Flash Floods in Kullu Manali | బియాస్ నదికి ఆకస్మిక వరదలు | ABP Desam
హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నదిని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా కుల్లు జిల్లాలోని బియాస్ నదీ పరివాహక ప్రాంతాల్లో భీకర వరదలు వస్తున్నాయి. నదీ తీరంలో ఉన్న ఇళ్లలోకి చొరబడుతున్న నీటికి అక్కడే ఉన్న కార్లు, బైకులు ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు కోతకు గురై ఆటోలు, కారులు భూమిలోకి దిగిపోయి కనిపిస్తున్నాయి. ఎగువన ఏకధాటిగా 24 గంటలు పాటు కురిసిన భారీ వర్షాలకు ఇలా ఆకస్మిక వరదలు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితులు ఉంటాయని పర్యాటకులు, స్థానికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే కులూ మనాలికి వచ్చే పర్యాటకులు కొన్ని రోజులుగా విపరీతంగా పెరిగింది. రెండు నెలలుగా కురుస్తున్న మంచు కొద్దిగా తెరిపి ఇవ్వటంతో కులూకు అటు నుంచి అటు మనాలికి వెళ్లాలని పెద్ద సంఖ్యలో పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్ కు వస్తున్నారు. వారిలో ఎక్కువ మంది పర్యాటుకులు కులూ మనాలిలోని బియాస్ నది పరివాహక కాటేజీల్లోనే స్టే చేస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.





















