Cancer Risk : 20 నుంచి 49 ఏళ్ల వ్యక్తుల్లో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Cancer Prevention : జీవనశైలిలో మార్పుల వల్ల యువతలో క్యాన్సర్ బాధితులు ఎక్కువ అవుతున్నారంటూ తాజా అధ్యయనం వెల్లడించింది. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించింది.

Cancer in Young Adults : క్యాన్సర్ రావడానికి వివిధ కారణాలు ఉంటాయి. వివిధ పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. వయసు ప్రభావం వల్ల కూడా కొందరిలో కొన్ని రకాలు క్యాన్సర్స్ వస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో యువతలో ఈ కేసులు పెరుగుతున్నాయని తేల్చింది తాజా అధ్యయనం. జీవనశైలిలో మార్పులు క్యాన్సర్ ప్రమదాలను పెంచుతున్నాయని గుర్తించారు. కొన్ని మార్పులు చేయడం వల్ల ఈ ప్రాణాంతక వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చంటూ సూచిస్తున్నారు.
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం.. 50 ఏళ్లలోపు వ్యక్తులలో క్యాన్సర్ కేసులు పెరిగినట్లు గుర్తించారు. పెద్దపేగు, మల, రొమ్ము, ఎండోమెట్రియల్ క్యాన్సర్‌తో సహా అనేక రకాలు క్యాన్సర్లు యువతలో ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా తన జర్నల్‌లో 20 నుంచి 49 సంవత్సరాల మధ్యగల వ్యక్తులలో ఈ క్యాన్సర్ రేటు పెరిగినట్లు తెలిపింది. దీనికి కారణం లైఫ్‌స్టైల్ అంటూ నిపుణులు షాకింగ్ విషయం తెలిపారు. అందుకే జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులను సూచించారు.
బరువు తగ్గడం..
బరువు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని సూచించారు. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉంటే రొమ్ము, పెద్దపేగు, మూత్రపిండాల క్యాన్సర్స్ వచ్చే అవకాశముందని తెలిపారు. అందుకే బరువు తగ్గాలని సూచిస్తున్నారు.
వ్యాయామం
జిమ్ చేయడానికి, వ్యాయామం చేయడానికి టైమ్ సరిపోవట్లేదని సాకులు చెప్పకుండా రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. తేలికపాటి వ్యాయామాలు కూడా క్యాన్సర్ ప్రమాదాలను దూరం చేయడమే కాకుండా పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా కోలన్, బ్రెస్ట్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
హెల్తీ డైట్
తీసుకునే ఆహారం చాలావరకు కల్తీ ఉంటుంది. అలా అని అందరూ ఆర్గనిక్ ఫుడ్స్‌ని ఎఫర్ట్ చేయలేరు. అలాంటివారు.. తమ డైట్లో ఫ్రూట్స్, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. తృణధాన్యాలు కూడా డైట్లో ఉండేలా చూసుకుంటే మంచిది. ఈ ఫుడ్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
ధూమపానం
స్టైల్కోసమో.. స్ట్రెస్ కోసమో స్మోకింగ్ అలవాటు అయితే.. దానిని వెంటనే మానేయాలని సూచిస్తున్నారు. యువతలో క్యాన్సర్ రేటు పెరగడానికి ఇదే అతిముఖ్యమైన రీజన్‌గా చెప్తున్నారు. స్కూల్ ఏజ్ నుంచే చాలామంది ఈ అలవాటు చేసుకుంటున్నారు. దీనివల్ల యంగ్ ఏజ్‌లోనే క్యాన్సర్ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. లంగ్, మౌత్, థ్రోట్ క్యాన్సర్స్ రిస్క్‌ను స్మోక్ పెంచుతుంది. మీ చుట్టు ఉన్నవారికి కూడా పొగ మంచిది కాదు కాబట్టి వీలైనంత దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.
మద్యపానం
ఏదైనా రీజన్ ఉంటే మందు తాగడం నుంచి మందు తాగడానికే రీజన్స్‌ని వెతుక్కుంటుంది యువత. లైఫ్‌లో ఏమి జరిగినా దానిని మందుతో లింక్ చేసేవాళ్లు ఉన్నారు. మీరు అలాంటివారిలో ఒకరు అయితే కచ్చితంగా ఆ అలవాటును తగ్గించుకోవాలంటున్నారు నిపుణులు. దీనిని లిమిట్కి మించి తీసుకోవడం వల్ల లివర్, బ్రెస్ట్, కోలోన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఇవే క్యాన్సర్ కారకాలు అనుకుంటున్నారేమో. సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా క్యాన్సర్ ప్రమదాం పెరుగుతుందట. అలాగే ఒత్తిడి కూడా రోగనిరోధక శక్తిని వీక్ చేసి.. క్యాన్సర్ కారకాలను పెంచుతుందని అధ్యయన ఫలితాలు నిరూపించాయి. ఇవన్నీ పక్కన పెడితే కొందరికి జెనిటిక్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. కాబట్టి ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మీరు ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలి.
కెమికల్స్, రేడియేషన్, కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరగడం వల్ల కూడా క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అయితే ఏ కారణంతో అయినా క్యాన్సర్ వస్తే.. దానికి ముందుగానే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. రెగ్యూలర్‌గా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఎంత త్వరగా క్యాన్సర్‌ను గుర్తిస్తే.. అంత త్వరగా ఈ ప్రాణాంతక సమస్య నుంచి బయటపడొచ్చు. కొన్ని మినహా.. ఎన్నో క్యాన్సర్లకు చికిత్స అందుబాటులో ఉంది. ఎర్లీగా గుర్తిస్తే ట్రీట్మెంట్ ద్వారా మంచి ఫలితాలు చూడొచ్చు.
Also Read : ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే ముందు.. ఈ క్యాన్సర్ గురించి ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయాలివే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

