అన్వేషించండి
Sonu Sood Birthday: రియల్ హీరో సోనూసూద్ బర్త్ డే - ఆయన ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా?
Sonu Sood Birthday: రియల్ సోనూసూద్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ వెల్లువెత్తున్నాయి. అంతేకాదు ఆయన ఆస్తుల వివరాలు కూడా సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి.

Image Credit: sonu_sood/Instagram
1/11

Happy Birthday Sonu Sood: సోనూసూద్ అంటే లాక్‌డౌన్‌కు ముందు లాక్‌డౌన్ తర్వాత అని చెప్పాలి. అప్పటి వరకు సినీ నటుడు, ప్రతికథానాయకుడు, 'అరుంధతి' సినిమాలో పశుపతిగానే అందరికి పరిచయం. కానీ లాక్‌డౌన్‌లో ఎవరూ చేయని సాహసం చేసి ఇంటి నుంచి బయటకు వచ్చారు.
2/11

ఎంతోమంది పేదలకు అండగా నిలబడ్డారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించారు. లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కున్న వలస కూలీలను ప్రత్యేకం బస్సు ఏర్పాటు చేసి సొంత ఊర్లకు చేర్చారు. విదేశాల్లో చిక్కుకున్న వారి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి స్వదేశానికి తీసుకువచ్చారు.
3/11

ఇదంత తన సొంత ఖర్చులతో చేస్తూ కోట్ల రూపాయలు సామాజీక కార్యక్రమాలకే వినియోగిస్తున్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తీర్చేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇలా నిస్వార్థంతో పేదలకు చేయూతను అందిస్తూ 'కలియుగ కర్ణుడు' అనిపించుకుంటున్నారు.
4/11

నేడు ఈ రియల్ హీరో బర్త్‌డే (Happy Birthday Sonu Sood ). జూలై 30న ఆయన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా అలాగే ఆయన ఆయన ఆస్తుల వివరాలు కూడా నెట్టింట చర్చనీయాంశం అవుతుంది.
5/11

నిరంతరం సేవ కార్యక్రమాలతో బిజీగా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? నటుడిగా సోనూసూద్ బాగానే సంపాదిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఆయనకు వచ్చిన క్రేజ్‌తో ప్రముఖ బ్రాండ్ సంస్థలకు ఆయన అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
6/11

అంతేకాదు ఆయన రెస్టారెంట్ బిజినెస్‌లు కూడా ఉన్నాయట. అలా నటుడిగా, బ్రాండ్ ప్రమోషన్స్‌తో పాటు, హోటల్ బిజినెస్‌లు కూడా ఉన్నాయి. అలా ఆయనకు మొత్తం రూ.140 నుంచి రూ.150 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు సమాచారం.
7/11

వీటితోపాటు ముంబైలో పెద్ద ఇల్లు ఉంది. అలాగే సొంత రెస్టారెంట్ కూడా ఉంది.అలాగే ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. ఇవికాక వారసత్వంగానూ సోనూసూద్‌కు కొన్ని ఆస్తులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
8/11

ఇక ఆయనకు కార్లంటే పెద్దగా ఆసక్తి లేదు. కానీ ఆయన దగ్గర పోర్షా పనామెరా, బెంజ్ ఎంఎల్ క్లాస్ కార్లు ఉన్నాయి. అలాగే సోనూసూద్‌కు సొంతంగా నిర్మాణ సంస్థ కూడా ఉంది. నటుడిగా సోనూసూద్ ఒక్కో సినిమాకు 2-5 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటాడని టాక్.
9/11

కాగా 1999లో సోనూసూద్ 'కల్లగర్' సినిమాతో ఆయన సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, సౌత్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేశారు. 2009లో ‘అరుంధతి’ సినిమాలో ఒక్కసారిగా ఆయన లైమ్ లైట్లోకి వచ్చారు. ఇందులో ఆయన పోషించిన పశుపతి పాత్ర ఇప్పిటికే ప్రేక్షకులు గుండెల్లో నిలిచిపోయింది.
10/11

అలా తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ఆయన ఝ'దబాంగ్','జోధా అక్బర్'తో పాటు పలు సినిమాలు చేశారు. అలాగే కన్నడ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు చేశారు. ఇక కోవిడ్ సమయంలో చాలా మందికి సహాయం చేశాడు. సోనూ సూద్ తన ఛారిటీ ద్వారా చాలా మందికి సహాయం అందిస్తున్నారు.
11/11

image 11
Published at : 30 Jul 2024 04:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion