అన్వేషించండి

SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!

SLBC Tunnel : SLBC నిర్మాణం తొలి అడుగు నుంచి నేటి ఘోర ప్రమాదం వరకూ అదే నిర్లక్ష్యం. ఆలస్యం అమృతం విషయం అనేలా సాగదీస్తూ నత్తతో పోటీపడుతున్న టన్నెల్ పనులు ఇప్పుడు కార్మికుల పాలిట ప్రాణసంకటంగా మారాయి.

SLBC Tunnel Rescue Operation Latest News: నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం ప్రాజెక్టును ఆనుకుని నిర్మిస్తున్న SLBC టన్నెల్ ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్‌గా మారింది. టన్నెల్‌లో చిక్కుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 8 మంది కార్మికులు క్షేమంగా బయటపడతారా, లేదా ఇదే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది. అయితే ఈ ప్రమాదం ఏదో కాకతాళియంగా జరిగింది కాదు. ప్రకృతి ప్రకోపమో కాదు, కేవలం నిర్లక్ష్యం. SLBCని ఆది నుంచి వెంటాడుతున్న నిర్లక్ష్యం. ఇదే ఈరోజు ఎనిమిది మంది ప్రాణాలను డేంజర్‌లో నెట్టింది. వారు ప్రాణాలతో బతికిబట్టకట్టడమంటే సాధారణ విషయం కాదు. అందుకే ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్, హైడ్రా ఇలా కేంద్ర, రాష్ట్ర బలగాలు, నిపుణులు గత మూడు రోజులుగా కార్మికులను ప్రాణాలతో టన్నెల్ నుంచి బయటకు తెచ్చిందుకు చేయని ప్రయత్నం లేదు. ఎప్పుడు ఆపరేషన్ సక్సెస్ అవుతుందో తెలియని అయోమయం ఓ వైపు, లోపల చిక్కుకున్న వారు క్షేమంగా ఉండాలని, తిరిగి ప్రాణాలతో తమ చెంతకు చేరాలని కుటుంబ సభ్యుల ప్రార్థనలు మరోవైపు, ఇలా దోమలపెంటలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. 

ఆదిలోనే హంసపాదు అన్నట్లు SLBC శంకుస్దాన మొదలు నేటి వరకూ అన్ని అవాంతరాలే. అంచానలకు మించి అవరోధాలే ఎదురవుతూనే ఉన్నాయి. శ్రీశైలం ద్వారా 30 టిఎంసీల కృష్ణా నీటిని టన్నెల్ ద్వారా తరలించిన తెలంగాణలో 4లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు , హైదరాబాద్ కు త్రాగునీటి కష్టాలను తీర్చాలనే సంకల్పంతో 2004లో SLBC శంకుస్దాన చేసి, పనులు ప్రారంభించారు. నాలుగేళ్లలో టెన్నెల్ తవ్వకం పూర్తి చేసి నీటిని టెన్నెల్ మార్గం ద్వారా ప్రధాన కాలువలు,అటు నుండి వ్యవసాయ భూములక తరలించాలి. కాని నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన SLBC, నేటికి రెండు దశాబ్ధాలు, ఏకంగా ఇరవై ఏళ్లు దాటినా నేటికీ పనులు ముందుకు సాగడం లేదు. అవాంతరాలే ఎదరువుతూనే ఉన్నాయి. తాజాగా టన్నెల్‌లో 14 కిలోమీటర్ వద్ద పైభాగం విరిగిపడటంతో అప్పటికే పనిలో ఉన్న 50 మంది కార్మికులు ప్రాణాలు అరచేతపట్టుకుని పరుగులు పెడుతూ మిగతావారు తప్పించుకుని బయటకు రాగా, 8 మంది ఇంకా లోపలే మృత్యువుతో పోరాడుతున్నారు.

SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!

