Touch Me Not on Jio Hotstar: జియో హాట్‌స్టార్‌లో కొత్త సిరీస్... నవదీప్, కోమలితో పాటు ఎవరెవరు నటిస్తున్నారంటే?
Touch Me Not on Jio Hotstar : జియో హాట్ స్టార్ తమ ఓటీటీ సబ్స్క్రైబర్లకు గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే 'టచ్ మీ నాట్' అనే కొత్త హాట్ స్టార్ స్పెషల్ ని స్ట్రీమింగ్ చేయబోతున్నామని అలర్ట్ ఇచ్చింది.

జియో హాట్ స్టార్ తన సోషల్ మీడియా ఖాతాలలో 'టచ్ మీ నాట్' అనే సిరీస్ ను హాట్ స్టార్ స్పెషల్ గా త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నామని అనౌన్స్ చేసింది. అయితే ఈ సిరీస్ అనౌన్స్ డేట్ ను మాత్రం మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికే పోస్టర్ ను డిజైన్ చేసిన తీరు మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అందులో ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు హీరోలు, మంటలో దగ్ధమవుతున్న ఒక పెద్ద బిల్డింగ్, డు నాట్ క్రాస్ పోలీస్ లైన్ అనే లైన్స్ క్యూరియాసిటీని పెంచాయి. అంతేకాకుండా ఆ పోస్టర్ ను చూస్తుంటే క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందబోతోంది అన్పిస్తోంది. దీక్షిత్ శెట్టి చేతిలో ఏదో పవర్ ఉన్నట్టు పోస్టర్ లో హింట్ కూడా ఇచ్చారు. త్వరలోనే 'టచ్ మీ నాట్' సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ విడుదల చేయనున్నారు.
జియో హాట్ స్టార్ లో 'టచ్ మీ నాట్'
ఈ సిరీస్లో నవదీప్, కోమలి ప్రసాద్, దీక్షిత్ శెట్టి, సంచిత పూనచ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురు ఫిలిమ్స్ బ్యానర్ పై రమణ తేజ ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. తెలుగు డైరెక్టర్, రచయిత అయిన రమణ తేజ 2020లో రిలీజ్ అయిన 'అశ్వత్థామ' మూవీతో డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టారు. కానీ ఆ మూవీ నిరాశ పరిచింది. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి రమణ తేజ దర్శకత్వంలో హాట్ స్టార్ ఒరిజినల్ 'టచ్ మీ నాట్' అనే సిరీస్ రాబోతుండడం చర్చకు దారి తీసింది.
Stay alert. Stay curious 👀 #TouchMeNotonJioHotstar coming soon only on #JioHotstar@ramanateja9 @dheekshiths @komaleeprasad @pnavdeep26 @PoonachaSancho @gurufilms1 pic.twitter.com/xWQbi2nGCR
— JioHotstar Telugu (@JioHotstarTel_) February 28, 2025
నవదీప్ 2.0 మొదలైనట్టే
ఇక ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో వరస అవకాశాలు దక్కించుకున్న హీరో నవదీప్, ఇప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా ఆయన ఈగల్, లవ్ మౌళి వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'ఈగల్'లో నవదీప్ స్పెషల్ రోల్ చేయగా, 'లవ్ మౌళి' మూవీలో మాత్రం హీరోగా నటించారు. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ బోల్డ్ మూవీ జూన్ 7న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ట్రైలర్ ని చూశాక ఈ మూవీతో నవదీప్ 2.0 మొదలవుతుందని ప్రమోషన్స్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు మేకర్స్. ఫంకూరి గిద్వాని హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కూడా నవదీప్ కి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
కాగా 'లవ్ మౌళి' మూవీ జూన్ 27 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి తరం యూత్ ఆలోచనలు, రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో ఓ జంట రెండేళ్లు కలిసిన తర్వాత వచ్చే గొడవలు, ఇద్దరి మధ్య కనుమరుగయ్యే ప్రేమ, రిలేషన్ ఎందుకు బ్రేక్ అవుతుంది? అనే విషయాలను చూపించారు. ఇప్పుడు 'టచ్ మీ నాట్' అనే వెబ్ సిరీస్ తో నవదీప్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నాడు.





















