అన్వేషించండి

Tamil Movies: మీకు తెలుగు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇన్నాళ్లూ ఏమైంది తంబీ?

Tamil Movies With Telugu Names : తెలుగు పేర్లు పెట్టుకుంటున్న తమిళ సినిమాలు.. రీసెంట్‌ దెబ్బ గట్టిగా తగిలినట్లుందే అని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.

Tamil movies dubbing versions with Telugu Titles | రెండు, మూడు నెలల క్రితం టాలీవుడ్‌లో ఓ విషయమై తీవ్రమైన చర్చ జరిగింది. తెలుగు సినిమా అంటే అంత లోకువ, తెలుగు ప్రేక్షకులు అంటే అంత లోకువ. సినిమాకు తెలుగు వాళ్ల కలెక్షన్లు కావాలి కానీ.. తెలుగులో పేర్లు పెట్టరా? ఈ చర్చ మీ వరకూ వచ్చే ఉంటుంది. దాదాపు ప్రతి తెలుగు ప్రేక్షకుడూ ఇదే మాట అనుకుని ఉంటారు. ఎందుకంటే వరుసపెట్టి గతేడాది తమిళ సినిమాలు అదే పేరుతో రిలీజ్‌ చేస్తూ వచ్చారు. ఒకటో రెండో సినిమాలు తెలుగు పేరు పెట్టుకుని వచ్చాయి. దీంతో పెద్ద చర్చే జరిగింది. 

తెలుగులోకి వచ్చినప్పుడు పెద్ద పంచాయితీనే..

అలా తమిళ పేర్లతో తెలుగులోకి వచ్చినప్పుడు రీసెంట్‌ టైమ్స్‌లో పెద్ద పంచాయితీనే జరిగింది. ఏకంగా ‘వేట్టయన్‌’ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ ‘తెలుగులో పేరు పెడదాం అనుకున్నాం. తెలుగు టైటిల్‌ అందుబాటులో లేదు’ అని చెప్పారు. దీంతో అప్పటికి ఈ విషయం ముగిసింది. మళ్లీ తమిళ సినిమాలు తెలుగులోకి వస్తే మరోసారి తెలుగు నినాదం ఎత్తుదాం అనుకున్నారు కొందరు. అయితే ఆ అవకాశం లేకుండా తమిళ సినిమా జనాలు తెలుగు పేర్లు వెతుకుతున్నారు. 

రీసెంట్‌ తమిళ తెలుగు సినిమాలివీ..
రీసెంట్‌గా తమిళ పేర్లతో తెలుగులోకి వచ్చిన  సినిమాలు చూస్తే రజనీకాంత్‌ ‘వేట్టయన్‌’, విక్రమ్‌ ‘తంగలాన్‌’, మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1, 2’, సూర్య ‘కంగువ’, అజిత్‌ ‘వలిమై’ శివకార్తికేయన్‌ ‘అమరన్‌’.. ‘అయాలన్‌’ ఇలా రీసెంట్‌ టైమ్స్‌లో చాలానే కనిపించాయి. తొలినాళ్లలో చూసీ చూడనట్లు వదిలేసిన తెలుగు జనాలు ఇప్పుడు అడగం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తమిళ సినిమాల వాళ్లు తమ సినిమాకు తెలుగు పేరు వెతకడం మొదలుపెట్టారు.  ఈ క్రమంలో ‘మేళగన్‌’ సినిమాను ‘సత్యం సుందరం’గా తీసుకొచ్చారు. 

‘పట్టుదల’.. ‘సత్యం సుందరం’
ఇప్పుడు అజిత్‌ కొత్త సినిమాను కూడా తెలుగు పేరుతోనే రిలీజ్‌ చేస్తున్నారు. ‘విదామయూర్చి’ సినిమాకు ‘పట్టుదల’ అనే పేరు పెట్టారు. నిజానికి ఈ మార్పు ఇటీవల కాలంలో చేసిందే. ఎందుకంటే ఈ సినిమాను తొలుత సంక్రాంతికి విడుదల చేద్దామనే ఆలోచనలో ఉంది టీమ్‌. అనుకోని కారణాల వల్ల అప్పుడు అవ్వలేదు. అయితే సంక్రాంతికి ముందు సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు ‘పట్టుదల’ అనే పేరు ఎక్కడా లేదు. కాబట్టి రీసెంట్‌ మార్పే అని చెప్పాలి. 

మరి కన్నడ, మలయాళ సినిమాలు ?

అంతేకాదు ఈ సినిమా స్ఫూర్తితో తర్వాత వచ్చే తమిళ సినిమాలు ఇలానే పేరు మార్చుకునే ఆలోచనలో ఉన్నాయి అని చెబుతున్నారు. ఇదైతే మాత్రం తెలుగు సినిమా ప్రేక్షకులు, మీడియా సాధించిన ఘనతే అని చెప్పాలి. మరి కన్నడ, మలయాళ సినిమాలు కూడా ఇదే పని చేస్తాయేమో చూడాలి. అయితే కొంతమంది దర్శకనిర్మాతలు సినిమాకు ఇంగ్లిష్‌ పేరు పెట్టేస్తే ఎక్కడైనా ఒక్కటే అనే ఆలోచనలూ చేస్తున్నారట.

Read Also : Game Changer Piracy: టాలీవుడ్‌ ఇప్పుడూ స్పందించదా... 'గేమ్ చేంజర్' లీకు వీరుడు... తెలిసినవాడేనా?

టాప్ హెడ్ లైన్స్

Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget