Srikakulam Crime: చోరీ అయిన 1 కిలో 206 గ్రాముల బంగారాన్ని వాటి యజమానులకు అందజేసిన శ్రీకాకుళం పోలీసులు
Andhra Pradesh News | శ్రీకాకుళ జిల్లా పోలీసులు 32 కేసులలో 1 కిలో 206 గ్రామాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను ఎస్పీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు.

Theft in Srikakulam District | శ్రీకాకుళం జిల్లాలో ఆయా కేసులలో సొత్తు రికవరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రాపర్టీ కేసులో అరెస్టయిన నిందితులను కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేశారు. ఎచ్చెర్ల, లావేరు, శ్రీకాకుళం ఒకటో పట్నం, శ్రీకాకుళం రూరల్, టూ టౌన్, గార, పొందూరు, పోలకి, విశాఖపట్నం సిటీ పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో నిందితులు నేరం చేసినట్లు అంగీకరించారు. మొత్తం 32 కేసులలో 1 కిలో 206 గ్రామాల బంగారం రికవరీ చేసినట్లు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి వెల్లడించారు.
కేసులో నిందితుల వివరాలివి...
ఏ1 పున్నాన రాంబాబు నిహాన్ లేటు నర్సింహులు (30) తుర్పుకాపు, గార్డెన్ పడమట, విజయవాడ అర్బన్, పత్తి కాయపాలవలస చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా వ్యక్తి. ఏ-2 గిడిజాల కోటేశ్వరరావు తండ్రి సత్యనారాయణ (33) విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి. వైష్ణపువీధి, శ్రీకాకుళం టౌన్, గెడ్డకంచారం (వి), జి.సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లా వాసిగా ఎస్పీ చెప్పారు. 2024లో డిసెంబరు 30న ఫిర్యాది తన బంధువుల ఇంటిలో జరుగు ఫంక్షన్కు వెళ్లారని, వారి అమ్మ సుశీల తనకున్న ఐదున్నర తులాల బంగారు కాసులపేరు బంగారు చైను వేసుకొని వెళ్లి, వచ్చిన తర్వాత, వాటిని ఇనుప బీరువాలో భద్రపర్చినట్లు, మళ్లీ 7జనవరి 2025 న పండుగ సందర్భంగా బీరువాను శు భ్రం చేస్తుండగా కాసులపేరు, తులం బరువు బంగారుచైను కనబడనట్లు, ఎవరో దొంగిలించినట్లుగా ఫిర్యాదు చేశారు.
ఎచ్చెర్ల, లావేరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది సమాచారం మేరకు జనవరి 17 సాయంత్రం 6 గంటల సమయంలో ఎచ్చెర్ల మండలం, అరిణం అక్కివలస కూడలి, పకృతి లేఔట్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు ఏ1, ఏ2 నిందితులన్ని అదుపులోకి తీసుకొని ఆ కేసులోని ప్రాపర్టీ తో పాటు తెలుపు రంగు కలర్ హెూండా యాక్టివ్ వాహ నాన్ని స్వాధీనం చేసుకున్నారన్నారు. ఏ1 పై చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉందని, అతను 6వ తరగ "తి నుండి ఇంటర్మీడియట్ వరకు విజయవాడలో తన అత్తదగ్గర చదువుకున్నాడ న్నారు. ఈ సమయంలో ఏ1 క్రికెట్ నేర్చుకుని, కోచ్ వద్ద కోచింగ్ పొందాడని, రంజీ జట్టుకు ఎంపిక విషయంలో కోచ్ అతన్ని మోసం చేశాడని ఆరోపించినట్లు వివరించారు. ఈ విషయం అతన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, ఆస్తి నేరాలలో పాల్గోవడానికి దారితీసిందన్నారు. గుంటూరు, విజయ వాడ, ఎస్.కోట, రాజాం, విజయనగరం, చీపురుపల్లి, రణస్థలం, లావేరు పోలీస్ స్టేషన్ల పరిధులతో సహా పలు పోలీస్ స్టేషన్లో 30 కేసుల్లో గతంలో అరెస్టయినట్లుచెప్పారు. అన్ని కేసులలోనూ, అతన్ని అరెస్టు చేసిజ్యుడీషియల్ రిమాండ్కు పంపారన్నారు.
