search
×

General Ticket Rules: జనరల్‌ టిక్కెట్‌ తీసుకుని రైలు ఎక్కుతున్నారా? - మీకో షాకింగ్‌ న్యూస్‌

Railway General Ticket Rule Changed: జనరల్ టిక్కెట్లపై ప్రయాణించే ప్రయాణీకుల కోసం రైల్వేలు నిబంధనలను మార్చవచ్చు. జనరల్ టిక్కెట్లతో ప్రయాణించే ప్రయాణీకులపై దీని ప్రభావం ఏమిటో తెలుసుకోండి.

FOLLOW US: 
Share:

Indian Railway Going To Change General Ticket Rules: భారతదేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది వందలాది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణీకుల్లో కొందరు రిజర్వ్‌ చేసిన కోచ్‌లలో ప్రయాణిస్తుంటారు & మరికొందరు రిజర్వ్ చేయని కోచ్‌లలో ప్రయాణిస్తారు. రిజర్వ్‌డ్‌ కోచ్‌లో జర్నీ చేయాలంటే ముందుగానే సీట్‌/ టిక్కెట్‌ బుక్ చేసుకోవాలి. అన్‌ రిజర్వ్‌డ్‌ లేదా జనరల్‌ బోగీలోకి ఎక్కడానికి ఏ వ్యక్తీ ముందుగానే టిక్కెట్‌ బుక్ చేసుకోవలసిన అవసరం లేదు. రైల్వే స్టేషన్‌కు వచ్చిన తర్వాత టిక్కెట్‌ కౌంటర్‌లో జనరల్‌ టిక్కెట్‌ తీసుకోవచ్చు లేదా టిక్కెట్‌ వెండింగ్‌ మెషీన్‌ నుంచి తీసుకోవచ్చు. జనరల్‌ టిక్కెట్‌ తీసుకున్న వ్యక్తి, ఛార్జీకి తగ్గట్లుగా, ఏ రైలులోనైనా ప్రయాణించవచ్చు. ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణికులు జనరల్ కోచ్‌లలో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు, జనరల్ టిక్కెట్లపై ప్రయాణించే ప్రయాణీకుల విషయంలో భారతీయ రైల్వే నిబంధనలు మార్చే ఆలోచనలో ఉంది. ఇది అమలులోకి వస్తే, జనరల్ టిక్కెట్‌తో ప్రయాణించే వ్యక్తులపై గట్టి ఎఫెక్ట్‌ పడుతుంది.

జనరల్ టిక్కెట్‌ రూల్స్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయి?
కొన్ని రోజుల క్రితం, మహా కుంభమేళాకు వచ్చిన ప్రయాణీకుల రద్దీ కారణంగా న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. ఆ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకూడదన్న ఆలోచనతో రైల్వే శాఖ కొన్ని రూల్స్‌ మారుస్తోంది. జనరల్ టిక్కెట్‌ రూల్స్‌ వాటిలో ఒకటి. రైల్వే మంత్రిత్వ శాఖ, సాధారణ టికెట్ బుకింగ్ ప్రమాణాలను మార్చే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, ఇకపై, సాధారణ టిక్కెట్‌/ జనరల్‌ టిక్కెట్‌పై రైలు పేర్లను కూడా ముద్రించవచ్చు. అంటే, జనరల్‌ టిక్కెట్‌ తీసుకుని ఏ రైలులోనైనా ఎక్కే వెసులుబాటు ఇకపై ఉండకపోవచ్చు. టికెట్‌పై రైలు పేరును ముద్రిస్తే, ఒక విధంగా దానిని కూడా రిజర్వ్‌డ్‌ టిక్కెట్‌లాగే చూడాలి. ప్రయాణీకుడు ఆ రైలులో తప్ప మరో రైలులో ప్రయాణించలేడు.

మరో ఆసక్తికర కథనం: వాట్సాప్‌లో గేమ్‌ ఛేంజింగ్‌ ఫీచర్‌ - ఫోన్‌పే, గూగుల్‌పేకి దబిడిదిబిడే!  

జనరల్ టికెట్ ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది? (How long is a general ticket valid for?)
రైల్వే జారీ చేసే అన్‌ రిజర్వ్‌డ్‌ టిక్కెట్‌ లేదా జనరల్ టికెట్‌కు చెల్లుబాటు గడువు ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న రైల్వే రూల్స్‌ ప్రకారం, జనరల్‌ టిక్కెట్‌ కాల పరిమితి 3 గంటలు. అంటే, ఓ వ్యక్తి జనరల్ టికెట్ తీసుకున్న సమయం నుంచి 3 గంటల లోపు ప్రయాణాన్ని ప్రారంభించాలి. 3 గంటలు దాటితే ఆ టికెట్ చెల్లదు. దీనర్ధం.. జనరల్‌ టిక్కెట్‌ తీసుకున్న వ్యక్తి, టిక్కెట్‌ తీసుకున్న సమయం నుంచి 3 గంటల తర్వాత ఏ రైలులోనూ ప్రయాణించలేడు, రిఫండ్‌ కూడా ఉండదు. . 3 గంటలు దాటిన తర్వాత ప్రయాణించాలంటే మళ్లీ కొత్తగా టిక్కెట్‌ తీసుకోవాలి.

మరో ఆసక్తికర కథనం: గ్యాస్‌ బండ నుంచి మ్యూచువల్‌ ఫండ్‌ వరకు - మార్చి 01 నుంచి కీలక మార్పులు, మీ జేబు జాగ్రత్త! 

Published at : 28 Feb 2025 01:57 PM (IST) Tags: Indian Railway Railway news General Ticket Railway Rules Utility News in Telugu

ఇవి కూడా చూడండి

Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!

Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!

Lost Phone Tracking:ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీ అయినా ఈ విధంగా ట్రాక్ చేయండి! మొత్తం ప్రక్రియ తెలుసుకోండి!

Lost Phone Tracking:ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీ అయినా ఈ విధంగా ట్రాక్ చేయండి! మొత్తం ప్రక్రియ తెలుసుకోండి!

EPFO Update: మీ PF ఖాతాలో వడ్డీ డబ్బులు జమ అయ్యాయా? ఇంట్లో కూర్చుని ఇలా చెక్ చేసుకోండి!

EPFO Update: మీ PF ఖాతాలో వడ్డీ డబ్బులు జమ అయ్యాయా? ఇంట్లో కూర్చుని ఇలా చెక్ చేసుకోండి!

Aadhaar card Update: ఇంటి వద్దే డాక్యుమెంట్స్‌ అవసరం లేకుండా ఆధార్‌లో ఈ అప్‌డేట్స్‌ చేసుకోవచ్చు!

Aadhaar card Update: ఇంటి వద్దే డాక్యుమెంట్స్‌ అవసరం లేకుండా ఆధార్‌లో ఈ అప్‌డేట్స్‌  చేసుకోవచ్చు!

UIDAI New Rule: ఏదైనా హోటల్‌లో ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు! కొత్త నిబంధన గురించి తెలుసా?

UIDAI New Rule: ఏదైనా హోటల్‌లో ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు! కొత్త నిబంధన గురించి తెలుసా?

టాప్ స్టోరీస్

Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?

Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?

The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్

The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్

Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?

Chandrababu:  మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?

Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?

Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?