అన్వేషించండి

YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!

YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో ఈడీ దూకుడుగా ఉంది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను బేస్ చేసుకొని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మద్యం కుంభకోణంపై జగన్‌కు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
  • సిట్ విచారణలో అక్రమ మద్యం విధానం, ఆర్థిక లావాదేవీలు బయటపడ్డాయి.
  • రూ.3500 కోట్లు ప్రజాధనం అక్రమంగా చేతులు మారినట్లు గుర్తించారు.
  • ఈడీ అంతిమ లబ్ధిదారులను గుర్తించేందుకు కీలక ఆధారాలు సేకరించింది.

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే సంచలనం చోటు చేసుకోనంది. మద్య కుంభకోణం దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు నోటీసులు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన వారి చుట్టూ తిరిగిన దర్యాప్తు ఇప్పుడు అంతి లబ్ధిదారులను గుర్తించే దిశగా సాగుతోందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన అధికారులు ఇప్పుడు జగన్ పాత్రపై విచారించేందుకు రెడీ అయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.   

జగన్‌కు నోటీసులు అని ప్రచారం

ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అభియోగాలు ఆధారంగా ఈడీ అధికారులు కూడా వందల మందిని విచారించారు. బండిళ్ల కొద్ది సమాచారాన్ని సేకరించారు. వాటి ఆధారంగా కేసు దర్యాప్తును ముగించాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఇప్పటి వరకు లభించిన సాక్ష్యాలు, ఆధారాలను బట్టి కీలక వ్యక్తులను విచారిస్తారని తెలుస్తోంది. అందులో భాగంగానే త్వరలోనే జగన్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

కేసు బ్యాక్‌గ్రౌండ్ ఇదే

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. రేట్లు పెంచి మద్యం వినియోగం తగ్గిస్తామని చెప్పిన వైఎస్ జగన్ కొత్త పాలసీతో ఆ పని చేస్తామన్నారు. అయితే ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచారు. ఇలా పెంచడం వెనుక వ్యక్తిగత లబ్ధి ఉందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తునకు ఆదేశించింది. ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. 

రేట్లు పెంచి మూటలు వెనకేసుకున్నారని ఆరోపణలు

అధికారంలోకి వచ్చిన మొదట్లో వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచారు. దీని వల్ల మద్యం విక్రయాలు భారీగా పడిపోయాయి. ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గిపోయింది. అయితే మళ్లీ మద్యంపై ధరలు తగ్గించారు. దీంతో ఒక్కసారిగా విక్రయాలు పెరిగాయి. ఇలా చేయడంలో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. 

ఇలా భారీగా విక్రయాలు పెంచుకునే క్రమంలో లంచాలు ఇచ్చిన బ్రాండ్స్‌ను మాత్రమే ప్రమోట్ చేశారని, మిగతా బ్రాండ్స్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచలేదని ప్రధాన ఆరోపణ. ఇలా చేయడం వల్ల బ్రాండ్ల బేస్ ప్రైస్‌ను బట్టి ఒక్కో బాటిల్‌పై 150 నుంచి 600 రూపాయలు వసూలు చేసినట్టు వచ్చిన ఆరోపణలపై ఇప్పుడు దర్యాప్తు సాగుతోంది. దీనికి తోడు మద్యం దుకాణాల్లో కేవలం డిజిటల్ పేమెంట్స్‌ను అనుమతి ఇవ్వకపోవడంపై కూడా అనుమానాలు ఉన్నాయి. 

అందుకే కూటమి వచ్చిన వెంటనే ఈ వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తుకు ఆదేశించింది. ఈ దర్యాప్తులో రాజ్‌కసిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు తేలింది. అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్న అధికారులు, సప్లై చెయిన్‌ను పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై సిట్ ఇప్పటికే అభియోగపత్రం దాఖలు చేసింది. అందులో సంచలన విషయాలు వెల్లడించింది. 

ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న వ్యక్తులు 
మిథున్ రెడ్డి 
విజయసాయి రెడ్డి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 
రాజ్ కసిరెడ్డి 
కృష్ణ మోహన్ రెడ్డి 
ధనుంజయ్ రెడ్డి 
పీ. నాగేశ్వర్ రెడ్డి

3500 కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ అయ్యిందని, అక్రమ మార్గాల్లో చెలామణి అయ్యిందని సిట్‌ స్పష్టం చేసింది. విదేశాలకు చేరిందని కూడా సిట్ గుర్తించింది. ఈ కేసులో హవాలా హస్తం ఉందని రావడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కీలక నిందితులను, సాక్ష్యులను విచారించింది. వాటి ఆధారంగానే జగన్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

Frequently Asked Questions

వైఎస్ జగన్‌కు దేనికి నోటీసులు ఇవ్వబోతున్నారు?

మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు జగన్‌కు నోటీసులు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కీలక ఆధారాలు సేకరించిన అధికారులు జగన్ పాత్రపై విచారించేందుకు సిద్ధమయ్యారు.

ఈ కేసు దర్యాప్తులో ఈడీ ఎలా పాలుపంచుకుంది?

కూటమి ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత ఏర్పాటు చేసిన సిట్ అభియోగాల ఆధారంగా ఈడీ అధికారులు వందల మందిని విచారించారు. హవాలా హస్తం ఉండటంతో ఈడీ కేసులో ఎంట్రీ ఇచ్చింది.

వైసీపీ కొత్త మద్యం పాలసీపై ప్రధాన ఆరోపణలు ఏమిటి?

వైసీపీ అధికారం వచ్చిన తర్వాత మద్యం రేట్లు పెంచి, వినియోగం తగ్గిస్తామని చెప్పింది. అయితే, ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచడం, వ్యక్తిగత లబ్ధి, కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి.

మద్యం కుంభకోణంలో ఎంత ప్రజాధనం లూటీ అయ్యింది?

సిట్ నివేదిక ప్రకారం, 3500 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ అయ్యిందని, అక్రమ మార్గాల్లో చెలామణి అయ్యిందని స్పష్టం చేసింది. ఈ డబ్బు విదేశాలకు కూడా చేరిందని సిట్ గుర్తించింది.

మద్యం కుంభకోణం దర్యాప్తులో ఏ కీలక వ్యక్తులను విచారించారు?

ఈ కేసులో మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి పలువురు కీలక వ్యక్తులను విచారించారు. రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget