Kirsty Coventry:IOC అధ్యక్షురాలిగా కిర్స్టీ కోవెంట్రీ- 130 ఏళ్ల చరిత్రలో మొదటి మహిళా చీఫ్
Kirsty Coventry:క్రిస్టీ కోవెంట్రీ IOC అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ. జింబాబ్వే క్రీడా మంత్రిగా కూడా పని చేశారు. ఆమె ఎన్నికలు జైషా అభినందించారు. కలిసి పని చేద్దామని ఆహ్వానించారు.

Kirsty Coventry:అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నూతన అధ్యక్షురాలిగా కిర్స్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ క్రిస్టీ కోవెంట్రీ రికార్డు సృష్టించారు. ఇది కాకుండా, క్రిస్టీ కోవెంట్రీ జింబాబ్వే క్రీడా మంత్రిగా పని చేశారు. ఇప్పుడు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఐసిసి అధ్యక్షుడు జై షా ఏం అన్నారు?
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు క్రిస్టీ కోవెంట్రీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) అధ్యక్షుడు జై షా అభినందించారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో... 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చడానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. దీని కోసం, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) కొత్తగా ఎన్నికైన అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.
Congratulations and best wishes to newly-elected IOC President @KirstyCoventry, an honour thoroughly deserved and something I’m humbled to have been present for in Greece after hosting you at the @ICC #ChampionsTrophy.
— Jay Shah (@JayShah) March 20, 2025
I look forward to working with you and your team on… pic.twitter.com/9ShJLxwL5w
గత 12 సంవత్సరాలుగా IOC అధ్యక్షుడిగా సేవలు అందించిన థామస్ బాచ్ సాధించిన విజయాలను ప్రశంసించారు జైషా. జూన్ 23 తర్వాత IOC అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ముగియనుందని తర్వాత ఆయన IOC జీవితకాల గౌరవ అధ్యక్షుడిగా ఉండటం చాలా మంచి పరిణామం అని అన్నారు. తాను ఆయనతో గడిపిన సమయాన్ని ఆస్వాదించానని ఎక్స్‌లో తెలియజేశారు.
I want to commend Thomas Bach for his achievements as IOC President for the past 12 years, and it was fitting he was elected Honorary President for Life of the IOC which begins when his term of office as IOC President ends after 23rd June. I enjoyed my time with him this year and… pic.twitter.com/0d3uQPTi8e
— Jay Shah (@JayShah) March 21, 2025
ఇప్పటికే క్రికెట్‌ను 2022 కామన్వెల్త్ గేమ్స్, 2023 ఆసియా గేమ్స్‌లో చేర్చారు. అదే సమయంలో 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ గేమ్స్‌లో క్రికెట్ చేర్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది జరిగితే, దాదాపు 128 సంవత్సరాల తర్వాత క్రికెట్ తిరిగి ఒలింపిక్ క్రీడల్లోకి వస్తుంది.
మొదటి మహిళా, మొదటి ఆఫ్రికన్ IOC అధ్యక్షురాలు
క్రిస్టీ కోవెంట్రీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)కి పదో అధ్యక్షురాలు. ఆమె IOC అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ, మొదటి ఆఫ్రికన్ కూడా. గ్రీస్‌లోని కోస్టా నవరినోలో జరిగిన IOC 144వ సమావేశంలో క్రిస్టీ కోవెంట్రీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. క్రిస్టీ కోవెంట్రీ ICC ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో తళుక్కున మెరిశారు. ఇండియా-ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్ సమయంలో క్రిస్టీ కోవెంట్రీ సందడి చేశారు. ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ తిరిగి ప్రవేశపెడితే అదో పెద్ద అడుగుగా మారనుంది. క్రికెట్‌తోపాటు, బేస్ బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, స్క్వాష్ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ క్రీడలలో తిరిగి వచ్చే అవకాశం ఉంది.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చీఫ్ IOC పాలన, దాని వ్యవహారాల చూసుకుంటారు. IOC కార్యనిర్వాహక బోర్డులో ఛైర్మన్, నలుగురు ఉపాధ్యక్షులు, పది మంది ఇతర సభ్యులు ఉంటారు. బోర్డు సభ్యులందరినీ IOC సభ్యులు రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన IOC అధ్యక్షులు నాలుగు సంవత్సరాల చొప్పున రెండు పర్యాయాలు పదవిలో ఉంటారు. రెండు టెర్ములు సేవలందించే అధ్యక్షుడు కనీసం రెండు వేసవి ఒలింపిక్ క్రీడలు, రెండు వింటర్ ఒలింపిక్ గేమ్స్‌కు నాయకత్వం వహిస్తాడు .
ఇప్పటి వరకు పని చేసిన ఐవోసీ చీఫ్‌ల వివరాలు
ఐవోసీ చీఫ్ పేరు | ఎప్పటి నుంచి | ఎప్పటి వరకు | పదవీ కాలం | దేశం |
డిమెట్రియస్ వికెలాస్ | 28 జూన్ 1894 | 10 ఏప్రిల్ 1896 | 1 సంవత్సరం, 287 రోజులు | గ్రీస్ |
పియర్ డి కూబెర్టిన్ | 10 ఏప్రిల్ 1896 | 28 మే 1925 | 29 సంవత్సరాలు, 48 రోజులు | ఫ్రాన్స్ |
హెన్రీ డి బైలెట్-లాటూర్ | 28 మే 1925 |
6 జనవరి 1942 ( పదవిలో ఉండగా మరణించారు ) |
16 సంవత్సరాలు, 223 రోజులు | బెల్జియం |
సిగ్‌ఫ్రిడ్ ఎడ్‌స్ట్రోమ్ | 6 జనవరి 1942 | 6 సెప్టెంబర్ 1946 | 4 సంవత్సరాలు, 243 రోజులు ( యాక్టింగ్) | స్వీడన్ |
సిగ్‌ఫ్రిడ్ ఎడ్‌స్ట్రోమ్ | 6 సెప్టెంబర్ 1946 | 15 ఆగస్టు 1952 | 5 సంవత్సరాలు, 344 రోజులు | స్వీడన్ |
అవేరి బ్రండేజ్ | 15 ఆగస్టు 1952 | 11 సెప్టెంబర్ 1972 | 20 సంవత్సరాలు, 27 రోజులు | యునైటెడ్ స్టేట్స్ |
మైఖేల్ మోరిస్ | 11 సెప్టెంబర్ 1972 | 3 ఆగస్టు 1980 | 7 సంవత్సరాలు, 327 రోజులు | ఐర్లాండ్ |
జువాన్ ఆంటోనియో సమరంచ్ | 3 ఆగస్టు 1980 | 16 జూలై 2001 | 20 సంవత్సరాలు, 347 రోజులు | స్పెయిన్ |
జాక్వెస్ రోగ్ | 16 జూలై 2001 | 10 సెప్టెంబర్ 2013 | 12 సంవత్సరాలు, 56 రోజులు | బెల్జియం |
థామస్ బాచ్ | 10 సెప్టెంబర్ 2013 | 23 జూన్, 2025 | 11 సంవత్సరాలు, 192 రోజులు | జర్మనీ |
క్రిస్టీ కోవెంట్రీ | 23 జూన్, 2025 | కొత్తగా ఎన్నికైన వ్యక్తి | కొత్తగా ఎన్నికైన వ్యక్తి | జింబాబ్వే |
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

