అన్వేషించండి

సినిమా వాళ్ల మద్దతు వైసీపీకి నిల్ - పోసాని కోసం ఒక్కరైనా నోరు విప్పలేదేంటి ?

చిత్ర పరిశ్రమలో వైసీపీకి కనీస మద్దతు లభించడం లేదు. ఆ పార్టీ సానుభూతిపరులు కూడా ఎవరూ ఇండస్ట్రీ కనిపించడం లేదు. అలీ కూడా దూరమయ్యారు. మోహన్ బాబు కూడా ఎప్పుడో సర్దుకున్నారు.

Tollywood YSRCP: దక్షిణాదిన రాజకీయాలు సినిమాలు ఒకటిగా కలిసిపోయి చాలా దశాబ్దాలే దాటింది. సినిమాల నుండి వచ్చిన  ఎంజీఆర్ ఎన్టీఆర్ జయలలిత పవన్ కళ్యాణ్ వంటి వారు ఉన్నత పదవులు అధిరోహించారు. ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులైన వాళ్ళు అయితే  చాలామందే ఉన్నారు. జనాల్లో సినిమా వాళ్ళకు ఉండే క్రేజ్ వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్  రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని  పార్టీలు సినీ రంగంతో వీలైనంత దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాయి. కాంగ్రెస్ బిజెపి లాంటి జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల వరకు ఎవరు దీనికి అతీతులు కాదు. అయితే ఈ విషయంలో వైసిపి  పూర్తిగా వెనకబడిందనే చెప్పాలి. వైసిపి మద్దతుదారుడుగా ఉన్న పోసాని కృష్ణ మురళి అరెస్టు అయితే కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా టాలీవుడ్ నుంచి స్పందించలేదు. నిన్న మొన్నటి వరకు అధికారం లో పార్టీకి ఇలాంటి దుస్థితి ఏర్పడడం వెనక స్వయంకృతాపరాధాలే ఉన్న ఎక్కువ ఉన్నాయనే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ కోణం లో వైసిపి ఒంటరి అయిపోయిందన్న వాదన బలపడుతోంది 

విపక్షంలో ఉన్నా టిడిపికి అండగా టాలీవుడ్ 

స్వయంగా సినిమా నుండి వచ్చిన  ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కావడం  టాలీవుడ్ తో ఆద్యంతం మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం  టిడిపికి స్వతహాగా కలిసివచ్చే బలాలు. సామాజిక వర్గం పరంగా టిడిపి అప్రోచ్ పరంగా  టాలీవుడ్ లో  టిడిపి కి సానుభూతిపరులు చాలామంది ఉన్నారు. ఎంత ఎలా అంటే  2019 ఎన్నికల తర్వాత పూర్తిగా కుదలైపోయింది టిడిపి అనే ప్రచారం జరుగుతున్న సమయంలోనూ కొంతమంది టాలీవుడ్ పెద్దలు స్టార్లు టిడిపి వెంటే ఉన్నారు. అశ్విని దత్ మురళీమోహన్  లాంటి బడా ప్రొడ్యూసర్లు స్వయంగా టిడిపి పార్టీ సభ్యులు. రాఘవేంద్రరావు, బోయపాటి లాంటి వాళ్ళు అయితే టిడిపి కోసం పని చేసిన చరిత్ర కలిగిన వాళ్లు. జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు  చాలామంది ఆయనకు మద్దతుగా మాట్లాడిన వాళ్లే ఉన్నారు. ఎన్టీఆర్ తనయుడు టాలీవుడ్ టాప్ స్టార్ లలో ఒకరైన  నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు 

పవన్ వెంట మెగా ఫ్యామిలీ 

టాలీవుడ్ లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న  మెగా ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. చిరంజీవి  మొదలుకొని మొత్తం మెగా ఫ్యామిలీ లో హీరోలు అందరూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు నైతిక మద్దతు ఇస్తున్నారు. పవన్ పిలిస్తే జనసేన వైపు రావడానికి  టాలీవుడ్ లో కొంతమంది  రెడీగా ఉన్నట్టు ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటారు. టాలీవుడ్ నిర్మాత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ప్రస్తుతం జనసేనలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అల్లు అర్జున్ తో ఫ్యామిలీకి విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న బహిరంగంగా రెండు కుటుంబాల హీరోలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న  సంఘటనలు ఎప్పుడు ఎదురు కాలేదు. 

గతంలో కాంగ్రెస్ వెంట సూపర్ స్టార్ కృష్ణ

రాజీవ్ గాంధీ రిక్వెస్ట్ రాజకీయాల్లోకి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు బలమైన  సపోర్టుగా నిలిచారు. ఇప్పటికీ పాతకాలం ఆర్టిస్టుల్లో కాంగ్రెస్ సానుభూతిపరులు ఉన్నారు. వైయస్సార్ బతికున్నప్పుడు జయసుధ ప్రజారాజ్యం విలీనమైన తర్వాత చిరంజీవి కాంగ్రెస్ లోనే కొంతకాలం కొనసాగారు. 

బిజెపి కూడా తక్కువ కాదు 

బిజెపిలోనూ సినిమా స్టార్లు బాగానే ఉన్నారు. అయితే ఈ సంఖ్య నార్తులో ఎక్కువ. తెలుగు రాజకీయాల్లోనూ గతంలో కోట శ్రీనివాసరావు లాంటివాళ్లు బిజెపి తరఫున ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధ్రీశ్వరి సైతం సినీ కుటుంబం నుంచి వచ్చినవారే. డైరెక్ట్ గా బీజేపీలో చేరకపోయినా సైదాంతిక పరంగా ఆ పార్టీకి మద్దతు ఇచ్చే సినీ ప్రముఖులు సినీ రంగంలో బాగానే ఉన్నారు.

సినీ ఇండస్ట్రీ మద్దతు కోల్పోయిన వైసిపి 

మొదటినుంచి వైసిపి సినీ ప్రముఖులనాకట్టుకోవడంలో విఫలం అవుతూనే వచ్చింది. రాజశేఖర్ జీవిత లాంటి వాళ్ళు మొదట్లో వైసీపీలో చేరినా చాలా తొందరగానే బయటికి వచ్చేసారు. అక్కడి వ్యవహారాలు తమకు సూట్ కావని బహిరంగంగానే ప్రకటన ఇచ్చారు. 2019 ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన మంచు మోహన్ బాబు కూడా  కొద్ది కాలానికి దూరం అయిపోయారు. ఇక సినిమా ఇండస్ట్రీ పై  జగన్ ప్రభుత్వం అధికారం చెలాయించాలని చూసిందనే విమర్శలు టాలీవుడ్ నుంచి వినబడతాయి.  చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లను తన ఇంటి ముందు నడిపించి అవమానించారని ఒక వర్గం ఆరోపిస్తూ ఉంటుంది. సినీ నటుడు పృథ్వి కి ఎస్వీబీసీ చైర్మన్గా పదవి ఇచ్చినా ఆయన ఆరోపణలు ఎదుర్కొని బయటకు వచ్చేసారు. తనపై వైసీపీలో కుట్ర జరిగిందనేది ఆయన వెర్షన్. ప్రస్తుతం జనసేనలో ఆయన కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆలీ 2024 ఫలితాలు తర్వాత  జగన్ కి బై బై చెప్పేశారు. పార్టీలో చేరకపోయినా మద్దతు దారుడు గా కొనసాగిన పోసాని కూడా ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టు ఎన్నికల తర్వాత ప్రకటించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు లొకేషన్  లపై తీవ్రమైన పదజాలంతో ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆయన అరెస్టు అయ్యేలా చేశాయి. కానీ విచిత్రంగా టాలీవుడ్ నుంచి ఆయనకు మద్దతుగా ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. పోసాని మాట ఎలా ఉన్నా  అసలు వైసీపీ పార్టీనే టాలీవుడ్ నుంచి మద్దతు కోల్పోయిందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. జగన్ ఫోటో తోటే ఎన్నికల్లో గెలుస్తాం తప్ప  వేరే ఎట్రాక్షన్ స్టార్ పవర్ అవసరం లేదంటూ గతంలో వైసీపీ కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని టాలీవుడ్కు దూరం చేశాయని సినీ రంగ ప్రముఖులు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం యాంకర్ శ్యామల లాంటి ఒకరిద్దరు మాత్రం వైసీపీతో ఉన్నా ముందు వరుసలో ఉండే స్టార్లెవరూ వైసిపి లో లేరు. నందమూరి, మెగా ఫ్యామిలీ లకు సొంత పార్టీలు ఉన్నాయనుకున్నా ప్రభాస్ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లైతే  రాజకీయాల వాసనే దగ్గరకు రానివ్వరు. స్టార్ల విషయం పక్కన పెట్టి  ఇతర ప్రముఖులు వైసిపి వైపు రావడానికి  అక్కడి ఉన్న పరిస్థితులు అడ్డుపడుతున్నాయి అన్నది అంతర్గత సమాచారం. సినిమా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్లడానికి అనువుగా ఉండాల్సిన సమన్వయం వైసీపీలో లేదనేది ఎక్కువగా వినబడుతున్న మాట. మరి వైసీపీ పెద్దలు ఈ విషయాన్ని పట్టించుకుంటారు లేదో చూడాలి.

 

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
UP Politics BJP Challenges: యూపిలో బిజెపికి గడ్డు కాలం - ఎస్పీ జోరుకు యోగి బ్రేకులు వేయగలరా?
యూపిలో బిజెపికి గడ్డు కాలం - ఎస్పీ జోరుకు యోగి బ్రేకులు వేయగలరా?
KTR Praises Chandrababu: చంద్రబాబుకు కేటీఆర్ కితాబు - తెలంగాణ పొలిటికల్ గేమ్‌లో నలిగిపోతున్న మిత్రుడు జగన్!
చంద్రబాబుకు కేటీఆర్ కితాబు - తెలంగాణ పొలిటికల్ గేమ్‌లో నలిగిపోతున్న మిత్రుడు జగన్!
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Bodies Polling: ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Viral News: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Embed widget