అన్వేషించండి

Goa News: ఇడ్లీ సాంబార్ వల్ల గోవా టూరిజం పడిపోయింది- బిజెపి ఎమ్మెల్యే కొత్త నిర్వచనం

ఇడ్లీ సాంబార్, వడా పావ్ అటు వంటకాలు మాత్రమే దొరకడం వల్ల గోవాకి టూరిస్టులు రావడం తగ్గించేసారని బిజెపి ఎమ్మెల్యే మైఖేల్ లోబో కొత్త భాష్యం చెప్పారు.

 

హమ్మయ్య..! ఎట్టకేలకు గోవా టూరిజం ఎందుకు పడిపోయిందో తెలిసిపోయింది. ఇడ్లీ సాంబారు, వడా పావ్ వల్ల గోవా టూరిజం పడిపోయిందట. గోవా లోని బిజెపి ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. గోవాను సందర్శించడానికి వచ్చేవాళ్ళలో ఇతర దేశాలకు సంబంధించిన  టూరిస్టులు ఎక్కువ అని వాళ్లకి బీచ్ లోని రెస్టారెంట్లలో ఇడ్లీ సాంబార్, వడా పావ్ అటు వంటకాలు మాత్రమే దొరకడం వల్ల తినలేక గోవాకి టూరిస్టులు రావడం తగ్గించేసారని సదరు ఎమ్మెల్యే కొత్త భాష్యం చెప్పారు.

గోవా లోని రెస్టారెంట్ల యజమానులు తమ హోటళ్ల ను ఫుడ్ కోర్టులను బయట రాష్ట్రాల వాళ్ళకి లీజ్ కు ఇవ్వడంతో ఇలా వేరే వేరే వంటకాలు పెడుతున్నారని  కాకుండా గోవా సంప్రదాయ వంటకాలు, కాంటినెంటల్ ఫుడ్  అందుబాటులో ఉంచితే  టూరిస్ట్లు ఎక్కువగా వస్తారని ఆయన అంటున్నారు. గోవా కు వచ్చేవాళ్ళలో రష్యా ఉక్రెయిన్ ప్రాంతాల పర్యాటకులు ఎక్కువగా ఉంటారని కానీ ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతూ ఉండడం వల్ల రావడం తగ్గించేసారని కూడా లోబో చెప్పారు. ఈ యుద్ధం సంగతి ఎలా ఉన్నా ఇడ్లీ సాంబార్ వల్లే పర్యాటకులు  గోవాకి రావడం తగ్గించేసారంటూ ఎమ్మెల్యే లోబో చేసిన ప్రకటన పై సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయ్.

అయితే నిన్న మొన్నటి వరకు  గోవాలో టూరిజం ఏ మాత్రం తగ్గలేదని  కావాలనే కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్  నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని గోవా ప్రభుత్వం సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇన్నాళ్ళకి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇండైరెక్టుగా నన్నా గోవా టూరిజం పడిపోయింది అని ఒప్పుకున్నారు అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.


 టాక్సీ మాఫియా, అధిక ధరలు అసలు కారణం : రిపోర్ట్స్ 

 గోవా వెళ్ళొచ్చే పర్యాటకుల నుండి  ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట  గోవాలో పెరిగిపోయిన ధరలు , టాక్సీ మాఫియా  వల్లే టూరిజం పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. "లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉండదు కేవలం అక్కడ టాక్సీ వాళ్ళు ఎంత చెబితే అంత ఇచ్చి బుక్ చేసుకోవాలి. ఓటు బ్యాంకు కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రవేశపెట్టి ఆలోచన ప్రభుత్వం చేయదు. రోడ్లన్నీ ఇరుకు. గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పోనీ బైక్ లాంటివి అద్దెకు తీసుకుందాం అనుకున్నా రకరకాల కారణాలు చెప్పి ఎక్కువ మొత్తం వసూలు చేస్తారు. తో ఈ టాక్సీ వాళ్ళు ఏం చెప్తే దానికి తలొగ్గాల్సి వస్తుంది " అనేది అక్కడకు వెళ్లి వచ్చిన పర్యాటకులు చెప్తున్న మాట. అలాగే హోటల్ రూమ్స్ ధరలు విపరీతంగా పెంచేశారు.

గోవాలో  రూమ్ రెంట్ల కంటే బ్యాంకాక్ శ్రీలంక లాంటి వేరే దేశాల్లో చాలా చౌకగా రూమ్స్ దొరుకుతాయి. కాబట్టి పర్యాటకులు గోవా కంటే ఆయా దేశాల్నే ప్రిఫర్ చేస్తున్నారంటూ రిపోర్ట్స్ చెప్తున్నాయి. పై పెచ్చు చిన్న చిన్న విషయాలకే టూరిస్టులపై అక్కడ దాడులు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం  న్యూ ఇయర్ వేడుకలు ఎంజాయ్ చేద్దాం అని వెళ్ళిన తాడేపల్లిగూడెం యువకుడ్ని ఒక హోటల్ కుర్రాళ్ళు కొట్టి చంపేశారు.
 ఇలాంటి అసలు కారణాలపై దృష్టి పెట్టకుండా ఇడ్లీ సాంబార్ వల్ల  గోవా టూరిజం పడిపోయిందని  చెబుతున్న రాజకీయ నాయకుల మాటలు నవ్వుల పాలవుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget