Suriya Jyothika With Kids First Time | సూర్య, జ్యోతిక పిల్లలు ఎంత పెద్ద వాళ్లైపోయారో | ABP Desam
కొన్నాళ్ల క్రితం వరకూ సూర్య ఎప్పుడూ ఫ్యామిలీతో బయటకి వెళ్లినా అక్కడ తమను ఫోటోలు తీయటానికి వచ్చే మీడియాకు ఒకటే రిక్వెస్ట్ చేసేవారు. తను, జ్యోతిక ఫోటోస్ ఇస్తామని కానీ పిల్లల్ని మాత్రం ఫోటోలు తీయొద్దని రిక్వెస్ట్ చేసేవారు సూర్య. ఇలా గతంలో చాలా సార్లు మీడియాకు సూర్య రిక్వెస్ట్ చేస్తున్న వీడియోలు ఉన్నాయి. ఎప్పుడైనా అకేషనల్లీ తనే సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసేవారు సూర్య. అయితే ఫర్ ది ఫస్ట్ టైమ్ సూర్య జ్యోతిక తమ పిల్లలతో కలిసి బయట మీడియాకు ఫోటోలు ఇచ్చారు. వాస్తవానికి వాళ్లు ఎప్పట్లానే యధావిధిగా వెళ్లిపోతుంటే వాళ్లను ఆపి మరీ మీడియా ముందుకు రమ్మని ఫ్యామిలీ మొత్తం ఫోజ్ ఇచ్చారు. జ్యోతిక బాలీవుడ్ లో నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ప్రమోషన్స్ సందర్భంగా జరిగింది ఈ సీన్. జ్యోతిక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ గెస్ట్ గా వచ్చిన సూర్య తమ పిల్లలు దియా, దేవ్, జ్యోతిక తో మీడియాకు ఫోజులు ఇచ్చారు. దియా వయస్సు 18 సంవత్సరాలు కాగా..దేవ్ వయస్సు 15 ఏళ్లు. పిల్లల పేర్లలోని మొదటి అక్షరాలు కలిసి వచ్చేలా 2D ఎంటర్ టైన్మెంట్స్ అని ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసిన సూర్య, జ్యోతిక కార్తీతో కలిసి ఆకాశమే హద్దుగా, జై భీమ్, సత్యం సుందరం లాంటి సూపర్ హిట్ సినిమాలను తీశారు. మరి అమ్మా నాన్న అంత ఎత్తుకు ఎదిగిపోయిన దేవ్, దియా కూడా ఫిలిం ఇండస్ట్రీలోకి వస్తారా లేదా తమ కెరీర్ వేరుగా ఎంచుకుంటారా చూడాలి.





