టన్నెల్ మార్గంలో గత కొద్ది నెలలుగా ముఖ్యంగా పైకప్పు భాగంలో లీకేజ్ జరుగుతోంది. ఆ లీకేజ్‌ని తాత్కాలికంగా కాంక్రీట్ వేసి ఆపే ప్రయత్నం చేశారు. కొంత వరకు లీకేజి ఆగినట్లు కనిపించినా, పూర్తిగా ఆగకపోవడంతో అమాంతం కూలే పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నాలుగేళ్ల క్రితం టన్నెల్‌లో పని చేసే బోరింగ్ మిషన్ పాడైతే దానిని రిపేరు చేయడానికి ఏకంగా నాలుగేళ్ల సమయం పట్టింది. ఆ తరువాత కొత్త బోరింగ్ మిషన్ అమర్చి కేవలం కిలోమీటర్లు తవ్వగానే అది కాస్తా చెడి పోయింది. ఆ తరువాత 2023 జనవరి నుంచి అనివార్య కారణాల వల్ల అవుట్ లెట్ పనులు ఆగిపోయాయి. మట్టి రాళ్లు అడ్డుగా పడిపోవడంతో పనులు ముందుకు సాగలేదు. టన్నెల్ బోరింగ్ మిషన్ మూడేళ్లుగా నీటిలో ఉండిపోయింది. ఇలా ఒకటేమిటి SLBC ప్రారంభమైన నాటి నుంచి అన్ని అడ్డంకులే, అంతేకాదు అంచనా వ్యయం కూడా ఊహలకందని స్థాయిలో పెరిగిపోయింది. 2024లో 1925 కోట్ల రూపాయలున్న అంచనా వ్యయం ఇప్పుడు ఏకంగా 4637 కోట్లకు చేరుకుంది. ఎట్టకేలకు 2026 నాటికైనా పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకెళ్తుంటే, ఇదిగో ఇలా ఊహించని పెను ఉపద్రవం మళ్లీ బ్రేక్ వేసింది. ఇలా సంకల్పం మంచిదైనా, మారుతున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం SLBC పాలిట శాపంగా మారింది.

Also Read: పోలింగ్‌కు ముందే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, రేవంత్‌పై కేందమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ఫైర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
Marri Rajasekhar: వైసీపీకి మరో షాక్‌, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా
వైసీపీకి మరో షాక్‌, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా
Thaman On Game Changer: 'గేమ్ ఛేంజర్'లో చరణ్ స్టెప్స్ కంటే ఇవి 1000 రెట్లు బెటర్... తమన్ అంత అనేశాడేంటి?
'గేమ్ ఛేంజర్'లో చరణ్ స్టెప్స్ కంటే ఇవి 1000 రెట్లు బెటర్... తమన్ అంత అనేశాడేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP DesamSunita Williams Crew 9 Dragon Capsule Splash Down | భూమిపైకి క్షేమంగా సునీతా విలియమ్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
Marri Rajasekhar: వైసీపీకి మరో షాక్‌, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా
వైసీపీకి మరో షాక్‌, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా
Thaman On Game Changer: 'గేమ్ ఛేంజర్'లో చరణ్ స్టెప్స్ కంటే ఇవి 1000 రెట్లు బెటర్... తమన్ అంత అనేశాడేంటి?
'గేమ్ ఛేంజర్'లో చరణ్ స్టెప్స్ కంటే ఇవి 1000 రెట్లు బెటర్... తమన్ అంత అనేశాడేంటి?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బడ్జెట్‌లో కీలక ప్రకటన, నాలుగున్నర లక్షల ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బడ్జెట్‌లో కీలక ప్రకటన, నాలుగున్నర లక్షల ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం
Megastar Chiranjeevi: టెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్
టెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్
Grok AI : ఓరేయ్ గ్రోక్.. నువ్వు నిజంగా AI వేనా? Grok గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
ఓరేయ్ గ్రోక్.. నువ్వు నిజంగా AI వేనా? Grok గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
Sunita Williams Smiles: సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
Embed widget