అన్వేషించండి

Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు

Top Stories Today | జూన్5న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, సినీ, క్రీడా ఇతర రంగాల వార్తల అప్‌డేట్స్ ఇక్కడ అందిస్తున్నాం. పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

Top Stories Today | తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా న్యూస్ అప్‌డేట్స్‌ కోసం ఈ పేజ్‌ను ఫాలో అవ్వండి.

YSRCP Former MLA Brahmanaidu Arrested in Land Grabbing Case: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు 

YSRCP Former MLA Brahmanaidu Arrested in Land Grabbing Case: భూకబ్జాల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గండిపేటలో ఫేకే జీవోలతో భూములు కబ్జా చేసినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. 

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్) నార్లాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీ-1 డెలివరీ సిస్టర్న్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆయనతోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. పీఆర్ఎల్‌ఐఎస్ పంప్‌హౌస్‌ లను కూడా పరిశీలించారు. 1.5 కి.మీ దూరం టన్నెల్ లో ప్రయాణించి పంప్ హౌస్ లను పరిశీలించారు.  

"ఒక్కో పోస్టు 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 

టిటిడిలో  60 ఇంజనీరింగ్ పోస్టులు భర్తీలో అక్రమాలు జరిగాయని మాజీ టీటీడీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు.  దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 27 ఏ.ఈ,ఈ,  10 ఏ.ఈ, 19 ఏ.టి.ఓ, విద్యుత్ జె.ఈ 4 పోస్ట్ లు భర్తీకి జగన్ ఆదేశాలతో 23.11.2023న నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపార. దీనికి 30వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. రాయలసీమ  ప్రాంత వాసులకు ప్రత్యేక కేటాయింపులు లేవని న్యాయ వివాదాలు తలెత్తే  ఛాన్స్ ఉందని అప్పట్లో నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపేసినట్టు పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత భర్తీ చేస్తామని భావించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి  వచ్చి బి.ఆర్ నాయుడు టిటిడి చైర్మన్ అయిన ఏడాదిన్నర తర్వాత  మే 10,11న నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. లీగల్ సమస్యలు తలెత్తుతాయని నోటిఫికేషన్ నిలిపివేస్తే, అదే నోటిఫికేషన్ యథావిధిగా ఇచ్చారన్నారు. 

2 పోస్టులకు, 3 మూడు పోస్టులకు ఒకే చోట పరీక్ష రాసే అవకాశం ఇస్తామని చెప్పి సాంకేతిక కారణాలు చూపించి ఇవ్వలేదన్నారు. సెంటర్స్ మార్పులు చేశారని తెలిపారు. దీనివల్ల 18 వేల మందే పరీక్షలకు హాజరయ్యారని గగుర్తు చేశారు. దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. టిటిడి చైర్మన్, ఆయనకు కొమ్ముకాసే ఇద్దరు సభ్యులు సహకారంతో ఒక్కో పోస్ట్ 30-40లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. 

న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చారని, 2024-25 ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించలేదన్నారు. రాష్ట్రం మొత్తం ఒకే జోన్ గా పరిగణించారని, రాయలసీమ ప్రాంతం వారికి అన్యాయం జరిగిందని వాపోయారు. రాయలసీమ ప్రాంత వాసులకు ప్రత్యేక అవకాశం కల్పించాలనే ఆరోజు నోటిఫికేషన్ రద్దు చేశామని గుర్తు చేశారు. తాజా నోటిఫికేషన్‌లో రాష్ట్రం మొత్తం ఒకే జోన్ కిందకు తీసుకు వచ్చారని తెలిపారు. ఒక్కో పోస్ట్ లక్షలాది రూపాయలకు పోస్ట్ లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. 
 

Annamalai is coming up with a new party in Tamil Nadu: తమిళనాడులో కొత్త పార్టీతో వస్తున్నట్టు అన్నామలై!

Annamalai is coming up with a new party in Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రానుంది. మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ బీజేపీ లీడర్ అన్నామలై పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని కోరానని అన్నారు. అందుకే ఆ పార్టీ అంగీకరించలేదన్నారు. అందుకే ఆ పార్టీకి భారం కాకూడదనే తాను బీజేపీకి రాజీనామా చేసినట్టు అన్నామలై వెల్లడించారు. 

