Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP Desam
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు మంత్రి నారాయణ, అధికారుల బృందం చేరుకుున్నారు. 2027లో ఏపీలో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లు ప్లానింగ్ కోసం మహాకుంభమేళాలో అధికార బృందంతో కలిసి అధ్యయనం చేయనున్నారు నారాయణ. అధ్యయన బృందంలో మంత్రి నారాయణతోపాటు మున్సిపల్ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ కూడా ఉన్నారు. కుంభమేళా అధారిటీ ఆఫీసును సందర్శించిన బృందం...కోట్లాదిగా భక్తులు వచ్చినప్పుడు తొక్కిసలాట జరగుకుండా ఎలా నియంత్రిస్తున్నారన్న కోణంలో అధ్యయనం చేయనున్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కడ వేల సంఖ్యలో పోలీసులు నిర్వహిస్తున్న విధుల గురించి తెలుసుకోనున్నారు. వేల సంఖ్యలో మాత్రమే ఉండే వాలంటీర్లు కోట్లాదిగా వచ్చే భక్తులకు ఎలా సౌకర్యాలను అందిస్తున్నారు. క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, మరుగు దొడ్లు వంటి సౌకర్యాల ఏర్పాట్లపై ఆరా తీయనున్నారు. ఏదైనా అనుకోని సందర్భాలు జరిగినప్పుడు ఎలా అప్రమత్తం కావాలి డిజాస్టర్ మేనేజ్మెంట్ మెళకువులను తెలుసుకోనున్నారు.





















