అన్వేషించండి

Dhurandhar 2 Collections : రిలీజ్‌కు ముందే ధురంధర్ 2 రికార్డులు - అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Dhurandhar 2 Advance Bookings : 'ధురంధర్ 2' అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకూ స్త్రీ 2పై ఉన్న రికార్డులను 24 గంటల్లోనే బ్రేక్ చేసింది.

Dhurandhar 2 Advance Bookings Records : బాలీవుడ్ లెజెండ్ రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. 11 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 'స్త్రీ 2'పై ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.

ఎంత కలెక్ట్ చేసిందంటే?

'ధురంధర్ 2' పెయిడ్ ప్రివ్యూల పేరుతో వేస్తున్న షోలకు ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో టికెట్స్ సేల్ అయ్యాయి. ఆదివారం ఒక్క రోజే 80 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోగా... అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రూ.18.11 కోట్లు వచ్చాయి. ఇప్పటివరకూ దాదాపు 2 లక్షలకు పైగా టికెట్స్ సేల్ అయినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్క హిందీ వెర్షన్‌కే రూ.12 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇప్పటివరకూ బాలీవుడ్ మూవీ 'స్త్రీ 2' అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో టాప్‌లో ఉంది. ఈ మూవీ రూ.10 కోట్ల వసూళ్లు సాధించగా ఇప్పుడు ఆ రికార్డును 24 గంటల్లోనే 'ధురంధర్ 2' అధిగమించింది. అయితే, ఇప్పటివరకూ సేల్ అయిన టికెట్లనీ పెయిడ్ ప్రీమియర్స్‌వి మాత్రమే. అసలు బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. అవి స్టార్ట్ చేస్తే ఈ వసూళ్లు మరింత దూసుకెళ్లడం ఖాయమంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ను మించి సీక్వెల్ వసూళ్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Also Read : ఆసియాలోనే బిగ్గెస్ట్ డాల్బీ థియేటర్ అల్లు సినిమాస్ - స్పెషాలిటీస్ ఇవే... ప్రారంభం ఎప్పుడంటే?

ట్రైలర్ రిలీజ్

ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ పార్ట్ కేవలం హిందీలోనే రిలీజ్ చేయగా... రెండో పార్ట్ మాత్రం హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. 'ధురంధర్' గతేడాది డిసెంబర్ 5న రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు రెండో పార్ట్‌పై అంతకు మించిన క్రేజ్ నెలకొంది. 

సెకండ్ పార్ట్‌లో యాక్షన్ సీక్వెన్స్, వయలెన్స్ ఎక్కువగానే ఉన్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తుండగా... ఎమోషనల్ డ్రామాకు కూడా పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. ఎన్నో ప్రశ్నలకు సీక్వెల్‌లో సమాధానం దొరకనుంది. జస్కిరాత్ సింగ్ రాంగి (రణవీర్) భారత్‌లో ఉండగా ఎందుకు జైలుకెళ్లాడు? అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) అతని పేరును హమ్జాగా మార్చి ఎందుకు గూఢచారిగా ఎంపిక చేశాడు? ఇండియాపై కుట్రలు చేస్తున్న మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్)ను ఎలా మట్టుబెట్టాడు? రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) డెత్ తర్వాత ల్యారీని హమ్జా ఎలా తన గుప్పిట్లోకి తీసుకున్నాడు? అనే ప్రశ్నలకు 'ధురంధర్ 2'లో ఆన్సర్ దొరకనుంది.

సినిమాలో రణవీర్‌తో పాటు బాలీవుడ్ లెజెండ్స్ అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మలయాళ స్టార్ ఆర్ మాధవన్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్, నవీన్ కౌశిక్, రాకేష్ బేడీ, డానిష్ పండోరా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వరల్డ్ వైడ్‌గా ఈ నెల 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పెయిడ్ ప్రీమియర్స్ తర్వాత త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ కానున్నాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi : మెగాస్టార్ చిరు మంచి మనసు - రెండు కుటుంబాలకు 20 లక్షల సాయం... సోనూసూద్ కూడా...
మెగాస్టార్ చిరు మంచి మనసు - రెండు కుటుంబాలకు 20 లక్షల సాయం... సోనూసూద్ కూడా...
Vijay Sangeetha Divorce Case : విజయ్ సంగీత డివోర్స్ కేస్ - లాయర్ రిక్వెస్ట్ రిజెక్ట్... కోర్టు ఆదేశాలివే...
విజయ్ సంగీత డివోర్స్ కేస్ - లాయర్ రిక్వెస్ట్ రిజెక్ట్... కోర్టు ఆదేశాలివే...
Kamakshi Bhaskarla Agadha : భయంకర విగ్రహం ముందు కామాక్షి భాస్కర్ల - అగధలో మహదేవిగా... సీరియస్ లుక్ చూశారా?
భయంకర విగ్రహం ముందు కామాక్షి భాస్కర్ల - అగధలో మహదేవిగా... సీరియస్ లుక్ చూశారా?
Atlee : మరోసారి తండ్రయిన అట్లీ - నిన్న హీరోయిన్ దీపిక, నేడు డైరెక్టర్ వరుస గుడ్ న్యూస్
మరోసారి తండ్రయిన అట్లీ - నిన్న హీరోయిన్ దీపిక, నేడు డైరెక్టర్ వరుస గుడ్ న్యూస్
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Angry vs KKR IPL 2026 | వైరల్ అవుతున్న వైభవ్ ఔట్
KKR vs RR IPL 2026 Highlights | వరుస ఓటములకు చెక్ పెట్టిన కేకేఆర్
LSG vs PBKS IPL 2026 Highlights | చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Japan Tsunami Alerts: జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
Chandrababu Birthday Celebrations: అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
అన్న క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన చంద్రబాబు దంపతులు.. సాదాసీదాగా బర్త్‌డే జరుపుకున్న ఏపీ సీఎం
Indravelli Martyrs Memorial: ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం
ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం.. ఆరోజు ఏం జరిగింది?
Hyderabad Crime News: ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
ప్రైవేట్ వీడియోలతో బాలికలు, యువతుల్ని బ్లాక్ మెయిల్.. లక్షలు వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
Atlee : మరోసారి తండ్రయిన అట్లీ - నిన్న హీరోయిన్ దీపిక, నేడు డైరెక్టర్ వరుస గుడ్ న్యూస్
మరోసారి తండ్రయిన అట్లీ - నిన్న హీరోయిన్ దీపిక, నేడు డైరెక్టర్ వరుస గుడ్ న్యూస్
Delimitation: పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
పునర్విభజన రాజకీయం - దక్షిణాదికి రక్షణ కవచమా? లేక రాజకీయ శిక్షా?
Cervical Pain : సర్వైకల్ నొప్పి ఉన్నప్పుడు శరీరం ఇచ్చే స్ట్రాంగ్ సంకేతాలు ఇవే.. విస్మరించకండి
సర్వైకల్ నొప్పి ఉన్నప్పుడు శరీరం ఇచ్చే స్ట్రాంగ్ సంకేతాలు ఇవే.. విస్మరించకండి
US Iran Peace Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదా? చివర్లో ట్విస్ట్ ఇచ్చిన టెహ్రాన్
అమెరికాతో చర్చలకు ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదా? చివర్లో ట్విస్ట్ ఇచ్చిన టెహ్రాన్
Embed widget