విశాఖలో సైకిల్‌పై తిరిగిన చంద్రబాబు- మొక్కలు నాటిన వాళ్లకే టికెట్లు అంటా కామెంట్స్

విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ మొక్కని నాటారు. తిరుమలలో గ్రీనరీ త్వరలో 90 శాతానికి చేరుకోబోతోందన్నారు ముఖ్యమంత్రి. విశాఖ ఏయూలో మాత్రం కేవలం 25 శాతం మాత్రమే గ్రీనరీ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రీనరీ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఏయూ వీసీని సీఎం ఆదేశించారు. 

ఈ సందర్భగా ముఖ్యంత్రి చంద్రబాబు సరదా కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మొక్కలు బాగా పెంచిన  వాళ్లకే టిక్కెట్లంటూ నవ్వుతూ చెప్పారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రితోపాటు పాల్గొన్న శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

పచ్చదనం, పర్యావరణానికి క్యాంపస్ ఆదర్శంగా మారాలని చంద్రబాబు సూచించారు. "నెట్ జీరో క్యాంపస్‌గా ఏయూ తయారు కావాలి. ఎంతో మంది బ్రహ్మండమైన నాయకులను ఏయూ తయారు చేసింది. ఎండలు విపరీతంగా పెరిగింది.. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. అయితే విపరీతమైన ఎండలు.. లేకుంటే తుఫానులు వస్తున్నాయి. సోలార్ ఉత్పత్తి చేసుకోవాలి... ఏయూకు 450 ఎకరాల ల్యాండ్ ఉంది. ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెట్టాలి... బిల్డింగులపై సోలార్ ప్యానెళ్లు పెట్టాలి. క్యాంపస్ కు అవసరమైన విద్యుత్ సోలార్ ద్వారానే వచ్చేలా చూడాలి. తిరుమలలో 89.5 శాతం గ్రీనరీ ఉంది. ఏయూ క్యాంపస్ బయో డైవర్శిటీ పార్కుగా రూపాంతరం చెందాలి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేపట్టాలి. వేస్ట్ నుంచి బయో గ్యాస్ ఉత్పత్తి చేసేలా చూడాలి. స్వచ్ఛ పథం కింద రీ-సైక్లింగ్ కు పంపాలి. వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లను వినియోగించుకోవాలి. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేపట్టాలి. పీఎన్జీ, ఎలక్ట్రికల్ స్టవ్స్ ను వినియోగించుకోవాలి. నెట్ జీరో విధానం అమలు చేయడానికి ప్రోఫెసర్స్ టీం ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఏయూ క్యాంపస్ ఓ నాలెడ్జ్ హబ్ మాదిరిగా తయారు కావాలి. నెట్ జీరో విధానాన్ని అన్ని విద్యా సంస్థలను గైడ్ చేసేలా అభివృద్ధి చేయాలి. యూనివర్శిటీ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నాం. " అని అన్నారు. 

ఇవాళ పర్యావరణ దినోత్సవం.. ప్రజలకు అవగాహన పెంచేందుకు సైకిల్ మీదే ప్రయాణించినట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు. సైకిలింగ్ అనేది జీవన విధానం కావాలని సూచించారు. ప్రత్యేకంగా సైకిలింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 5 కోట్ల సీడ్ బాల్స్ తో గ్రీనరీ పెంచేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. విశాఖలో 50 శాతం గ్రీనరీ పెంచేలా చర్యలు చేపడతున్నామని, విశాఖలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పోర్టు దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్లోనూ చర్యలు తీసుకుంటామన్నారు. 
విశాఖ పర్యటనలో చంద్రబాబు ఏయూ క్యాంపస్ నుంచి నోవోటెల్ హోటల్ వరకు సైకిల్‌పై ప్రయాణించారు. ముఖ్యమంత్రితో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ వీధుల్లో సైకిల్ ర్యాలీ చేపట్టారు. తిరుగు ప్రయాణంలో కూడా సైకిల్ మీదే హెలీప్యాడ్ కు చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు.

BJP Accepts Annamalai's Resignation : అన్నామలై రాజీనామా ఆమోదించిన బీజేపీ- కాసేపట్లో మాజీ ఐపీఎస్ కీలక ప్రెస్‌మీట్

BJP Accepts Annamalai's Resignation : అన్నామలై రాజీనామాను బీజేపీ అమోదించింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ తన రాజీనామాను ఆమోదించడంతో మాజీ ఐపీఎస్ అధికారి కాసేపట్లో కీలక ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. తన భవిష్యత్ కార్యచరణపై ప్రకటన చేస్తారు. 

Karnataka Minister Ramlinga Reddy: కర్ణాటక ముఖ్యమంత్రి డీకేకు రెండో రోజే షాక్ ఇచ్చిన సీనియర్ మంత్రి - రామలింగారెడ్డి రాజీనామా!

Karnataka Minister Ramlinga Reddy: కర్ణాటక పోర్ట్‌పోలియోపై అసంతృప్తిగా ఉన్న రామలింగారెడ్డి మంత్రిపదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ విస్తరణ రెండోరోజే ముఖ్యమంత్రి డీకేకు ఝలక్ ఇచ్చారు. 

Delhi Fire Accident: ఢిల్లీ నొయిడాలో భారీ అగ్ని ప్రమాదం 

Delhi Fire Accident:ఢిల్లీ నొయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఐవీ కౌంటీ అపార్ట్మెంట్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. 12వ అంతస్తులోని ఓ ప్లాట్‌లో ప్రమాదం జరిగింది. 

ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ నోటిఫికేషన్ విడుదల- ఆగస్టులో పరీక్షలు! పూర్తి షెడ్యూల్ ఇదే. 

AP TET 2026 Schedule Released TET Notification on June 5 Exams from August 5 to 21: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు, సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు మంత్రి నారా లోకేష్ గుడ్‌న్యూస్ చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET-2026) రాసే అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఏపీ టెట్-2026 పరీక్షల షెడ్యూల్ గురువారం అర్ధరాత్రి విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా టెట్ పూర్తి వివరాలను, తేదీలను వెల్లడించారు. టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ ప్రకటనతో రేపు డీఎస్సీలో మార్కులు పెంచుకోవడానికి మార్గం సుగమమైంది.

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ జూన్ 5వ తేదీన (శుక్రవారం నాడు) ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది.  నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే అంటే, నేటి నుంచే(జూన్ 5 నుంచి) జులై 5 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అప్పటి వరకు పరీక్ష ఫీజులు చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఏపీ టెట్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన అనంతరం, జులై 25వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టెట్ పరీక్షలను ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానం (Computer Based Test)లో రోజూ రెండు పూటలు చొప్పున జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. టెట్ ఎగ్జామ్స్ పూర్తయిన కొన్ని రోజులకే ఆగస్టు 24న ప్రాథమిక కీ (ప్రావిజనల్ కీ)ని, సెప్టెంబర్ 8న ఫైనల్ కీని విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను వెల్లడించనున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

AP TET 2026 ముఖ్యమైన తేదీలివే..

  • నోటిఫికేషన్: జూన్ 5న ఏపీ టెట్ అధికారిక నోటిఫికేషన్ విడుదల
  • దరఖాస్తుల స్వీకరణ: జూన్ 5 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, ఫీజులు చెల్లించేందుకు అవకాశం 
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: జులై 25 నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • టెట్ ఎగ్జామ్ డేట్స్: ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు.
  • మొదటి సెషన్: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
  • రెండో సెషన్: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
  • ప్రాథమిక కీ విడుదల: ఆగస్టు 24న ప్రాథమిక కీ విడుదల చేస్తారు.
  • ఫైనల్ కీ విడుదల: సెప్టెంబర్ 8న ఫైనల్ కీ (AP TET Final Key) విడుదల 
  • ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
 Team India Management Confusion: సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Embed widget