Samantha : నాగ చైతన్య చివరి గుర్తును చెరిపేస్తున్న సమంత - ప్లీజ్... అలా చేయొద్దంటూ అభిమానుల రిక్వెస్ట్
Samantha : నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు వేయించుకున్న టాటూను చెరిపేస్తోంది సమంత. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్‌లో ఈ విషయాన్ని గమనించిన అభిమానులు ఇంకెప్పుడూ టాటూ వేయించుకోవద్దని సలహా ఇస్తున్నారు.

Samantha Getting Rid Of Matching Naga Chaitanya Tattoo: ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన సౌత్ క్వీన్ సమంత ప్రస్తుతం సినిమాల జోరు తగ్గించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో స్టార్ హీరోలు అందరితోనూ నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ జీవితంలో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం, అనారోగ్యం బారిన పడటం వంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు చేతిపై సేమ్ టాటూను వేయించుకున్నారు. ఇప్పుడు ఆ టాటూని సమంత తొలగించడం గమనార్హం. తాజాగా సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన పోస్ట్‌లో చేతిపై ఉన్న టాటూ పూర్తిగా మాయమైనట్టుగా కనిపిస్తోంది.
నాగచైతన్య గుర్తులు చెరిపేస్తున్న సామ్
'ఏ మాయ చేసావే' మూవీతో సమంత టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇక ఇదే మూవీలో నాగచైతన్య హీరోగా నటించగా, ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం పెద్దల ఆశీర్వాదంతో 2017లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత ఈ జంట విడిపోయారు. అయితే ఇద్దరి మధ్య బంధం బీటలు వారడానికి గల కారణం ఏంటి అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. ప్రస్తుతం ఇద్దరూ ఎవరి దారిలో వారు నడుస్తూ, సినిమాలతో బిజీ అయిపోయారు. విడాకులు తీసుకున్న తర్వాత సమంత మయోసైటిస్ బారిన పడి, సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ఇక అనారోగ్యం నుంచి కోలుకున్న ఈ బ్యూటీ హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను చేయడానికి సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలోనే సమంత తాజాగా సోషల్ మీడియాలో తన జర్నీకి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలో సమంత నాగ చైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు వేయించుకున్న టాటూ సరిగ్గా కనిపించకపోవడం అందరి దృష్టికి ఆకర్షించింది. సమంత చేతిపై ఆ టాటూ మసగ్గా కనిపిస్తుంది. దీంతో సమంత నాగచైతన్య గుర్తులు చెరిపేయడానికి ట్రై చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రేమించిన వారి టాటూలు వేయించుకోవడం ఈజీనే, కానీ ఎప్పుడు బ్రేక్ అవుతుందో తెలియని రిలేషన్ కోసం అంత పెయిన్ అనుభవించి వేయించుకోవడమే ఒక ఎత్తు అయితే, దానిని తీయించడం కూడా మరింత పెయిన్‌తో కూడుకున్న పని. కాబట్టి ఎవ్వరూ ప్రేమించిన వారి టాటూను వేయించుకోకండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. అలాగే మూవ్ ఆన్ అవ్వడానికి టైమ్ వచ్చేసింది అంటూ సామ్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఇక నాగచైతన్య మరోవైపు శోభిత ధూళిపాళను రెండో పెళ్లి చేసుకుని, 'తండేల్' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
నిర్మాతగా సమంత ఫస్ట్ మూవీకి 'శుభం' కార్డు
సమంత ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసింది. ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ఫస్ట్ మూవీ సక్సెస్ ఫుల్‌గా పూర్తయినట్టు సామ్ ఇటీవలే అనౌన్స్ చేసింది. 'శుభం' అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు 'సినిమా బండి' ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇందులో శ్రియ, శ్రీ మల్గిరెడ్డి, శాలిని కొండెపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి కీలక పాత్రలు పోషించారు. ఇందులో సమంత అతిథి పాత్రలో మెరువబోతున్నట్టు టాక్ నడుస్తోంది. మరోవైపు సమంత 'రక్త్ బ్రహ్మాండ్' సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉంది.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

