైత్రీవనం సమీపంలోని  కెఎస్సార్ ఫ్యాషన్స్ (హెల్మెట్ బజార్) షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ భవనం మెట్రో పిల్లర్ నంబర్ A1043కి సమీపంలో ఉంది. దీంతో మంటల తీవ్రతకు పిల్లర్‌కు పగుళ్లు వచ్చాయంటూ సోషల్ మీడియాలో  కొన్ని వార్తా ఛానళ్లలో విస్తృతంగా ప్రచారమైంది.  

అమీర్‌పేట్‌లోని మెట్రో పిల్లర్ నంబర్ A1043కి గానీ, ఇతర మెట్రో వ్యవస్థకు గానీ ఈ ప్రమాదంతో నష్టం వాటిల్లలేదని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారికంగా స్పష్టం చేశారు. ఆస్తులన్నీ యథావిధిగా, సురక్షితంగా ఉన్నాయని అధికారులు తెలియజేశారు. మంటల సెగలకు పిల్లర్‌పై ఉన్న వినైల్ అడ్వర్టైజ్‌మెంట్ షీట్లు మాత్రమే కాలిపోయాయని చెప్పారు. లోపలి ప్రధాన కాంక్రీట్ పిల్లర్‌కు గానీ, ఇతర నిర్మాణ, నిర్వహణ భాగాలకు గానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదన్నారు. దట్టమైన పొగ కారణంగా ప్రయాణికులకు కాస్త ఇబ్బంది కలిగినప్పటికీ.. మెట్రో రైలు సేవలకు ఎక్కడా అంతరాయం కలగలేదన్నారు. 

రైళ్ల రాకపోకలు సాధారణంగానే కొనసాగాయని, అయినప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా ప్రమాదం జరిగిన ప్రాంతంలోని మెట్రో ఆస్తులపై అధికారులు లోతైన పరిశీలన చేసినట్టు వెల్లడించారు. మెట్రో మౌలిక సదుపాయాలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని మెట్రో అధికారులు ప్రకటించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిచేస్తున్నాయని HMRL నిర్ధారించింది.

పౌరులు ఇటువంటి పుకార్లను నమ్మవద్దని మెట్రో ఎండీ విజ్ఞప్తి చేశారు. కేవలం అధికారిక ప్రకటనలు, ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని  కోరారు.  

Frequently Asked Questions

అమీర్‌పేటలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం ఎప్పుడు, ఎక్కడ జరిగింది?

జూన్ 4, 2026 గురువారం మధ్యాహ్నం అమీర్‌పేటలోని కెఎస్సార్ ఫ్యాషన్స్ (హెల్మెట్ బజార్) షాపింగ్ కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో కోట్లలో నష్టం వాటిల్లింది కానీ ప్రాణ నష్టం లేదు.

అగ్నిప్రమాదం కారణంగా మెట్రో పిల్లర్‌కు నష్టం వాటిల్లిందా?

లేదు, మెట్రో పిల్లర్ నంబర్ A1043కి లేదా ఇతర మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని HMRL అధికారులు స్పష్టం చేశారు. మంటల సెగలకు కేవలం పిల్లర్‌పై ఉన్న వినైల్ అడ్వర్టైజ్‌మెంట్ షీట్లు మాత్రమే కాలిపోయాయి.

అగ్నిప్రమాదం సమయంలో మెట్రో రైలు సేవలకు అంతరాయం కలిగిందా?

లేదు, మెట్రో రైలు సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. రైళ్ల రాకపోకలు సాధారణంగానే కొనసాగాయి. దట్టమైన పొగ కారణంగా ప్రయాణికులకు కాస్త ఇబ్బంది కలిగింది.

మెట్రో పిల్లర్ పగుళ్ల గురించి వస్తున్న వార్తలపై HMRL ఏం ప్రకటించింది?

మెట్రో పిల్లర్‌కు పగుళ్లు వచ్చాయనే ప్రచారాన్ని HMRL మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కొట్టిపారేశారు. అదంతా తప్పుడు ప్రచారమని, పౌరులు కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget