అన్వేషించండి

Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు

Ameerpet Fire Accident: అమీర్‌పేట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం.. నగర రవాణా వ్యవస్థకు గుండెకాయ లాంటి మెట్రో రైలు నెట్‌వర్క్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. సమీపంలో ఉన్న పిల్లర్‌కు క్రాక్ వచ్చింది.

Ameerpet Fire Accident Metro Pillar 1043 Crack: హైదరాబాద్‌ నగరంలో అత్యంత రద్దీగా ఉండే అమీర్‌పేట్ ప్రాంతంలో జరిగిన ఒక భారీ అగ్నిప్రమాదం.. నగర రవాణా వ్యవస్థకు గుండెకాయ లాంటి మెట్రో రైలు నెట్‌వర్క్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. అమీర్‌పేట్‌లో మంటలు చెలరేగిన ఒక వాణిజ్య భవనానికి కేవలం అడుగు దూరంలోనే ఉన్న 1043 నంబర్ మెట్రో పిల్లర్ ఈ ప్రమాద తీవ్రతకు గురైంది. మంటల నుంచి వెలువడిన విపరీతమైన వేడి, అగ్ని సెగలు నేరుగా పిల్లర్‌కు తాకడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నగరవాసుల్లో వ్యక్తమైంది.

ఈ ప్రమాద తీవ్రత కారణంగా సదరు 1043 నంబర్ మెట్రో పిల్లర్‌కు స్వల్పంగా క్రాక్  వచ్చినట్లు గుర్తించడంతో మెట్రో రైలు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణించే మెట్రో మార్గం కావడంతో.. పిల్లర్ అంతర్గత నిర్మాణానికి ఏమైనా నష్టం వాటిల్లిందా? భవిష్యత్తులో దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా? అనే కోణంలో అధికారులు తక్షణ రక్షణ చర్యలు ప్రారంభించారు.   

పిల్లర్ నాణ్యత, భద్రతను శాస్త్రీయంగా అంచనా వేసేందుకు జేఎన్‌టీయూ కు చెందిన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నిపుణుల బృందం అత్యవసరంగా రంగంలోకి దిగింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రత్యేక డివైజ్‌లు, అల్ట్రాసోనిక్ టెస్టింగ్ పరికరాలను ఉపయోగించి నిపుణులు పిల్లర్ నాణ్యత, కాంక్రీట్ సామర్థ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. మంటల వేడి వల్ల పిల్లర్ లోపలి ఇనుప చువ్వలు ఏమైనా బలహీనపడ్డాయా అనే కోణంలో లోతుగా తనిఖీలు చేపట్టారు.

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు మెట్రో అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆ మార్గంలో మెట్రో రైళ్ల వేగాన్ని తాత్కాలికంగా నియంత్రించడం లేదా నిశితంగా పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అమీర్‌పేట్ మెట్రో కారిడార్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ గ్రౌండ్ లెవెల్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న జేఎన్‌టీయూ నిపుణుల బృందం అందించే తుది నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. ఒకవేళ పిల్లర్ నాణ్యత దెబ్బతిన్నట్లు నివేదికలో తేలితే.. దానికి ప్రత్యేక కెమికల్ గ్రౌటింగ్ చేయడం లేదా అదనపు జాకెటింగ్ వేసి పిల్లర్ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు ఇంజనీరింగ్ విభాగం రెడీ  అవుతోంది.   

అగ్నిప్రమాదం కారణంగా తీవ్రనష్టం జరిగింది.  పలు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి.  ట్రాఫిక్  అంతరాయం ఏర్పడింది. 

 

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: దేశాభివృద్ధిలో దక్షిణాది కీలక పాత్ర: నేడు హైదరాబాద్ వేదికగా ఏబీపీ 'సదరన్ రైజింగ్ సమ్మిట్'
హైదరాబాద్ వేదికగా ABP సదరన్ రైజింగ్ సమ్మిట్, షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్ థీమ్‌.. ఎక్కడ చూడాలంటే?
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget