Allu Cinemas Dolby Screen : ఆసియాలోనే బిగ్గెస్ట్ డాల్బీ థియేటర్ అల్లు సినిమాస్ - స్పెషాలిటీస్ ఇవే... ప్రారంభం ఎప్పుడంటే?
Allu Cinemas Biggest Screen : దేశంలోనే అతి పెద్ద డాల్బీ థియేటర్ హైదరాబాద్‌లో త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు అల్లు సినిమాస్ థియేటర్ స్పెషాలిటీస్ షేర్ చేసుకుంది.

Asia's Largest Dolby Screen Allu Cinemas To Start In Hyderabad : ఆసియాలోనే అతి పెద్ద డాల్బీ థియేటర్ 'అల్లు సినిమాస్' ప్రారంభానికి సిద్ధమైంది. భాగ్యనగర వాసులకు ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు అతి పెద్ద స్క్రీన్ రెడీ అయ్యింది. హైదరాబాద్‌లోని కోకాపేటలో ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తైంది. డాల్బీ అట్మాస్ సిస్టమ్, లేజర్ ప్రొజెక్షన్, ఐమ్యాక్స్ స్థాయి విజువల్స్ వంటి అత్యాధునిక సాంకేతికతతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీన్ని నిర్మించారు.
ఈ థియేటర్ నిర్మాణంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాత్ర చాలా కీలకం. అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచ స్థాయి స్క్రీన్ ఏర్పాటు చేయడాన్ని ఆయన దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఉగాది సందర్భంగా ఈ నెల 19న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' మూవీ ప్రీమియర్స్‌తో అల్లు సినిమాస్‌లో బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు సమాచారం.
ముఖ్య అతిథిగా సీఎం రేవంత్
ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు సినిమాస్ ప్రారంభించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి రానున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 చిత్రాలు అల్లు సినిమాస్‌లో సందడి చేయనున్నాయి. ఈ క్రమంలో థియేటర్ విశేషాలను అల్లు సినిమాస్ టీం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
Also Read : మళ్లీ థియేటర్లలోకి హారర్ థ్రిల్లర్ కాంచన - సరికొత్త వెర్షన్‌లో రీ రిలీజ్ ఎప్పుడంటే?
స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
- డాల్బీ థియేటర్ స్క్రీన్ ఏకంగా 75 అడుగుల వెడల్పు ఉంటుంది. DCI ఫ్లాట్ 1.85:1 ఫార్మాట్‌లో ఉంటుంది.
- 3D ఎక్స్‌పీరియన్స్ కోసం అత్యుత్తమ 'DolbyVision'తో పాటు 'Dolby3D' ప్రొటక్షన్ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తోంది.
- స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం 'DolbyAtmos' సౌండ్ సిస్టమ్‌తో... ఆడియన్స్ సౌకర్యంగా మూవీ వీక్షించేందుకు 'పిచ్ బ్లాక్ స్టేడియం సీటింగ్' ఏర్పాటు చేశారు.
- డ్యూయల్ డాల్బీ విజన్ 4K ప్రొజక్టర్స్, స్టూడియో గ్రేడ్ DolbyAtmos.
- 'అల్లు సినిమాస్'లో మొత్తం 4 స్క్రీన్స్ ఉండగా... స్క్రీన్ 1లో డాల్బీ విజన్ సౌలభ్యం ఉంది. దీని సీటింగ్ కెపాసిటీ 644. ప్రేక్షకులు లీనమయ్యేలా 4 అత్యాధునిక స్క్రీన్స్
- తెలుగు రాష్ట్రాల్లో నిర్మించిన ఫస్ట్ డాల్బీ థియేటర్ అల్లు సినిమాస్. ఇప్పటివరకూ పుణె, బెంగుళూరులో మాత్రమే డాల్బీ విజన్ కలిగిన స్క్రీన్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. దేశంలోనే ఇది మూడోది.
- పుణెలో సిటీ ఫ్రైడ్‌లో ఉన్న ఫస్ట్ డాల్బీ సినిమాస్ స్క్రీన్ సైజ్ 55 అడుగుల వెడల్పు, 26.2 అడుగుల ఎత్తు ఉండగా... బెంగుళూరులోని AMB సినిమాస్ స్క్రీన్ సైజ్ 65 అడుగుల వెడల్పు ఉంది. కానీ అల్లు సినిమాస్ డాల్బీ స్క్రీన్ 75 అడుగుల వెడల్పు కలిగి ఉంది.
- 'ధురంధర్ : ది రివెంజ్' మూవీ ప్రీమియర్స్‌తో అతి పెద్ద స్క్రీన్‌లోకి ఆడియన్స్‌ను అనుమతించే అవకాశం ఉంది.
Welcome to ALLU CINEMAS - ASIA'S LARGEST #DolbyCinema ❤🔥
— Allu Cinemas (@AlluCinemas) March 9, 2026
Your movie watching experience will never be the same again.#ExperienceTheExtraordinary
Stay tuned to @AlluCinemas for more exciting updates 🤩@DolbyIn pic.twitter.com/WpUrKXzwV6
ట్రెండింగ్ వార్తలు





















