NEEK on OTT : 'నీక్' ఓటీటీ స్ట్రీమింగ్‌తో డిసప్పాయింట్ - ధనుష్‌కు టాలీవుడ్ ఫ్యాన్స్ నుంచి కొత్త డిమాండ్!
NEEK on OTT : ధనుష్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'నీక్' శుక్రవారం ఓటీటీలోకి అడుగుపెట్టింది. కానీ ఈ మూవీ తెలుగు వెర్షన్ అందుబాటులో లేకపోవడం టాలీవుడ్ మూవీ లవర్స్‌ను నిరాశ పరిచింది.

OTT Fans Demand Telugu Dubbed Version Of NEEK Movie: 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం' (నీక్) సినిమా ఫిబ్రవరి 21న థియేటర్లలోకి వచ్చింది. ధనుష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు డిజిటల్‌లో అరంగేట్రం చేయడంతో... కొంతమంది మూవీని చూసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 'నీక్' మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల కాకపోవడమే దానికి కారణం.
తెలుగు ఆడియన్స్‌ను నిరాశపరిచిన 'నీక్'
ధనుష్ దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన 'నీక్' మూవీ మార్చ్ 21 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ తమిళంతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుందని భావించారు ధనుష్ అభిమానులు. కానీ ఆశ్చర్యకరంగా 'నీక్' చిత్రం తెలుగులో అందుబాటులోకి రాకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలోనే X వేదికగా 'నీక్' తెలుగు - డబ్బింగ్ వెర్షన్‌ను ఓటీటీలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధనుష్, జీవీ ప్రకాష్, అమెజాన్ ప్రైమ్ వీడియోలను ట్యాగ్ చేస్తూ, #NEEK తెలుగు వెర్షన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు?" అని ప్రశ్నిస్తున్నారు. మరి మేకర్స్ ఈ మూవీ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.
'నీక్' చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించారు. అలాగే కస్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరితో కలిసి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రంలో పవిష్ నారాయణ్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రలు పోషించారు. అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, శరత్ కుమార్, వెంకటేష్ మీనన్, సిద్ధార్థ శంకర్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు.
'నీక్' వర్సెస్ 'డ్రాగన్'
ఫిబ్రవరి 21న కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 'డ్రాగన్', 'నీక్' సినిమాల మధ్య క్లాష్ నడిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో 'డ్రాగన్' విన్నర్ గా నిలిచింది. తాజాగా ఓటీటీలో మరోసారి ఈ రెండు చిన్న సినిమాల మధ్య క్లాష్ నెలకొంది. 'నీక్' మూవీ మార్చ్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఈ మూవీని 'జాబిలమ్మ నీకు అంత కోపమా' పేరుతో థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ తెలుగు వెర్షన్ డిజిటల్ స్ట్రిమింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. మరోవైపు మార్చ్ 21 నుంచి 'డ్రాగన్' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ రెండు సినిమాల ఓటీటీ క్లాష్ లో విన్నర్‌గా నిలిచేది ఎవరంటే వచ్చే వ్యూస్‌ను బట్టి తేలుతుంది.
#NEEK Telugu version when?@dhanushkraja @gvprakash @PrimeVideoIN
— Karthik Reddy (@reddythoughts) March 20, 2025
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

