అన్వేషించండి

Opposition Crisis Deep Dive Analysis: ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?

ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీల మనుగడ ప్రమాదంలో పడిందా? బెంగాల్‌తోపాటు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి. దీనికి బాధ్యులు ఎవరు?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత రాజకీయాల్లో బలమైన ప్రతిపక్షాలు చీలికలతో సతమతమవుతున్నాయి.
  • టీఎంసీ, శివసేన, ఎన్సీపీలలో అంతర్గత కలహాలు, ఫిరాయింపులు పెరిగాయి.
  • కుటుంబ పాలన, దర్యాప్తు సంస్థల ఒత్తిడి ప్రధాన కారణాలు.

Opposition Crisis Deep Dive Analysis: ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం ప్రాణం లాంటిది. పాలకుల తప్పిదాలను ఎత్తి చూపుతూ, ప్రజల పక్షాన నిలబడాల్సిన విపక్షాలు నేడు భారత్‌ రాజకీయాల్లో ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఒకప్పుడు ఢిల్లీ పీఠాన్ని శాసించిన శక్తులు, రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యం వహించిన ప్రాంతీయ పార్టీలు నేడు అంతర్గత కలహాలు, ఫిరాయింపులు, సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్నాయి. ఢిల్లీ నుంచి దేశం అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. అయితే విపక్షాల ఈ పరిస్థితికి కారణం ఏంటీ? ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు పంపిస్తున్న సంకేతాలు ఏంటో చూద్దాం. 

మమతపై గడ్డిపూల తిరుగుబాటు

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు చోటుచేసుకుంది. బుధవారం నాడు తిరుగుబాటు ఎమ్మెల్యేలు తామే అసలైన తృణమూల్ అని స్పీకర్‌కు లేఖ రాశారు. ఎక్కువ మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నందున పార్టీ అధికారం ఇప్పటికే మమత చేతుల నుంచి జారిపోయింది. తృణమూల్ గుర్తుపై గెలిచిన 80 మందిలో, 60 మంది ఇప్పుడు రెబెల్స్‌గా మారారు. ప్రతిపక్ష నాయకురాలు రీటబ్రత బెనర్జీ విలేకరుల సమావేశంలో, "మేము తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాము" అని అన్నారు. 

శివసేనలో షిండే తిరుగుబాటు 

2022లో మహారాష్ట్రలో ఇలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. అప్పటి వరకు శివసేనలో నమ్మిన బంటుగా ఉంటూ వచ్చిన ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. ఉద్ధవ్ థాకరే శివసేన నుంచి మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు విడిపోయారు. వారి పిటిషన్ ఆధారంగా, ఎన్నికల సంఘం అప్పటి తిరుగుబాటు శిబిరాన్ని నిజమైన శివసేనగా ప్రకటించింది. షిండే నిజమైన శివసేన గుర్తించి 'బాణం, విల్లు' చిహ్నం లభించింది. బాలాసాహెబ్ థాకరే సృష్టించిన పార్టీ, ఆ పార్టీ చిహ్నం రెండూ థాకరే కుటుంబం నుంచి జారి పోయాయి. 

షిండే ఆదర్శంగా అజిత్ పవార్, రీటబ్రత బెనర్జీ  

తర్వాత ఎన్సీపీలో చీలక వచ్చింది. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ మెజారిటీ ఎమ్మెల్యేలతో పార్టీని వీడి వేరు కుంపటి పెట్టారు. తమదై నిజమైన ఎన్సీపీ అంటూ ప్రకటించారు. దీంతో శరద్ పవర్ కూడా తన ఒరిజినల్ పార్టీని కోల్పోయారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో కూడా అదే సీన్స్ రిపీట్ అవుతున్నాయి. 

అధికారం కోల్పోయిన త్రవాత "ఆప్"‌సోపాలు 

ఢిల్లీలో ఆప్‌ పరిస్థితి అలానే ఉంది. ఇప్పటికే మెజారిటీ ఎంపీలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. తమకను ఆప్‌ ఎల్పీని విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత పంజాబ్ వంతు వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఎన్నికలకు మరెంతో కాలం లేనందున అలాంటి పరిస్థితి లేకుండా నేరుగా ఎన్నికల ముందే పార్టీ చీలిపోనుందని అంటున్నారు. 

సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ వంటి పార్టీలు తమ ఉనికి కోసం నిరంతరం పోరాడాల్సి వస్తోంది. లోక్‌జనశక్తి లాంటి పార్టీలు ఇప్పటికే కుటుంబ కలహాలతో చీలిపోయాయి. 

తమిళనాడులో అన్నడీఎంకే ముక్కలు

తమిళనాడులో ద్రవిడ రాజకకీయ చరిత్రలో అన్నాడీఎంకేకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. ఎడప్పాడి పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం, శశికళ, టీటీవీ దినకర్‌ వర్గాలుగా విడిపోయారు. ఇలా విడిపోవడంతో తర్వాత ఎన్నికల్లో డీఎంకే భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఇప్పుడు విజయ్ టీవీకే అధికారం చేపట్టిన తర్వాత ఒరిజినల్ అన్నాడీఎంకే విడిపోతోంది. చాలా మంది ఎమ్మెల్యే తిరుగుబాటుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే కొందరు రాజీనామా చేశారు. మరికొందరు చర్చలు జరుపుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షమే లేదంటున్న కూటమి 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇరప్పుడు ప్రతిపక్ష హోదా చుట్టూ తిరుగుతున్నాయి. గత ఎన్నికల్లో 175 స్థానాలకు కానూ కేవలం 11 స్థానాలకే పరిమితం అయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ ఇప్పుడు అసెంబ్లీలో తన గొంతు వినిపించడానికి న్యాయపోరాటం చేస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కాలంటే పతి శాతం సభ్యులు ఉండాలి. అంటే రాష్ట్రంలో 18 సీట్లు సాధిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని కూటమి ప్రభుత్వ వాదన. కేవలం 11 సీట్లు ఉన్న జగన్ మోహన్ రెడ్డికి ఆ హోదా కల్పించలేమని స్పీకర్ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వేరే విపక్షం లేదని ఏకైక విపక్షం తమదే కాబట్టి కచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనంటూ వైసీపీ పట్టుబడుతోంది. దీనిపై హైకోర్టులో కేసు విచారణ సాగుతోంది. 

తెలంగాణలో కారుకు వలసల బెడద  

తెలంగాణలో పదేళ్లపాటు తిరుగులేని శక్తిగా వెలిగిన బీఆర్‌ఎస్‌ నేడు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరేందుకు యత్నించారు.నియోజకవర్గాల అభివృద్ధి కోసమే అని వారు చెబుతున్నా, అది బహిరంగంగా జరుగుతున్న ఫిరాయింపులుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఈ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ, అసెంబ్లీ స్పీకర్ ఇటీవల తీసుకున్న నిర్ణయం ఆపార్టీకి షాక్ ఇచ్చింది. సాక్ష్యాధారాలు లేవనే కారణంతో అనర్హత పిటిషన్లు కొట్టివేశారు. ఒకప్పుడు ఆపరేషన్ ఆకర్ష్‌ పేరుతో ఇతర పార్టీలను బలహీన పరిచిన బీఆర్‌ఎస్ ఇప్పుడు అదే వ్యూహానికి బలైపోతోంది.

ఫిరాయింపుల సమయంలోనే కవిత కూడా పార్టీకి షాక్ ఇచ్చింది. తన మాట చెల్లుబాటు కావడం లేదని తనను పట్టించుకోవడం లేదని తిరుగుబాటు జెండా 
ఎగరేశారు. దీంతో ఆమెపై అనర్హత వేటు పడటంతో టీఆర్‌ఎస్ పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ వేదిక ద్వారా తన తండ్రి పార్టీ ఓటర్లనే టార్గెట్ చేశారు. 

ప్రాంతీయ పార్టీలు ఎందుకు చీలిపోతున్నాయి?

రాజకీయ పార్టీలు సిద్ధాతాలు ప్రాతిపదికను కాకుండా కేవలం కొన్ని నిర్దిష్ట సమీకరణాల వల్లే ముక్కలవుతున్నాయని స్పష్టమవుతోంది. ప్రాంతీయ పార్టీలలో అత్యధికం కుటుంబ పార్టీలుగా మారడం వాటి పతనానికి ప్రధాన కారణం. అధినేత తర్వాత ఆ స్థానం వారసులకే దక్కాలనే పట్టుదల, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లలో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తోంది. మహారాష్ట్రో మహారాష్ట్రలో పవార్, బెంగాల్‌లో, యూపీలో యాదవ్ కుటుంబంలో జరిగిన గొడవలు దీనికి లైవ్ ఎగ్జాంపుల్స్

ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు ప్రస్తుత రాజకీయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయనే మరో ఆరోపణ బలంగా ఉంది. అవినీతి కేసుల విచారణలు ఎదుర్కొంటున్న చాలా మంది నాయుకులు, తమ రాజకీయ ఉనికిని , ఆస్తులను కాపాడుకోవడానికి అధికార పక్షంతో, కేంద్రంలో ఉన్న పార్టీతో కలవడానికో, లేదా సొంత పార్టీని చీల్చడానికో సిద్ధపడుతున్నారు. ఆధునిక రాజకీయంలో భావజాలం అనేదానికి విలువ లేకుండా పోయింది. ఒకప్పుడు బద్ధశత్రువులుగా ఉన్న పార్టీలు కేవలంం అధికారం కోసం జత కట్టడం ఆ తర్వాత ప్రయోజనాలు నెరవేరకపోతే చీలిపోవడం సర్వసాధారణమైపోయింది. 

విపక్షాలకు కాలం చెల్లిపోలేదు. కానీ వారి పాత పద్ధతులకు మాత్రం కాలం చెల్లింది. వారసత్వ రాజకీయాలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవడం, కేవలం అధికార పక్షాన్ని తిట్టడమే ఎజెండాగా పెట్టుకవడం వల్ల ప్రజల్లో విశ్వసనీయత తగ్గుతోంది. విపక్షాలు కేవలం ఎన్నికల పొత్తులపై కాకుండా, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడలి. అప్పుడే మళ్లీ ప్రజల ఆదరణను పొందగలవు. లేదంటే ప్రాంతీయ పార్టీల మనుగడ హిస్టరీగా మారిపోనుంది. 

Frequently Asked Questions

ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి?

భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు అంతర్గత కలహాలు, ఫిరాయింపులు, సాంకేతిక సమస్యలతో సతమతమవుతూ ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఒకప్పుడు బలమైన శక్తులుగా ఉన్నా, నేడు ఇవి బలహీనపడుతున్నాయి.

మహారాష్ట్ర శివసేనలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు పర్యవసానం ఏమిటి?

ఉద్ధవ్ థాకరే శివసేన నుండి మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు విడిపోయారు. ఎన్నికల సంఘం షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా ప్రకటించి 'బాణం, విల్లు' చిహ్నాన్ని వారికి కేటాయించింది.

ప్రాంతీయ పార్టీలు చీలిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

వారసత్వ రాజకీయాలు, కుటుంబ కలహాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి మరియు భావజాలం లేకపోవడం వంటివి ప్రాంతీయ పార్టీలు చీలిపోవడానికి ప్రధాన కారణాలు. సీనియర్ నాయకులలో అసంతృప్తి పెరుగుతోంది.

ప్రతిపక్ష పార్టీలు ప్రజల విశ్వసనీయతను ఎలా తిరిగి పొందగలవు?

ప్రతిపక్షాలు పాత పద్ధతులను వదిలి, కేవలం ఎన్నికల పొత్తులపై కాకుండా ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడాలి. అప్పుడే ప్రజల ఆదరణను తిరిగి పొందగలుగుతాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget