అన్వేషించండి
In Pics: కుమార్తెతో కలిసి మంత్రి నారాయణ పర్యటన, విజయవాడ వరద ప్రాంతాల్లో కీలక సూచనలు
Vijayawada News: విజయవాడలో వరద ప్రభావం తగ్గాక ప్రభుత్వం వివిధ రకాల సహాయ చర్యలను వేగవంతం చేస్తోంది. తాజాగా మంత్రి నారాయణ వీటిని పరిశీలించారు

విజయవాడ వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన
1/13

విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన కొనసాగుతోంది. జరుగుతున్న సహాయక చర్యలను వారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
2/13

విద్యాధర పురం, జక్కంపూడి, కుందా వారి ఖండ్రికలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర పర్యటించారు.
3/13

అధికారులతో కలిసి జక్కంపూడి, వైఎస్సార్ కాలనీ తో పాటు బుడ మేరు ప్రవహించే మార్గాన్ని పరిశీలించారు.
4/13

ఆయా ప్రాంతాల్లో వరద తగ్గిన చోట సాయంత్రానికి పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
5/13

బుడమేరు ప్రవాహానికి ఉన్న ఆటంకాలను అధిగమించడంపై అధికారులకు మంత్రి సూచనలు చేశారు.
6/13

ఈ సందర్భంగా పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. ‘‘10 రోజులపాటు సీఎంతో పాటు మంత్రులు, అధికారులు కష్టపడి వరద ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకువచ్చారు.
7/13

కొన్ని చోట్ల మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లో వరద తగ్గిపోయింది. ఐదు ప్రాంతాల్లో సాయంత్రానికి సాధారణ పరిస్థితి తీసుకొస్తాం.
8/13

మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో పారిశుద్ధ్యం మెరుగుపరుస్తాం. 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉన్నారు.
9/13

బుడమేరు ఉండాల్సిన విస్తీర్ణం కంటే చాలావరకూ కుచించుకుపోయింది. ఆపరేషన్ బుడమేరు ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం’’ అని నారాయణ అన్నారు.
10/13

మరోవైపు, రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర బృందం పరిశీలించింది.
11/13

జరిగిన నష్టాన్ని ఫోటో ఎగ్జిబిషన్ ఫోటోల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు వివరించారు.
12/13

అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కేంద్ర బృందం పాల్గొంది. వర్షాలు వరదలు ద్వారా వివిధ శాఖలకు ఏర్పడ్డ నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.
13/13

సమావేశం అనంతరం జిల్లాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర బృందం వెళ్లింది.
Published at : 11 Sep 2024 05:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
రాజమండ్రి
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion