Funky OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
Funky OTT Platform : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫంకీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న మూవీ నెల రోజులకు ఓటీటీలోకి వస్తోంది.

Vishwak Sen's Funky OTT Release Date Locked : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ'. ఫిబ్రవరి 13న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' ఈ మూవీ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 13 నుంచి తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి 'జాతి రత్నాలు' ఫేం అనుదీప్ దర్శకత్వం వహించగా... విశ్వక్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు.
వీరితో పాటే సీనియర్ హీరో నరేష్, సంపత్ రాజ్, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.
Also Read : ది బెస్ట్ డాక్యుమెంటరీ 'యూనిటి' - కొండా లక్ష్మణ్ బాపూజీ కథకు ఫిదా
స్టోరీ ఏంటంటే?
కోమల్ (విశ్వక్ సేన్) కొత్త దర్శకుడు. మంచి ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థలో ఫస్ట్ ఛాన్స్ దక్కించుకుని రూ.4 కోట్లలో సినిమా తీస్తానని చెప్పి 'ఫంకీ'ని స్టార్ట్ చేస్తాడు. అయితే, బడ్జెట్ చివరకు రూ.40 కోట్లకు చేరినా సినిమా మాత్రం పూర్తి కాదు. దీంతో మంచి నిర్మాత (నరేష్) ఒత్తిడికి గురై ఆస్పత్రిలో చేరుతాడు. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత కుమార్తె చిత్ర (కయాదు లోహర్) సినిమా నిర్మించే బాధ్యతల్ని తీసుకుంటుంది. బడ్జెట్ ఇక ఏ మాత్రం పెరగకుండా రూ.కోటితో మూవీ చేయిస్తానని చెప్పి రంగంలోకి దిగుతుంది. చిత్రతో ప్రేమలో పడతాడు కోమల్. ఆ విషయం ఆమెకు చెప్పాడా? అనుకున్న బడ్జెట్‌లోనే మూవీ పూర్తైందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























