Pithapuram Public Talk on Pawan Kalyan | కళ్యాణ్ గారి తాలుకా అని పిఠాపురంలో చెప్పుకోగలుగుతున్నారా.?
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోటీచేసి అత్యధిక మెజార్టీతో నెగ్గిన పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఆపార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.. పవన్ కల్యాణ్ పోటీచేసిన పిఠాపురం నియోజకవర్గంలోఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టగా ఆయన నియోజకవర్గం అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ పిఠాపురంలోనే నిర్వహించం వల్ల మళ్లీ అందరి దృష్టి ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంపై పడింది. పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలు పిఠాపురంలో నెరవేరాయా..? ఇంకా పిఠాపురం ప్రజలు ఏం కోరుకుంటున్నారు..? అసలు పవన్ కల్యాణ్ పనితీరుపట్లా వారు ఏం చెబుతున్నారు అనే విషయాలను పిఠాపురం ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబీపీ దేశం. ప్లీనరీ నిర్వహణతో పాటు ప్రజలు పవన్ నుంచి కోరుకుంటున్న విషయాలపైనా స్థానికులు తమ అభిప్రాయాలను తెలిపారు. అవన్నీ ఈ వీడియోలో చూసేయండి.





















