అన్వేషించండి

Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?

తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రాజీనామా చేస్తున్నారనే వార్తలతో ఏపీలో  రాజ్యసభ సీట్ల పంపకాల్లో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పొత్తు ధర్మంలో భాగంగా తన సీటును వదులుకుంది. కొత్త ఫార్ములా ఖరారు చేసింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సీట్లు టీడీపీ (3), జనసేన (1)కు కేటాయించారు.
  • అన్నామలై వ్యవహారంతో బీజేపీ తమ ఒక్క సీటును త్యాగం చేసింది.
  • కూటమి నేతలు సమావేశమై సీట్ల పంపకం, భవిష్యత్ కార్యాచరణ చర్చించారు.

Andhra Pradesh Rajya Sabha Elections:ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ సీట్ల పంపకం సజావుగా సాగిపోయింది. టీడీపీకి మూడు సీట్లు దక్కగా, జనసేనకు ఒక సీటు కేటాయించారు. ఇక్కడ మొన్నటి వరకు తనకు ఒక సీటు కావాలని పట్టుబట్టింది. తీరా పంపకాల టైంలో వెనక్కి తగ్గింది. తన సీటును త్యాగం చేసింది. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలతో బీజేపీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. 

రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల పంపకాల ఫార్ములా గురువారం రాత్రి ఖరారు అయ్యింది. గతంలో అనుకున్న ఒప్పందం ప్రకారం బీజేపీకి ఒక సీటు దక్కాల్సి ఉండగా, తాజా పరిణామాలతో ఆ స్థానాన్ని బీజేపీ వదులుకుంది. గతంలో ఒక సీటు బీజేపీకి, మరొకటి జనసేనకు, మిగిలిన రెండు టీడీపీకి ఇవ్వాలని భావించారు. కానీ ఇప్పుడు బీజేపీ తన క్లెయిమ్‌ను ఉపసంహరించుకోవడంతో టీడీపీ లాభపడింది. 

అన్నామలై ఎఫెక్ట్‌తో...

ఈ కీలక మార్పు వెనుక ప్రధానంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఏపీ నుంచి బీజేపీకి దక్కాల్సిన ఆ ఒక్క రాజ్యసభ సీటును అన్నామలై కోసం కేటాయించాలని అధిష్ఠానం తొలుత భావించింది. 

అయితే కొన్ని రోజులుగా అన్నామలై పార్టీ వీడుతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, బీఎల్‌ సంతోష్‌లో వరుస భేటీలు నిర్వహించారు. ఈ చర్చల సందర్భంగా తన రాజీనామా నిర్ణయాన్ని  తెలియజేసినట్టు సమాచారం. తమిళనాడు రాజకీయ పరిస్థితులపై వివరణ ఇస్తూ, పార్టీ నుంచి తప్పుకోవాలని తన ఆలోచనను నేతలకు వివరించారు. అన్నామలై ఎగ్జిట్‌ ఖాయమనే సంకేతాలు రావడంతో ఏపీలో ఆ సీటును క్లెయిమ్‌‌ చేయకూడదని బీజేపీ నిర్ణయించింది. 

జనసేన- టీడీపీలో జోష్

జనసేనకు ఒక సీటు దక్కడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయానికి గుర్తింపుగా, పెద్దల సభలో జనసేన గళం వినిపించే అవకాశం దక్కింది. టీడీపీ మూడు సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు తన రాజకీయ పరపతిని మరింత పెంచుకోనున్నారు. 

మూడు పార్టీల మధ్య సమన్వయ సమావేశం

గురువారం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికల వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. కూటమి మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మిత్రపక్షాల బలాన్ని బట్టి సీట్లను సర్దుబాటు చేయడంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. 

మూడు ప్రాంతాల్లో సభలు

ఈ సమావేశంలో కేవలం సీట్ల పంపకాలే కాకుండా భవిష్యత్‌ కార్యచరపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి ఐక్యతను చాటిచెప్పేలా ఈ నెల చివర్లో  తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ సీట్ల పంపకం ఎలా జరిగింది?

టీడీపీకి మూడు సీట్లు దక్కగా, జనసేనకు ఒక సీటు కేటాయించారు. గతంలో బీజేపీకి కేటాయించిన సీటును అది వదులుకుంది.

రాజ్యసభ సీటును బీజేపీ ఎందుకు వదులుకుంది?

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై పార్టీ వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సీటును అన్నామలై కోసం కేటాయించాలని మొదట భావించారు.

రాజ్యసభ సీట్ల పంపకంపై ఏ నాయకులు చర్చించారు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికల వ్యూహంపై చర్చించారు.

కూటమి భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారు?

కూటమి ఐక్యతను చాటిచెప్పేలా ఈ నెల చివర్లో తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
Advertisement

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget