Air India Express PayDay: బంపర్ ఆఫర్... ఎయిర్ టికెట్లు ట్రెయిన్ కన్నా చవక. రు. 1500 కే.. ఎయిర్ ఇండియా టికెట్లు
Air India Express PayDay:ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన 'పేడ్ డే సేల్'ను ప్రారంభించింది. ఈ సేల్‌లో Xpress Value టిక్కెట్ ధరలు ₹1,535 నుంచి ప్రారంభమవుతాయి

Air India Express PayDay: సమ్మర్ వచ్చేస్తోంది. ఎక్కడైనా వెకేషన్ ప్లాన్ చేయాలంటే అన్నింటి కంటే ముందుగా ఆలోచించేది ప్రయాణ ఖర్చులు గురించే. సమ్మర్ లో చల్లగా ఉండే ప్రాంతాలకు వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి చాలా దూరం. సొంత వెహికిల్ లో అంత దూరం ట్రావెల్ చేయలేం.. ట్రెయిన్ లో అంతసేపు ఉండలేం.. ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఎయిర్ ట్రావెల్. కానీ విమానం టికెట్లు ధర వింటేనే ప్రయాణం చేయాలన్న మూడూ.., ఉత్సాహం పోతాయి. అయితే మన ఉత్సాహాన్ని పెంచే ఓ ఆఫర్‌ని ఎయిర్ ఇండియా అనౌన్స్ చేసింది.
Air India Express has launched its 'Payday Sale,':
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ Pay Day సేల్ ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఫేర్ రు.1535 నుంచి ప్రారంభం అవుతుంది. చెక్ ఇన్ కు ఎలాంటి రుసుము లేదు. Xpress Lite ఫేర్స్ అయితే.. airindiaexpress.com వెబ్ సైట్ ద్వారా ₹1,385 రూపాయలకే ప్రారంభం అవుతాయి. ఈ అవకాశం కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. మార్చ్ 2 వే తేదీ వరకూ ప్రయాణాలను బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 19 వ తేదీలోపు చేేసే ప్రయాణాలను ఇందుకు అనుమతిస్తారు. ఈ ఆఫర్‌లో ప్రకటించిన వాటిలో తక్కువ రేట్ టికెట్లు ఇవి. అయితే అన్నీ రూట్లకు ఈ ధరలు ఉండవు. కన్వీనియెన్స్ రుసుము తగ్గించడం వల్ల అన్ని రూట్లలోనూ టికెట్ ధరలు ఎంతో కొంత తగ్గుతాయి. తక్కువ ధర ఉన్న రూట్లలో రు.1535, రు. 1385ల నుంచి ధరలు మొదలవుతాయి అన్నమాట. అదే ట్రెయిన్ లో రెండు ప్రధాన నగరాల మధ్య ట్రావెల్ చేయాలంటే.. రెండో తరగతి ఏసీలో ఇంత కంటే ఎక్కువ ధరలే ఉంటాయి. సో ఆ రకంగా చూస్తే.. ఇవి ట్రెయిన‌్ టికెట్ల కన్నా తక్కువే అనుకోవచ్చు.
Air India Express తన Xpress Lite bookings పై జీరో కన్వీనియెన్స్ ఆఫర్ ఇస్తోంది. వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకుంటేనే ఈ సదుపాయం ఉంటుంది. ఇంతే కాకుండా బుకింగ్ ద్వారా అదనంగా మరో మూడు కేజీల కేబిన్ లగేజ్ ను తీసుకెళ్లే సదుపాయం ఉంది.
ఇప్పుడు ఈ కొత్త ఆఫర్ ను అన్ని దేశీయ సర్వీసులతో పాటు.. మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లే సర్వీసులకు అందిస్తారు.
అలాగే చెక్-ఇన్ బ్యాగేజీపై తగ్గింపును పొందవచ్చు – దేశీయ ప్రయాణాల కోసం 15 kg లగేజీ ₹1,000కి, అంతర్జాతీయ ప్రయాణాల కోసం 20 kg లగేజీ ₹1,300కి అందుబాటులో ఉంటుంది.
అంతేకాకుండా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన వెబ్‌సైట్ ద్వారా లాయల్టీ కస్టమర్లకు ప్రత్యేకమైన డీల్స్‌ను అందిస్తోంది. ఇందులో Xpress Biz సీట్లకు ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది. సంస్థ ఇటీవల తన విస్తరణలో భాగంగా పొందిన 33 కొత్త బోయింగ్ 737-8 విమానాలలో అందుబాటులో ఉంటాయి. ఇవే కాకుండా సైట్ లో లాగిన్ అయిన వారికి బ్యాగేజి చెక్ ఇన్ లో ఇంకా అదనపు రాయితీలు ఇస్తున్నారు.ఇవే కాకుండా ఎయిర్ ఇండియా ఎప్పటి నుంచో , విద్యార్థులు, సీనియర్ సిటిజన్లతో పాటు.. డాక్టర్లు, నర్సులు, రక్షణ శాఖలో పనిచేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఇస్తోంది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ టాటా గ్రూప్‌నకు చెందిన సంస్థ. మాతృసంస్థ Air India లో ఇదొక భాగం. ఎక్స్ ప్రెస్ ప్రతీరోజూ 400 డైలీ ఫ్లైట్స్ ను నిర్వహిస్తోంది. మొత్తం 39 డొమెస్టిక్, 16 ఇంటర్నేషనల్ రూట్లలో ఫ్లెయిట్లను నడుపుతోంది. సంస్థ దగ్గర 95 ఎయిర్ క్రాఫ్ట్‌లున్నాయి.





















