South Industry Domination | బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ | ABP Desam
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సౌత్ యాక్టర్స్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా నార్త్ లో మన సౌత్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. సౌత్ నుండి డబ్ అయిన సినిమాలు నార్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తెలుగు సినిమాలకి నార్త్ లో ఇంత ఫాలోయింగ్ రావడానికి బాహుబలి సినిమా మెయిన్ బేస్ అని చెపొచ్చు. బాహుబలి పార్ట్ 1 అండ్ 2 సినిమాలు తెలుగు రుచిని నార్త్ ఆడియన్స్ కి పరిచయం చేసాయి. ఆ తర్వాత నుండి సౌత్ ఇండస్ట్రీ రేంజ్ ఒక సారిగా మారిపోయింది. కలెక్షన్స్ పరంగా చూస్తే కూడా మన సౌత్ సినిమాలు, అందులో మెయిన్ గా తెలుగు సినిమాలు మంచి కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. కార్తికేయ 2, హనుమాన్, కాంతారా సినిమాలు హిందీలోనే మంచి కలెక్షన్ ని అందుకున్నాయి. అలాగే యాక్టర్స్ కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్ లో ఎన్నో తెలుగు సినిమాలు హిందీలో కనిపిస్తాయి. వాటి వల్ల కూడా మన యాక్టర్స్ కి నార్త్ లో మంచి మార్కెట్ ఏర్పడింది.





















