అన్వేషించండి

Rules in EPF : ఈపీఎఫ్ఓ మెంబర్స్ కి గుడ్ న్యూస్ - ఇక నుంచి మీ పర్సనల్ డిటెయిల్స్ ను ఈజీగా ఛేంజ్ చేయొచ్చు

Rules in EPF : ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ మెంబర్స్ వారి వ్యక్తిగత వివరాల్లో మార్పు ప్రక్రియను సులభతరం చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

Rules in EPF : రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ - ఈపీఎఫ్ఓ (EPFO) తమ సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రెండు కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఈపీఎఫ్ఓతో లింక్ చేయబడి ఉన్న 7.6 కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఇప్పుడు సభ్యులు యజమాని ద్వారా ఎటువంటి ధృవీకరణ లేదా ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండానే మీ పేరు, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌(Online)లో ఈజీగా మార్చుకోవచ్చు. అంతేకాదు, ఈ -కేవైసీ (e-KYC) ఈపీఎఫ్ ఖాతాలు (ఆధార్ సీడెడ్) కలిగిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులు తమ ఈపీఎఫ్ బదిలీ క్లెయిమ్స్ ను ఆన్‌లైన్‌లో ఆధార్ ఓటీపీ (OTP) (One-time password)తో యజమాని జోక్యం లేకుండానే నేరుగా ఫైల్ చేయవచ్చు. ఈ రెండు కొత్త సర్వీస్ లను కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వీటి వల్ల ఈపీఎఫ్ఓ ప్రక్రియ మరింత సులువువవుతుందని, యజమానులపై ఒత్తిడి కూడా తగ్గుతుందని చెప్పారు.

తాజా సౌకర్యాలతో కలిగే ప్రయోజనాలు

  • అక్టోబర్ 1, 2017 తర్వాత జారీ అయిన యూఏఎన్ చందాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వీరు ఏవైనా మార్పులు చేయాలనుకుంటే ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం ఉండదు.
  • ఈపీఎఫ్ఓ మెంబర్స్ కు సంబంధించిన పేరు, పుట్టిన తేదీ, లింగం, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు లాంటి వివరాలను మార్చుకోవడం సులభమవుతుంది.
  • ఆధార్ తో లింక్ చేయని యూఏఎన్ ఖాతాల విషయంలోనూ మార్పులు చేయాలనుకుంటే మాత్రం యజమానికి ఫిజికల్ డాక్యుమెంట్స్ సమర్పించాక.. వెరిఫికేషన్ పూర్తి చేసి ఈపీఎఫ్ఓ ఆమోదం కోసం పంపాలి.
  • అక్టోబర్ 1, 2017 కంటే ముందు జారీ అయిన అయిన యూఏఎన్ చందాదారులు తమ వివరాలను మార్చుకునేందుకు ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండానే ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లను సైతం తగ్గించారు.

EPFO పోర్టల్‌లో EPF UANని ఆధార్‌తో ఎలా లింక్ చేయాలంటే:

  • ఈపీఎఫ్ఓ మెంబర్ ఈ - సేవ (e-Sewa) వెబ్‌సైట్‌ను సందర్శించాలి
  • మీ యూఏఎన్ (UAN), పాస్‌వర్డ్, క్యాప్చా ఉపయోగించి లాగిన్ చేయాలి.
  • 'Manage' మెనులో, 'KYC' ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  • కేవైసీ (KYC) పేజీలో, ఆధార్ ను ఎంచుకోవాలి.
  • మీ ఆధార్ కార్డ్‌(Adhar Card)లో ఉన్న మీ 12 అంకెల ఆధార్ నంబర్, పేరు(Name)ను నమోదు చేయాలి.
  • ధృవీకరణ కోసం సమాచారాన్ని సబ్మిట్(Submit) చేయడానికి 'save'పై క్లిక్ చేయాలి.
  • మీ వివరాలును ఉడాయ్ (UIDAI) తమ రికార్డులతో క్రాస్-చెక్ చేస్తుంది.
  • సబ్మిట్ సక్సెస్ అయిన తర్వాత, మీ ఆధార్ మీ ఈపీఎఫ్(EPF) ఖాతాకు విజయవంతంగా లింక్ అవుతుంది.

Also Read : 8th Pay Commission : 8వ వేతన సంఘంతో ఏ రాష్ట్ర ఉద్యోగుల జీతం ముందుగా పెరుగుతుంది - ఎక్కువ జీతం ఏ రాష్ట్ర ఉద్యోగులకు వస్తుందంటే.

టాప్ హెడ్ లైన్స్

SBI Data Breach: ఎస్‌బీఐకి సైబర్ షాక్.. 3.75 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్?.. స్టేట్ బ్యాంక్ ఏం చెబుతుందంటే?
ఎస్‌బీఐకి సైబర్ షాక్.. 3.75 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్?.. SBI ఏం చెబుతుందంటే?
Jio IPO Live: రూ.30,213 కోట్ల జియో ఐపీఓ లైవ్.. సబ్‌స్క్రిప్షన్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డ్
రూ.30,213 కోట్ల జియో ఐపీఓ లైవ్.. సబ్‌స్క్రిప్షన్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డ్
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Jio Platforms IPO: లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
Embed widget