అన్వేషించండి

ఆఫ్గన్ మీద గెలవలేరు కానీ ఇండియాపై ఏడుస్తారు - ఇంగ్లాడ్ ఆటగాళ్ల బాధేంటి ?

England Team: ఇంగ్లాడ్ ఆటగాళ్లు భారత్ ఒకే హోటల్లో ఉంటూ. ఒకే గ్రౌండ్ లో ఆడుతోందని అంటున్నారు. కానీ వారి ఆటతీరును మాత్రం వారు మెరుగుపర్చుకోలేకపోతున్నారు.

England Team: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ పై ఓడిపోయిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పై స్వదేశంలో విమర్శలు ఎక్కువయ్యాయి. అయితే దీనికి కారణం ట్రోఫీ మొదలైనప్పటి నుంచి ఇండియన్ టీం పైబడి  ఇంగ్లాండ్ క్రికెటర్లు, మాజీలు అక్కసు చూపడమే. భద్రతా కారణాలతో ఇండియన్ టీం దుబాయ్ లాంటి తటస్థ వేదికపై  ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతోంది. దీనిని సాకుగా చూపి మొదట ఆస్ట్రేలియా, తర్వాత ఇంగ్లాండ్ క్రికెటర్లు ఇలా ఒకే వేదికపై ఆడటం వల్ల  ఇండియన్ టీం కి చాంపియన్స్ ట్రోఫీలో ఎక్స్ట్రా మైలేజ్ వస్తుందని  ఇది అన్యాయమని విమర్శలు చేశారు. 

ఇండియా టీం ఒకే గ్రౌండ్‌లో ఆడుతోందని ఏడుస్తున్న ఇంగ్లిష్ మాజీ క్రికెటర్లు 

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు నాజిర్ హుస్సేన్, మైఖేల్ అదర్టర్న్ ఒకే స్టేడియం ఒకే హోటల్లో  ఉంటూ ఇండియన్ టీమ్ మ్యాచ్ లన్నీ ఆడుతుంది అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దీన్ని ఇండియన్ మాజీలు  గట్టిగానే తిప్పి కొట్టారు. సునీల్ గవాస్కర్, వసీం జాఫర్ లాంటి భారతీయ మాజీ క్రికెటర్లు ఇండియన్ టీం కి  ఒకే గ్రౌండ్లో ఆడటం అలవాటు అయిపోతే 2023 వరల్డ్ కప్ ఫైనల్ లో ఎందుకు ఓడిపోతుందని, ప్రస్తుతం స్వదేశంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్న  పాకిస్తాన్  కేవలం ఐదు రోజుల్లోనే టోర్నీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోతుందని చురకలు అంటించారు. పాకిస్తాన్ లెజెండ్ క్రికెటర్  వసీమ్ అక్రమ్ సైతం ఇదే విషయం మాట్లాడుతూ ఇలాంటి అనవసర ఆరోపణలు మానేసి ఆట మీద దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ  ఆఫ్ఘనిస్తాన్ పై కూడా గెలవలేని ఇంగ్లాండ్ ఇలా ఇండియన్ టీం పై ఆరోపణలు చేయడం సిల్లీగా ఉందని  ఇప్పటికే ఇంగ్లాండ్ పై ఆఫ్గనిస్తాన్ రెండు ఐసీసీ టోర్నమెంట్ లో విజయం సాధించిందని  ముందు దానిపై దృష్టి పెట్టాలంటూ  ఇంగ్లాండ్ టీమ్ ను ట్రోల్ చేస్తున్నారు.

ఇంగ్లాండ్ చాదస్తం వదులుకోవాలన్న అశ్విన్ 

ఈ విషయమై రవిచంద్రన్ అశ్విన్ కూడా తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ ఇంగ్లాండ్ టీం ఇంకా పాతకాలం పద్ధతి లోనే ఆలోచిస్తుందని ఆ పాశ్చాత్య చాందస వాద ధోరణి నుండి బయట పడాలని అన్నారు. గెలవక గెలవక ఒక వరల్డ్ కప్ గెలిచినందుకు తాము అంతా సాధించేసామని ఇంగ్లాండ్ అనుకుంటుందని అందుకే ఆ తర్వాత పెద్దగా విజయాలు సాధించలేకపోయిందని అశ్విన్ తెలిపాడు. ఉపఖండం టీంలను చాలా తేలిగ్గా తీసుకుంటుందని ఇటువైపు టూర్లు కూడా సరిగ్గా వేయదని అందుకే ఇటువైపు పిచ్ లపై ఆడడం ఇంగ్లాండ్ క్రికెటర్ల వల్ల కావడం లేదని దీన్ని చాలా సీరియస్ గా ఆ జట్టు మేనేజ్మెంట్ తీసుకోవాలని చెబుతూనే ఇండియా శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్  లాంటి టీమ్లతో ఆడుతూ ఉంటే ఇక్కడి పిచ్ లపై అవగాహన వస్తుందని చెప్పాడు.

ఏం చేయాలో సలహాలిచ్చిన అశ్విన్ 

ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్, సౌత్ ఆఫ్రికా క్రికెటర్ ఎబి డివిలియర్స్ లకు వాళ్ళ దేశంలో కంటే ఇండియాలో ఎక్కువ పాపులారీటీ ఉంటుందని అలాంటి స్టార్ డం ఇంగ్లాండ్ క్రికెట్లకు ఎప్పటికీ రాదని దానికి కారణం ఉపఖండం టూర్లను తేలిగ్గా తీసుకుంటమే అని హితవు పలికారు. బుట్ట బొమ్మ పాటకు డేవిడ్ వార్నర్ డాన్స్ చేస్తే  అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం  వార్నర్ ఫ్యాన్స్ గా మారిపోయిన విషయం  ఇంగ్లాండ్ కి తెలియదా అంటూ గుర్తు చేసే ప్రయత్నం చేశాడు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget