Netflix Pandaga: పవన్ ‘ఓజీ’ to ‘హిట్ 3’, ‘తండేల్’ వరకు - 2025లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే తెలుగు సినిమాలివే... ఈసారీ పండగ మామూలుగా ఉండదు
Netflix 2025 Movies: 2025లో తమ ఓటీటీలో రాబోయే క్రేజీ సినిమాలను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. థియేట్రికల్ రన్ అనంతరం చేసుకున్న ఒప్పందం ప్రకారం 2025లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే క్రేజీ సినిమాలివే..
Movies in NetFlix 2025: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ 2024లో ప్రకటించినట్లుగానే 2025 ప్రారంభంలోనే ఈ సంవత్సరం తమ ఓటీటీలో వచ్చే సినిమాల లిస్ట్‌ని ప్రకటించి.. తమ వీక్షకులకు బ్లాక్‌బస్టర్ బొనాంజాని ఇచ్చింది. 2024లో ‘గుంటూరు కారం’, ‘సలార్’, ‘దేవర పార్ట్ 1’, ‘లక్కీ భాస్కర్’ వంటి పాపులర్ సినిమాలతో సందడి చేసిన నెట్‌ఫ్లిక్స్.. తమ అప్‌కమింగ్ తెలుగు సినిమాల లిస్ట్‌ని వదిలి.. ఆల్రెడీ సబ్‌స్క్రైబ్ అయిన వాళ్లకూ, కొత్తగా అవ్వాల్సిన వాళ్లకి.. అందరికీ మాంచి కిక్ ఇచ్చింది. ఎందుకంటే, నెట్‌ఫ్లిక్స్ వదిలిన సినిమాల లిస్ట్ అలా ఉంది మరి. మరీ ముఖ్యంగా ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకోవడంతో.. ఈ అనౌన్స్‌మెంటే ‘నెట్‌ఫ్లిక్స్’కు పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది.
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’తో పాటు.. రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి వంటి వారు నటిస్తున్న క్రేజీ చిత్రాలను కూడా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నిజంగా నెట్‌ఫ్లిక్స్ వదిలిన లిస్ట్ చూస్తుంటే.. 2025 నెట్‌ఫ్లిక్స్ యూజర్స్‌కి పండగే అని చెప్పొచ్చు. థియేట్రికల్ రిలీజ్ అనంతరం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఓటీటీలోకి రానున్న బిగ్ స్టార్స్, ఎపిక్ సినిమాలని అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. ఈ చిత్రాలు తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందిస్తాయని హామీ ఇస్తోంది.
సంక్రాంతి స్పెషల్‌గా నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసిన 2025లో విడుదలయ్యే సినిమాల లిస్ట్ ఇదే..
- ‘OG’- తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ
- ‘అనగనగా ఒక రాజు’- తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ
- ‘Court: State vs A Nobody’- తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
- ‘జాక్’- తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
- ‘మ్యాడ్ స్క్వేర్’- తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
- ‘మాస్ జాతర’- తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ
- ‘తండేల్’- తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
- ‘విజయ్ దేవరకొండ 12 (VD12)’- తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
- ‘హిట్ 3 - ది థర్డ్ కేస్’- తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
ఇవి నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసిన సినిమాలుఈ సినిమాలన్నింటిపై ఎలాంటి క్రేజ్, అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులే కాదు.. ఇతర ఇండస్ట్రీలలోని ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు.
Also Read: ‘గేమ్ చేంజర్’ రిజల్ట్‌పై రామ్ చరణ్ రియాక్షన్... మెగా ఫ్యాన్స్, రివ్యూయర్లు ఏమంటారో చూడాలి
The third case just dropped, and it’s going to HIT you hard! 🎯
— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025
HIT 3: The Third Case, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/8KhprUV55Y
ఈ నెట్‌ప్లిక్స్ పండుగను పురస్కరించుకుని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. 2024వ సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు అద్భుతమైన సంవత్సరం. ఎందుకంటే, తెలుగు సినిమాలు మునుపెన్నడూ లేని విధంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఓటీటీలో హృదయాలను గెలుచుకున్నాయి. ‘దేవర, గుంటూరు కారం, హాయ్ నాన్న, లక్కీ భాస్కర్, సలార్, సరిపోదా శనివారం’ వంటి బ్లాక్‌బస్టర్‌లు ప్రపంచవ్యాప్తంగా లవబుల్‌గా మారి, వాచ్‌లిస్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఉత్సాహంతో 2025లోకి అడుగుపెడుతున్నప్పుడు మా వీక్షకులకు మరింత ఉత్సాహం ఇవ్వాలి కదా. అందుకే తెలుగు పరిశ్రమలోని ప్రముఖ నటులు, కథలతో కూడిన స్లేట్‌తో ఈ పండుగను మరింత స్పెషల్ చేశాం. ‘OG, హిట్ 3 - ది థర్డ్ కేస్’ నుండి యాక్షన్-ప్యాక్డ్ ‘VD 12’ వరకు అద్భుతమైన సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ ఇండియా హామీ ఇస్తోందని చెప్పుకొచ్చారు.
Also Read: 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?