Konaseema Famous Sweets: మీరు కోనసీమకు వెళ్తున్నారా.. అయితే ఈ ఫేమస్ స్వీట్లు రుచి చూడాల్సిందే
Konaseema News | పచ్చని తీవాచీ పరిచినట్లు కనిపించే కోనసీమ ప్రాంతంలో ఆప్యాయతలు ఎలా ఉంటాయో రుచులు కూడా వెరీ స్పెషల్... మీరు గనుక కోనసీమలో పర్యటిస్తే ఇవి తప్పక రుచి చూడాల్సిందే...

Konaseema Foods | ఆప్యాయతలు, అనురాగాలకే కాదు నోరూరించే వంటకాలకు గోదావరి చాలా ఫేమస్... ఇందులోనూ కోనసీమలో అయితే మరీ విభిన్న రకాల వంటకాలకు పెట్టింది పేరు.. అందుకే పండుగలకు, పబ్బాలకు వెళ్లేవారు తప్పకుండా కోనసీమలో ఉన్నటువంటి పసందైన వంటకాలను పనిగట్టుకుని కొనుక్కుంటుంటారు.. కోనసీమలో తమ ప్రయాణాన్ని సాగిస్తున్నవారు అయితే బాక్సులకు బాక్సులు కొనుక్కుని మరీ తమ ప్రాంతాలకు పార్శిళ్లు తీసుకెళ్తుంటారు.. అయితే కోనసీమలో గనుక మీరు ప్రయాణాన్ని సాగిస్తుంటే ఈప్రాంతాల్లో ఆగిమరీ ఒకసారి ఈ టేస్టీ ఫేమస్ రుచులను ఓసారి చూసేస్తే మీరు మళ్లీ మళ్లీ వచ్చి తినాలనుకుంటారు...
ఖండ్రిగ పాలకోవా చాలా ఫేమస్..
రావులపాలెం నుంచి వయా అమలాపురం వెళ్లే మార్గంలో ఖండ్రిగ ఉంటుంది.. ఇక్కడ ధనలక్ష్మి పాలకోవా చాలా ఫేమస్... వీరికి మర్కెడా బ్రాంచిలు లేవు.. కానీ కోనసీమలోని పలు ప్రాంతాల్లో ఇదే పేరుతో పలు కోవా సెంటర్లు ఉంటాయి.. బట్ ఖండ్రిగలో దొరికే పాలకోవా టేస్ట్ మరెక్కడా దొరకదని అందరూ అంటుంటారు.. కేవలం పాలకోవా మాత్రమే కాదు పాలకోవాతో తయారు చేసిన ఖజ్జికాయులు కూడా చాలా ఫేమస్ ఇక్కడ.. అందుకే హైదరాబాద్ తదితర ఇతర ప్రాంతాలనుంచి అమలాపురం వైపుగా వచ్చేవారు ఈ పాలకోవా గురించి తెలిసిన వారైతే తప్పక ఇక్కడ ఆగి కిలోల లెక్కన పాలకోవా కొని తీసుకెళ్తుంటారు... మీరూ ఈసారి రావులపాలెం నుంచి అమలాపురం వైపు గనుక వెళ్తుంటే ఈఖండ్రిగ అనే ఊరిలో ధనలక్ష్మి పాలకోవా సెంటర్ దగ్గర మాత్రం ఆగి స్పెషల్ పాలకోవా టేస్ట్ ఒకసారి చూడండి..
నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఆత్రేయపురం పూతరేకులు...
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే ఆత్రేయపురం పూతరేకులు గురించి చెప్పనక్కర్లేదు అనుకుంటా... రావులపాలెం నుంచి బబ్బర్లంక, వాడపల్లి, లల్ల మీదుగా జస్ట్ 11 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేస్తే ఆత్రేయపురం వస్తుంది.. ఇక్కడ ఈపూతరేకులు చాలా ఫేమస్.. గ్రామం మొత్తం ఈపూతరేకుల తయారీతోనే ఉపాధి పొందుతుంది.. అయితే స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన పూతరేకులు అందులోనూడ్రైఫ్రూట్స్ తో తయారు చేసే బెల్లం పూతరేకులు టేస్ట్ చూడాలంటే మాత్రం ఆత్రేయపురంలోనే సాధ్యం అని మీరు ఫిక్స్ అయిపోతారు.. ఈ సారి మీరు గనుక రావులపాలెం మీదుగా వెళ్తుంటే ఓసారి మీరు ట్రైచేయండి..
తాపేశ్వరం మడత కాజా...
మండపేట నియోజకవర్గ పరిధిలోకి వచ్చే తాపేశ్వరం మడత కాజా గురించి మీరు వినే ఉంటారు.. ఇక్కడ సురుచి, భక్తాంజనేయ తదితర బ్రాండ్లతో మడత కాజా తయారు చేస్తుంటారు.. కోనసీమ ప్రాంతంలోకి వచ్చే ఈ తాపేశ్వరం టేస్ట్ వేరే లెవెల్... స్వచ్ఛమైన నేతితో తయారు చేసే తాపేశ్వరం మడత కాజా గురించి ప్రత్యేకంగా ఇక్కడికి వస్తుంటారు. రాజమండ్రి నుంచి మండపేట వెళ్లేవారు, అదేవిధంగా రామచంద్రపురం, అనపర్తి వెళ్లేవారు తప్పకుండా తాపేశ్వరంలో ఆగకుండా ఉండరు.. ఇక్కడ పదుల సంఖ్యలో పెద్ద పెద్ద మడత కాజా షాపులు ఉన్నాయి. దీంతో ఇటువైపుగా రాకపోకలు సాగించేవారు ఈ సారి తప్పకుండా ఆగి ఈ మడత కాజా నోట్లో మడత పెట్టి తినేయండి.
నగరం గరాచీలు గురించి విన్నారా..?
పాలకొల్లు నుంచి అమలాపురం వైపుగా ప్రయాణించేవారు తప్పకుండా ఆగాల్సిన ప్రాంతం నగరం.. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నగరం పరిధిలో 216 జాతీయ రహదారిని ఆనుకుని అనేక గరాచీలు అమ్మే దుకాణాలు బోలెడు.. వరిపిండి, బెల్లం పాకం తదితర సామాగ్రిని ఉపయోగించి తయారు చేసే ఈ గరాచీలకు మరో పేరు కూడా ఉంది.. పిచ్చుక గూళ్లు అని స్థానికంగా కూడా పిలుస్తుంటారు. తక్కువ ధరకే లభిస్తాయి.
కొత్తపేట బొబ్బట్లు
రావులపాలెం నుంచి కొత్తపేటకు ఎంటర్ అవుతున్న క్రమంలో కుడివైపున గృహరుచి పేరుతో కనిపిస్తుంది బొబ్బట్లు తయారీ కేంద్రం.. ఇక్కడ అంతా మహిళలే బబ్బట్లను తయారు చేసి విక్రయిస్తుంటారు.. స్వచ్ఛమైన నేతితో తయారు చేసే ఈబబ్బట్లుకోసం ఇటువైపుగా రాకపోకలు సాగించే వారు కచ్చితంగా వీటిని టేస్ట్ చేస్తారు.
మల్లారపు ఉండలు అల్లవరంలో ఫేమస్..
చూడడానికి చాలా పెద్ద పరిమాణంలో కనిపించే బెల్లం ఉండలు అదేనండీ మల్లారపు ఉండలు అంటారు లెండి.. వీటిని అల్లవరం చాలా ఫేమస్ అని తెలుసా... వీటిని ఎక్కువగా సారెల్లో పెడుతుంటారు.. బూందీ , బెల్లం పాకంతో తయారు చేసే ఈ స్వీట్ కు చాలా మంది ఇష్టం తింటారు.. అమలాపురం నుంచి జస్ట్ 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అల్లవరం వస్తుంది.. ఈ సారి ఈ మల్లారపు ఉండలను ట్రై చేయండి..
పనిగట్టుకుని మరీ ఆగి డజన్లు కొద్దీ వేడి వేడి బబ్బట్లు తీసుకెళ్తుంటారు. ఈ సారి మీరు అటువైపుగా వెళ్తే తప్పక ఆగి వేడివేడి బబ్బట్లు రుచి ఏంటో చూసేయండి..





















