అన్వేషించండి
Chandrababu Tour : చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత, కాన్వాయ్ ను అడ్డుకోవడంతో కాలినడకన అనపర్తికి!
Chandrababu Tour : టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ ను తూర్పుగోదావరి జిల్లా బలభద్రాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు కాన్వాయ్ దిగి కాలినడకన అనపర్తి బయలుదేరారు.

చంద్రబాబు
1/8

టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో మూడో రోజు ఉద్రిక్తత నెలకొంది. అనపర్తి దేవీచౌక్ వద్ద చంద్రబాబు సభకు నిన్న అనుమతి ఇచ్చిన పోలీసులు ఇవాళ అనుమతి నిరాకరించారు.
2/8

అనపర్తి వస్తున్న చంద్రబాబు కాన్వాయ్ ను బలభద్రాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనపర్తిలో వెళ్లకుండా పోలీసు కానిస్టేబుళ్లు రోడ్డుపై కూర్చున్నారు.
3/8

చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డంగా పోలీసు వాహనాన్ని పెట్టి ముందుకు కదలకుండా కట్టడి చేశారు. చంద్రబాబు కాన్వాయ్ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా పెట్టిన బస్సును టీడీపీ శ్రేణులు కాల్వలోకి తోసేసే ప్రయత్నం చేశారు.
4/8

ఎంతసేపటికీ పోలీసులు వాహనాన్ని అడ్డుతీయకపోవడంతో చంద్రబాబు కాన్వాయ్ దిగి పాదయాత్రగా అనపర్తి బయలుదేరారు.
5/8

బలభద్రపురంలో పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ షోకు నిన్న అనుమతి ఇచ్చి ఇవాళ ఎలా రద్దు చేస్తారని మండిపడ్డారు.
6/8

ఎంతమంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడతారో చూస్తామని, టీడీపీ కార్యకర్తలు ముందుకు వస్తే పోలీస్ స్టేషన్లు సరిపోవని చంద్రబాబు అన్నారు. పోలీసులకు సహాయనిరాకరణ చేస్తానన్నారు.
7/8

బలభద్రాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్ దిగి కాలినడకన అనపర్తి బయలుదేరారు. చంద్రబాబు వెంట టీడీపీ నేతలు చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేలాది మంది కార్యకర్తలు భారీ ర్యాలీగా పయనమయ్యారు.
8/8

పాదయాత్రగా అనపర్తికి బయలుదేరిన చంద్రబాబు
Published at : 17 Feb 2023 07:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion