Karnataka Bandh: శనివారం కర్ణాటక బంద్ - మరాఠీ బాష వివాదంతో కన్నడ సంఘాల పిలుపు
Bengaluru: కర్ణాటకలో మరాఠీ భాష వివాదం రాజుకుంటోంది. బెలగావి ప్రాంతంలో ఓ బస్ కండక్టర్ పై దాడి చేసిన ఘటన ఈ బంద్‌కు కారణం.

Karnataka Bandh Saturday : మార్చి 22 శనివారం కర్ణాటక బంద్ కు కన్నడ అనుకూల సంస్థలు పిలుపునిచ్చాయి. గ్రేటర్ బెంగళూరు పాలన బిల్లుతో పాటు బెలగావి ప్రాంతంలో ఒక బస్సు కండక్టర్ మరాఠీలో మాట్లాడనందుకు కొంత మంది వ్యక్తులు దాడి చేసినందుకు బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ద్వారా కన్నడ అనుకూల సంస్థలు తమ బలాన్నిచూపించే ప్రయత్నం చేస్తున్నాయి.
మహారాష్ట్ర సరిహద్దులో ఉండే బెళగావి ప్రాంతంలో కర్ణాటక ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మరాఠీలో మాట్లాడాలని కండక్టర్ ను అడిగాడు. అయితే ఆ కండక్టర్ కన్నడలోనే మాట్లాడాడు. అయితే ఆ మరాటీ వ్యక్తి దాడిచేశాడు. ఈ అంశం కర్ణాటక వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటనకు నిరసనగా శనివారం కన్నడ సంఘాల జేఏసీ బంద్ కు పిలుపునిచ్చారు. రాజధాని బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు అందరూ సహకరించాలని కోరింది. బంద్ పిలుపు కారణంగా ప్రజా రవాణా సహా పలు సేవలపై తీవ్ర ప్రభావం పడనుంది. విద్యా సంస్థలు కూడా మూసివేయనున్నారు. ఆర్టీసీ బస్సు సేవలను నిలిచిపోనున్నాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగులు బంద్‌కు సంఘీభావం తెలిపారు. ప్ర బంద్‌కు ఓలా, ఉబర్, ఆటో రిక్షా యూనియన్ల సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో బెంగళూరు ఉదయం అంతా స్తంభించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Karnataka Bandh Alert – March 22, 2025 🚨
— NewsHamster (@NewsHamster1) March 21, 2025
Wondering what’s open and what’s closed? Here’s everything you need to know!
Plan ahead, avoid unnecessary travel, and stay updated! #KarnatakaBandh #BandhAlert #StaySafe #karnataka #bandh pic.twitter.com/J9PvkvKO3n
హోటల్స్, సినీ పరిశ్రమ ప్రతినిధులు కూడా బంద్ కు మద్దతు పలికారు. ఉదయం ఆట షోలు నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటకలోఉన్న మహారాష్ట్ర ఏకీకరణ సమితి వంటి మరాఠీ గ్రూపులను నిషేధించాలని, బెళగావి వంటి సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ మాట్లాడే ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బెంగళూరును జోన్లుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కన్నడ సంస్కృతిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని సంఘాలంటున్నాయి. అయితే ప్రజల్ని ఇబ్బంది పెట్టే బందులు మంచివి కావని కొంత మంది అంటున్నారు.
Linguistic Minorities of Karnataka will not support the "Karnataka Bandh" called on March 22.
— Prathik Ponnanna (@Prathikthethith) March 20, 2025
We condemn forceful imposition of any language, but calling entire state Bandh is not logical.
Mr V Nagraj has never raised issue of Kodava & Tulu Minorities in Karnataka#NoBandh pic.twitter.com/hNPpm4fDgS
మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో బెళగావి ఉంటుంది. అక్కడ కన్నడతో పాటు మరాఠీ ప్రజలు కూడా ఎక్కువే ఉంటారు. మరాఠీలు కర్ణాటక ప్రజలే కానీ భాషా పరంగా వారు విడిపోయారు. అదే సమయంలో సరిహద్దు వివాదం కడా ఉంది. బెళగావిలో 800 కుపైగా గ్రామాలు మహారాష్ట్రవని ఆ రాష్ట్రం వాదిస్తోంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ేర్పాటు చేసినప్పుడు కొన్ని ప్రాంతాలను కర్ణాటకలో కలిపారు. అవి తమవని మహారాష్ట్ర మొదటి నుంచి వాదిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