జూన్, 2022లో అరెస్టు అయ్యి గత ఏడాది జనవరి 10న విశాఖసెంట్రల్ జైలు నుండి విడుదలయ్యాడన్నారు. అప్పటినుండి అతను నేరాలకు పాల్పడుతున్నాడని, క్రికెట్ బెట్టింగ్ కోసం కూడా చాలా డబ్బు ఖర్చు చేసినట్లు,మొబైల్ అప్లికేషన్లు, హార్డ్వేర్ గురించి సాంకేతిక పరిజానాన్ని తెలిసుకున్నట్లు అంగీకరించాడని ఎస్పీ వివరించారు. జైలులో ఉన్నప్పుడు, వేరే కేసులో అరెస్టయినఏ2 తో స్నేహం ఏర్పడిందని, విడుదలైన తర్వాత, ఏ1చాలా నేరాలకు పాల్పడి, దొంగిలించబడిన సొత్తునిముత్తూట్ ఫిన్ కార్ప్, ముత్తూట్ మినీ ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టడానికి ఏ2 కి ఇచ్చాడన్నారు. ఆ డబ్బులో 10% వాటాను ఏ2 కి ఇచ్చేవాడని తెలిపారు. వీరిద్దరూ నేర ప్రవృత్తి ఇంటికి తాళాలు వేసి ఉన్నఇల్లులు వద్ద రక్కీ చేసి, ఇంటి బయట చెప్పులు రేఖలు, బ్రష్ స్టాండ్లు, కిటికీ మూలలు, ఎలక్ట్రికల్ మీటర్ బాక్స్ ల పైన పెట్టిన తాళాలు గమనించి వాటితో తలుపులుతెరిచారని చెప్పుకొచ్చారు. ఇళ్లలో ఎటువంటి వస్తువులుపాడు చేయకుండా బీరువాలో బంగారు ఆభరణాలులోపెద్ద మొత్తం బంగారు ఆభరణాన్ని ఒక్కటి మాత్రమే తీసుకెళ్లడం వీరి నేరప్రవృత్తి అన్నారు.
ప్రజలూ జాగ్రత్త...
ప్రజలకు జిల్లా ఎస్పీ ముఖ్య విజ్ఞప్తి చేశారు. ఇళ్లకు తాళాలు వేసి బయట ప్రదేశాలు, ఊర్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎట్టి పరిస్థితుల్లో తాళం వేసిన తాళలు ఇంటూ ఆవరణలో ఉంచ రాదని అందుకు తగిన తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచార అందిస్తే నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొన్ని కేసులలో ఇంట్లో బంగారం పోయినట్టు పోలీసులు తెలిపేవరకు తెలియని బాధితులు పోగొట్టుకున్న బంగారా న్ని పూర్తి స్థాయిలో రికవరీ చేయడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు కృతజ్ఞత తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు
దొంగతనాల్లో పీజీ
మీరు దొంగతనాలకు వెళ్ళినప్పుడు ఎవరికీ కూడా అనుమానం రాకుండా ఉంటుంది. దీనికి గల కారణం ఎక్కడ ఇంట్లో వస్తువులను పాడు చేయకుండా కావలసిన వస్తువులు మాత్రమే తీసుకొని వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లడంలో మీరు టాలెంటే వేరు. ఎన్నో దొంగతనాలకు పాల్పడ్డారు ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండానే వచ్చాము. ఈ కేసులో గాని దొరకకుండా ఉంటే కొంతమందికి శిక్షణ కూడా ఇద్దామని అనుకున్నా కానీ దొరికిపోయి ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది.





















