అన్వేషించండి

Daily Step Count : రోజుకు 10,000 అడుగులు నడుస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. డైలీ ఎంత నడిస్తే మంచిదంటే

Walking Research : వాకింగ్ అంటే చాలామంది రోజుకు పదివేల అడుగులు నడవాలి అనుకుంటారు. కానీ అంత అవసరం లేదని.. ఇలా వాకింగ్ చేసినా.. మంచి ఫలితాలుంటాయని తాజా అధ్యయనం తెలిపింది. 

New Study On Walking Benchmarks : ఈ మధ్యకాలంలో వాకింగ్ బెనిఫిట్స్ గురించి ఎక్కువగా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో అయితే రోజుకు 10,000 అడుగులు వేయాల్సిందే అని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు. అయితే రోజుకు పదివేల అడుగులు వేస్తే మంచిదే కానీ.. ఆరోగ్య ప్రయోజనాల కోసం అంత నడవాల్సిన పని లేదని చెప్తోంది తాజా అధ్యయనం. మరి రోజుకు ఎంత నడిస్తే సరిపోతుంది. ఎంత నడవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

నడక మంచిదే. కానీ పదివేల టార్గెట్ కొందరికి సులభంగా ఉండొచ్చు. మరికొందరికి కష్టంగా ఉండొచ్చు. పదివేల అడుగులు వేస్తేనే ఆరోగ్యానికి మంచిదనుకునేవాళ్లు కూడా ఉన్నారు. దీనికోసమే స్మార్ట్ వాచ్​లు, ట్రాకర్స్ ఉపయోగిస్తున్నారు. కాస్త అడుగులు తక్కువైతే డిజప్పాయింట్ అయిపోతున్నారు. అయితే ఈ విషయంపైనే తాజా అధ్యయనం చేశారు. రోజుకు పదివేలు నడిస్తే పెద్ద ప్రయోజనం లేదని.. 7500 అడుగులతో కూడా మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని తెలిపింది.  

రీసెంట్ స్టడీ ఏమి చెప్పిందంటే.. 

వాకింగ్ చేయాలనుకునేవారికి 10,000 అడుగులు అనేది కరెక్ట్ బెంచ్​మార్క్ కాదని తాజా అధ్యయనం తెలిపింది. దానికంటే తక్కువ అడుగులు నడవడం వల్ల ఆరోగ్యానికి మెరుగైన ప్రయోజనాలు అందుతాయని నిరూపించింది. JAMA నెట్​వర్క్​ చేసిన పరిశోధన ప్రకారం రోజుకు 7500 అడుగుల కంటే ఎక్కవ నడవడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉండవట. 7500 అడుగులు నడిస్తే డిప్రెషన్ ప్రమాదం 42 శాతం తగ్గుతుందని చెప్తున్నారు. దానికి మించి ఎంత నడిచిన ప్రయోజనాలనేవి పెద్దగా ఉండవని తేల్చి చెప్పింది. 

శారీరక శ్రమపై డిప్రెషన్ కూడా ఆధారపడి ఉంటుందట. అందుకే శారీరక శ్రమ అనేది వాస్తవికంగా ఉండాలని చెప్తున్నారు నిపుణులు. అధికంగా నడవడానికి ప్రయత్నించినప్పుడు మానసిక, శారీరక ఒత్తిడికి దారి తీయొచ్చని.. దీనివల్ల ఆరోగ్యానికి హాని కలగవచ్చని చెప్తున్నారు. 7,500 అడుగులను తక్కువ వ్యవధిలో చురుకుగా నడిస్తే ఆ ఎఫర్ట్ సరిపోతుందని చెప్తున్నారు. పదివేల అడుగులు ఎక్కువ సేపు నెమ్మదిగా నడవడం కంటే ఇది బెస్ట్ అని తాజా అధ్యయనం ద్వారా తెలిపారు. 

యూకేలోని హెర్ట్​ఫోర్డ్​షైర్ యూనివర్సిటీ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. పదివేల అడుగులు అనేది ఆరోగ్య భద్రతను తప్పుదారి పట్టిస్తుందని తెలిపి.. రోజూ 4,400 అడుగులు నడిస్తే ఆయుష్షు పెంచుతుందని వారి పరిశోధనలో నిరూపించారు. రోజుకు 8,000 అడుగులు నడవడం వల్ల అకాల మరణాల ప్రమాదం దూరమవుతుంది మరో అధ్యయనం నిరూపించింది. 
గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే నడక అనేది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునే అద్భుతమైన మార్గం. కాబట్టి మంచి

ప్రయోజనాల కోసం మీరు పదివేల అడుగులు వేయాల్సిన అవసరం లేదు. తక్కువ నడిచినా.. ఎఫెక్టివ్​గా ఉండే విధానాన్ని ఎంచుకోవాలి. రోజుకు అరగంట ఎఫెక్టివ్​గా నడవండి. పది నిమిషాలు వాక్ చేసి.. చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ వాక్ చేయండి. దీనివల్ల మీ బ్లడ్​ ఫ్లో మెరుగై.. మరింత ఎఫెక్టివ్​గా ప్రయోజనాలు చూడొచ్చు. 

Also Read : వ్యాయామం, డైట్ చేయలేకపోతున్నారా? అయితే బరువు తగ్గేందుకు ఆ​ ఒక్కటి మానేసి చూడండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
DC New Captain Axar: ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్.. అపార అనుభ‌వం అత‌ని సొంతం.. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్
ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్.. అపార అనుభ‌వం అత‌ని సొంతం.. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్
Viral Video: వీడు అసలు మనిషేనా? ఓ ప్రాణం తీశానని కూడా లేదు- వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో చూశారా
వీడు అసలు మనిషేనా? ఓ ప్రాణం తీశానని కూడా లేదు- వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో చూశారా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Parvatmala project Explained in Telugu | రోడ్లు వేయలేని మార్గాల్లో రోప్ వే తో మహారాజులా ప్రయాణం |ABPMS Dhoni Dance in Pant Sister Marriage | అన్నీ మర్చిపోయి హ్యాపీగా డ్యాన్స్ చేసిన ధోనీ | ABP DesamHow To Use Shakthi App | శక్తి యాప్ తో ఎక్కడికెళ్లినా సేఫ్ గా ఉండండి | ABP DesamChitrada Public Talk | చిత్రాడలో జనసేన విజయకేతనం సభపై స్థానికుల అభిప్రాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
DC New Captain Axar: ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్.. అపార అనుభ‌వం అత‌ని సొంతం.. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్
ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్.. అపార అనుభ‌వం అత‌ని సొంతం.. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్
Viral Video: వీడు అసలు మనిషేనా? ఓ ప్రాణం తీశానని కూడా లేదు- వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో చూశారా
వీడు అసలు మనిషేనా? ఓ ప్రాణం తీశానని కూడా లేదు- వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో చూశారా
MLC Nagababu: ఎమ్మెల్సీగా నాగబాబు - ఛాన్స్ ఇచ్చినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు
ఎమ్మెల్సీగా నాగబాబు - ఛాన్స్ ఇచ్చినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు
Hyderabad News: హీరో బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం - ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు
హీరో బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం - ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు
Toxic FIRST review: 'టాక్సిక్' ఫస్ట్ రివ్యూ... యశ్ మూవీపై హైప్ డబుల్ చేస్తున్న 'జాన్ విక్' యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ కామెంట్స్
'టాక్సిక్' ఫస్ట్ రివ్యూ... యశ్ మూవీపై హైప్ డబుల్ చేస్తున్న 'జాన్ విక్' యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ కామెంట్స్
Telangana Ration Cards: రెండు రకాలుగా రేషన్ కార్డులు, తెలంగాణలో కొత్త కార్డులు జారీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన
రెండు రకాలుగా రేషన్ కార్డులు, తెలంగాణలో కొత్త కార్డులు జారీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన
Embed widget