అన్వేషించండి

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!

Hyderabad Fire Accident: తెలుగురాష్ట్రాలు ముద్దుగా USA అని పిలుచుకునే అమీర్‌పేటలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. బొమ్మల దుకాణంలో చెలరేగిన మంటలు భారీ నష్టాన్ని కలిగించాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్ అమీర్‌పేటలో బొమ్మల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
  • మంటలు పక్కనున్న 20 దుకాణాలకు వ్యాపించి, భవనం దగ్ధమైంది.
  • మంటలు, పొగతో ట్రాఫిక్ జామ్, పోలీసులు దారి మళ్ళించారు.

Hyderabad Fire Accident: హైదరాబాద్ సిటీ నడిబొడ్డు అమీర్‌పేటలో మెయిన్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రీవనం సమీపంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న ఓ బొమ్మల దుకాణంలో మంటలు చెలరేగాయి. అవి ఆర్పేలోపు మొత్తం ఆ బిల్డింగ్‌లో ఉన్న అని దుకాణాలకు వ్యాపించాయి. చుట్టుపక్కల షాపులు అన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలు కమ్ముకున్న పొగతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. 

బొమ్మల దుకాణం నుంచి..

బొమ్మల దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న KSR ఫ్యాషన్స్ అనే బట్టల దుకాణానికి అంటుకోవడంతోనే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. మొత్తం బిల్డింగ్ మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగలబడిపోయింది. భగభగ మండే మంటలతో దగ్గరకు వెళ్లటానికి సైతం అగ్నిమాప సిబ్బంది భయపడిపోయారు.  

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!

20కిపైగా దుకాణాలు దగ్ధం.

బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోతున్న విజువల్స్ చుట్టు పక్కల వాళ్లను భయాందోళనలకు గురి చేశాయి. మూడు అంతస్తుల ఈ బిల్డింగ్ మొత్తం కాలిబూడిద అయ్యింది. ఈ బిల్డింగ్ చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాపులు ఇలా చాలా షాపులు ఉన్నాయి. వీటిలో 20కిపైగా షాపులు కాలిబూడిదైనట్టు తెలుస్తోంది.  మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు వ్యాపించాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అందరూ వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి పరుగులు తీశారు. 

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!

భారీగా ట్రాఫిక్ జామ్

విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. KSR ఫ్యాషన్స్ షాపులో అన్నీ దుస్తులు కావటంతో మంటల స్థాయిలో తీవ్రంగా ఉందంటున్నారు అధికారులు. పొగ, మంటలు కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ మార్గాంలో వచ్చే వాహనాలను దారి మళ్లించారు. ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. 

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!

Frequently Asked Questions

ఈ అగ్నిప్రమాదం ఎక్కడ జరిగింది?

హైదరాబాద్‌లోని అమీర్‌పేట మెయిన్ రోడ్డులో, మైత్రీవనం సమీపంలో ఈ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూడు అంతస్తుల బిల్డింగ్‌లో 20కిపైగా దుకాణాలు దగ్ధమయ్యాయి.

మంటలు ఎలా చెలరేగి, వ్యాపించాయి?

బొమ్మల దుకాణంలో మొదలైన మంటలు పక్కనే ఉన్న KSR ఫ్యాషన్స్‌కు వ్యాపించాయి. దుస్తులు ఉండటంతో మంటలు తీవ్రమై, మొత్తం బిల్డింగ్ మరియు చుట్టుపక్కల 20కి పైగా షాపులు దగ్ధమయ్యాయి.

అగ్నిప్రమాదం వల్ల తక్షణ ప్రభావం ఏమిటి?

మంటలు, పొగ కారణంగా ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట మధ్య భారీ ట్రాఫిక్ జామ్ అయ్యి రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy America Tour Cancelled: తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget