Allu Arjun : మొన్న భార్యకు... ఇప్పుడు అమ్మకు - కాస్ట్‌లీ కారు గిఫ్ట్ ఇచ్చిన బన్నీ... ధర ఎంతో తెలుసా?
Allu Arjun Car : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తల్లి నిర్మలకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కారు బహుమతిగా ఇచ్చారు.

Allu Arjun Gifted Car To Her Mother Nirmala : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తల్లి నిర్మలకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖరీదైన లెక్సస్ కారును బహుమతిగా ఇచ్చారు. దీని ధర రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం కారు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... ఫ్యాన్స్, నెటిజన్స్ లవ్ సింబల్స్‌తో కామెంట్స్ చేస్తున్నారు.
On the occasion of International Women’s Day, Icon Star @alluarjun gifted his mother #AlluNirmala garu a brand-new car.
— Bunny Mailapalli (@BunnyMailapalli) March 9, 2026
A heartfelt gesture celebrating motherhood and gratitude. 🤍 pic.twitter.com/CChM66vECp
మొన్న భార్యకు..
అయితే, 3 రోజుల క్రితం తన భార్య స్నేహారెడ్డి ఖరీదైన బెంజ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ నెల 6న వీరి 15వ వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది. దీంతో భార్యకు సర్ప్రైజ్ చేశారు. కారును ఇంటికి తీసుకువచ్చిన బన్నీ... తన తండ్రి అల్లు అరవింద్, కుమారుడు అయాన్, కుమార్తె అర్హ సమక్షంలో కారు తాళాలు స్నేహారెడ్డికి అందించారు. దీని ధర రూ.కోటిన్నర వరకూ ఉంటుందని తెలుస్తోంది.
View this post on Instagram
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదే రోజున బన్నీ సోదరుడు అల్లు శిరీష్, నయనికల వివాహం జరిగింది. ముందే కారు ఫోటోలు లీక్ కావడంతో తమ్ముడికి గిఫ్ట్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ 15వ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా భార్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. బన్నీతో 15 ఏళ్ల కాలంలో ప్రేమతో నిండిన జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నామని అల్లు స్నేహారెడ్డి తెలిపారు. తనకు కుటుంబమే సర్వస్వమని... ప్రతీ అధ్యాయంలోనూ భాగస్వామిగా ఉన్నందుకు థాంక్యూ అంటూ బన్నీతో దిగిన ఫోటోస్ షేర్ చేశారు.
Also Read : ఆసియాలోనే బిగ్గెస్ట్ డాల్బీ థియేటర్ అల్లు సినిమాస్ - స్పెషాలిటీస్ ఇవే... ప్రారంభం ఎప్పుడంటే?
ఇక సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ 'AA22xA6'తో బిజీగా ఉన్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సినిమాలో మూడు డిఫరెంట్ రోల్స్‌లో బన్నీ నటిస్తుండగా... పునర్జన్మల కాన్సెప్ట్, సమాంతర ప్రపంచం బ్యాక్ డ్రాప్‌తో మూవీ తెరకెక్కుతోంది.
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. దీంతో పాటే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశారు. సందీప్ వంగా దర్శకత్వంలోనూ మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















