Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam
టెస్లా అధినేత ఎలన్ మస్క్ తన కార్ల కంపెనీని ఆంధ్రప్రదేశ్ కు తీసుకువస్తున్నారా..? ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఈ మేరకు టెస్లా కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతోందా.? అప్పట్లో మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చి ఐటీ దశను మార్చేసిన చంద్రబాబు ఇప్పుడు టెస్లా కంపెనీ ని తీసుకురావటం ద్వారా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి ఏపీని కేరాఫ్ అడ్రస్ చేస్తారా..అసలు ఇది సాధ్యమయ్యే పనేనా..? తన ఇమేజ్ ను తనే రిస్క్ లో చంద్రబాబు పెట్టుకుంటున్నారా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే టెస్లా కార్ల పరిశ్రమను చేజిక్కించుకోవాలని గుజరాత్ సహా దేశంలో ఆర్థికంగా స్థితిమంతంగా ఉన్న ప్రతీ రాష్ట్రం కోరుకుంటోంది. అలాంటి పరిస్థితుల్లో ఎలన్ మస్క్ కోరే రాయితీలతో టెస్లా కార్ల కంపెనీని ఏపీ లో ఏర్పాటయ్యేలా చేయటం అంటే సీఎంగా చంద్రబాబు తన పరపతిని పలుకుబడిని కేంద్రంలో చాలా పెద్ద మొత్తంలో ఉపయోగించాల్సి ఉంటుంది. మరి అందుకు చంద్రబాబు సిద్ధమేనా అన్నదే అసలు ప్రశ్న.





















