అన్వేషించండి

ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న

AP DSC| నీట్ పేపర్ లీకేజీకి బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, డీఎస్సీ అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు కొడుకు పదవిని కాపాడతారా అని ప్రశ్నించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ లీకేజీని ఉటంకిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్.
  • డీఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలపై వైఎస్సార్సీపీ ప్రశ్నలు లేవనెత్తింది.
  • జగన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి తీవ్ర కౌంటర్లు వచ్చాయి.
  • నీట్, డీఎస్సీ వేర్వేరని, జగన్ ఆరోపణలు రాజకీయ కోణంలోనేనని విమర్శలు.

YS Jagan Mohan Reddy | అమరావతి: ‘నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవికి రాజీనామా చేయడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికతకు, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోందని’ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో ఒక విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ నిష్క్రమించిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థులను మోసం చేశారు

ఇదే క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో అంతులేని అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చూపించిన నైతిక బాధ్యతను పాటిస్తూ, రాష్ట్రంలో అదే కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా అని జగన్‌ నిలదీశారు. లేక ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రాజకీయ ప్రమాణాలు, విలువలు మరియు జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కొడుకు నారా లోకేష్ పదవిని కాపాడుకోవడానికే మొగ్గు చూపుతారా అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు.

Also Read: Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  

జగన్ ట్వీట్‌పై నెటిజన్ల రియాక్షన్ వైరల్

నీట్ లీకేజీ ఉదంతాన్ని ఉటంకిస్తూ AP విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నమైన, ఘాటైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. జగన్ వేసిన ప్రశ్నలపై నెటిజన్లు ప్రధానంగా వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల ఫలితాలను, ప్రస్తుత పరిణామాలను ప్రస్తావిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. "అన్నా.. నిరసనగా మనకున్న ఆ 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్దాం, మన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుందాం" అంటూ కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ చేస్తున్న ఆరోపణలు

మరికొందరు నెటిజన్లు నీట్ పరీక్షకు, ఏపీ డీఎస్సీకి పోలిక లేదని స్పష్టం చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ కావడం, దానివల్ల పరీక్ష రద్దు కావడం అనేది వాస్తవమని.. కానీ ఏపీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయనడం కేవలం వైఎస్సార్‌సీపీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఆరోపణలు మాత్రమేనని పేర్కొంటున్నారు. అభ్యర్థులు లేవనెత్తిన ప్రతి ఆరోపణకూ సంబంధిత విద్యాశాఖ అధికారులు ఇప్పటికే పూర్తి వివరాలతో స్పష్టతనిచ్చారని గుర్తుచేస్తున్నారు.

అక్రమాలు జరిగితే ఈపాటికే రోడ్డెక్కేవారు

డీఎస్సీలో నిజంగానే అక్రమాలు జరిగి ఉంటే నిరుద్యోగులు, అభ్యర్థులు ఈపాటికే రోడ్లెక్కి పెద్ద ఎత్తున ధర్నాలు చేసేవారని, ఉద్యోగాలు సాధించిన వారంతా ప్రస్తుతం సంతోషంగా ఉన్నారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. డీఎస్సీపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్‌సీపీ కోర్టును ఆశ్రయించడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజలకు నిజానిజాలు తెలుసని, వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న ఆ 11 సీట్లు కూడా ఎలా వస్తాయో చూస్తామంటూ నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

Frequently Asked Questions

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నారా లోకేష్ రాజీనామాను ఎందుకు డిమాండ్ చేశారు?

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేసిన తీరును ప్రస్తావిస్తూ జగన్ ప్రశ్నించారు. ఏపీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

వైఎస్సార్‌సీపీ AP డీఎస్సీ పరీక్ష నిర్వహణపై చేసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి?

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డీఎస్సీ పరీక్ష నిర్వహణలో అంతులేని అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తును పణంగా పెట్టారని పేర్కొన్నారు.

జగన్ ట్వీట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన ఎలా ఉంది?

నెటిజన్ల నుంచి భిన్నమైన, ఘాటైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ కౌంటర్లు ఇవ్వగా, మరికొందరు నీట్‌తో డీఎస్సీని పోల్చడం సరికాదన్నారు.

నీట్, AP డీఎస్సీ పరీక్షల మధ్య పోలికపై నెటిజన్ల అభిప్రాయం ఏమిటి?

నీట్ పేపర్ లీక్ వాస్తవం, పరీక్ష రద్దు అయ్యింది. కానీ AP డీఎస్సీలో అక్రమాలు కేవలం వైఎస్సార్‌సీపీ రాజకీయ ఆరోపణలు మాత్రమేనని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టతనిచ్చారని పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
AP DWCRA: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Perni Nani Avigan: అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget