ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
The Mystery of India's Ancient Flying Machine: పురాణాలలో, దేవాలయాల శిల్పాలలో నేటికీ రహస్యంగా ఉన్న పురాతన సాంకేతికతలు ఉన్నాయి. ఎగిరే రథాలు కూడా ఇందులో భాగమే..అవేంటో తెలుసుకుందాం...

Machines of ancient India: భారతీయ పురాణ కథలు, ఆలయాల అద్భుతమైన శిల్పాలు , పవిత్ర గ్రంథాలు నమ్మశక్యం కాని సాంకేతికత కథలతో నిండి ఉన్నాయి. పురాణాలలో ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాల వరకు, ఈ విషయాలన్నీ పురాతన యంత్రాలు భారతదేశంలోని మేధావులు, నిర్మాతలు మన ఊహ కంటే చాలా ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నారని సూచిస్తున్నాయి. కొందరు దీనిని ఒక కల్పిత కథగా భావిస్తారు, మరికొందరు దీనిని చరిత్రలో అంతరించిపోయిన నిజమైన ఆవిష్కరణలతో పోలుస్తారు.
దృష్టి యంత్రాలు
పురాతన గ్రంథాల్లో దృష్టి యంత్రాల గురించి ప్రస్తావన ఉంది, ఇవి నక్షత్రాలను అధ్యయనం చేయడానికి , దేవాలయాలలో కాంతిని చూపించడానికి ఉపయోగించే ప్రత్యేక లెన్స్ లేదా అద్దాలుగా పనిచేసేవి. పురాతన దేవాలయాల్లో అద్దాలు ఉపయోగించి కాంతిని ప్రతిబింబించి ఒకేదీపంతో గర్భగుడిని ప్రకాశవంతం చేసేవారు. ఇది ఆప్టికల్ ఇంజినీరింగ్ గా చెప్పొచ్చు
@ సూర్య సిద్ధాంతం: కాంతి పరివర్తన, అద్దాల్లో ప్రతిబింబాలు, లెన్సుల ద్వారా రిఫ్రాక్షన్ , డిప్రాక్షన్ వంటి ఆప్టికల్ సూత్రాల గురించి ఈ ఖగోళ గ్రంధంలో ఉన్నాయి. ఇవి నక్షత్రాల అధ్యయనానికి సంబంధించిన ఖగోళ గణనలకు సహాయపడేవి
@ సిద్ధాంత శిరోమణి: భాస్కరాచార్యుడు 12వ శతాబ్ధంలో రచించిన గ్రంధంలో గ్లాస్ ప్రిజమ్ ద్వారా కాంతి రిఫ్రాక్షన్ , రంగుల విభజన గురించి ఉంది
@ వైశేషిక సూత్రాలు: కనాడుడు రచించిన ఈ గ్రంధంలో అద్దాలు లేదా మెరుగుపెట్టిన ఉపరితలాలపై కాంతి ప్రతిబింబం గురంచి ఉంది
లోహ స్తంభం
ఢిల్లీలోని లోహ స్తంభం, ఇది దాదాపు 400 AD లో నిర్మించారు. దీని ఎత్తు 7 మీటర్లు. దీని ప్రత్యేకత ఏంటంటే సంవత్సరాలుగా వర్షం కురుస్తున్నప్పటికీ దీనికి తుప్పు పట్టదు. జానపద కథలలో దీనిని దేవతల బహుమతిగా పేర్కొన్నారు. కానీ వాస్తవానికి ఇది పురాతన భారతీయ లోహ శిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ.
రహస్య యంత్రాలు
గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయం నుంచి లభించిన మధ్యయుగపు వివరణలలో తోటలలో , ఆచారాలలో నీటిని పంప్ చేసే రహస్య యంత్రాల గురించి ప్రస్తావన ఉందని చెబుతారు. అయితే సోమనాథ్ లో ప్రధాన రహస్య యంత్రంగా చర్చించేది శివలింగం లెవిటేషన్ - మాగ్నెటిక్ లేదా డయామాగ్నెటిక్ వ్యవస్థ ద్వారా గాలిలో తేలియాడేది. ఆల్ కజ్విని వంటి రచయితలు ఈ విషయాన్ని వర్ణించారు.
ఎగిరే విమానాలు
రామాయణ , మహాభారత కాలంలో ఎగిరే విమానాల గురించి ప్రస్తావన ఉంది, దేవతలు , యోధులు వీటిని ఉపయోగించారు. వైమానిక శాస్త్ర గ్రంథంలో రావణుడి పుష్పక విమానం వంటివి తయారు చేసే విధానం కూడా వివరించి ఉంది. ఇందులో విచిత్రమైన పదార్థాలు , పాదరసం ద్వారా నడిచే ఇంజిన్ గురించి ప్రస్తావనఉంది. భారతదేశంలోని అనేక దేవాలయాల శిల్పాలలో ఎగిరే వస్తువులను కూడా చిత్రీకరించారు, ఇది ఇప్పటికీ రహస్యాలతో నిండి ఉంది.
కదిలే విగ్రహాలు
ప్రాచీన భారతదేశంలో కదిలే లేదా సంగీతం వాయించే కొన్ని విగ్రహాలు కూడా ఉండేవి. మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం వంటి మతపరమైన ప్రదేశాల పురాణాలలో పండుగల సమయంలో పనిచేసే యాంత్రిక తలుపులు , తిరిగే బొమ్మల గురించి ఉంది.
@ భోజ మహారాజు (11వ శతాబ్ధం)
భోజుడు తన గ్రంథం "సమరాంగణ సూత్రధార"లో యంత్ర విధానం అనే అధ్యాయంలో కదిలే బొమ్మలు, నీటి ఫౌంటైన్లు, పాడే పక్షులు, నాట్యం చేసే మానవాకార యంత్రాల గురించి వివరించారు. భోజ మహారాజు ఉద్యానవనంలో ఇలాంటి యాంత్రిక అద్భుతాలు ఉండేవని కథలు చెబుతారు
@ బుద్ధుని శరీరావశేషాల రక్షణ
బుద్ధుడి ధాతువులను భూత వాహన యంత్రాలు(రోబోలు) రక్షించేవని చెబుతారు.
@ అశోకుడి కాలంలో గ్రీకు-భారత సాంస్కృతిక మార్పిడి జరిగింది. ఆ సమయంలో కొన్ని ఆలయాల్లో భ్రమణం చేసే రాతి స్తంభాలున్నాయి. ఇవి మెకానికల్ డిజైన్లకు ఉదాహరణలు
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం






















