అన్వేషించండి

Singham Again : తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్... ఏ ఓటీటీలో ఉందంటే?

Singham Again : అజయ్ దేవగన్ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'సింగం అగైన్' తెలుగు వెర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇటీవల కాలంలో ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఒకేసారి ఐదు భాషల్లో అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని సినిమాలు మాత్రం ముందుగా ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఓటీటీ లవర్స్ ను అలరించి, ఆ తర్వాత డబ్బింగ్ వర్షన్లు రిలీజ్ అవుతున్నాయి. ఇలాగే తాజాగా 350 కోట్ల బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'సింగం అగైన్' తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది.

ముందుగా రెంటల్ విధానంలో...

అజయ్ దేవగన్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపిక పదుకొనే, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్లు కలిసి నటించిన భారీ మల్టీ స్టారర్ 'సింగం అగైన్'. జియో స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, సినర్జీ, దేవగన్ ఫిలిమ్స్, రోహిత్ శెట్టి పిక్చర్స్ బ్యానర్లపై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. 'సింగం ఎగైన్' సినిమాకి రవి బస్రూర్, తమన్ సంగీతం అందించారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను గత ఏడాది నవంబర్ 1 న దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో థియేటర్లలో నడిచింది. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను సాధించి హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో హిందీలో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ముందుగా ఈ మూవీని రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ చేశారు.

ముచ్చటగా మూడు భాషల్లో...

డిసెంబర్ 27 నుంచి 'సింగం అగైన్' మూవీ రెగ్యులర్ స్ట్రీమింగ్ మొదలైంది. కానీ ఇప్పటిదాకా ఒక్క హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీ, ఓటీటీలోకి వచ్చిన నెల రోజుల గ్యాప్ తర్వాత తెలుగు, తమిళ డబ్బింగ్ వర్షన్లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అంటే రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన 'సింగం అగైన్' సినిమాను ఇప్పుడు తెలుగు, తమిళ మూవీ లవర్స్ కూడా చూడొచ్చు అన్నమాట.

అంచనాలను అందుకోలేకపోయిన 'సింగం'...

'సింగం అగైన్' సినిమాను 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. కానీ ఈ సినిమా అంచనాలకు తగ్గ కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. హిందీ సినీ చరిత్రలోనే భారీ మల్టీసారర్ గా రూపొందిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ రావడంతో కేవలం ప్రపంచవ్యాప్తంగా రూ. 389 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా 'సింగం అగైన్' మూవీ సింగం బ్లాక్ బస్టర్ సిరీస్ లో మూడవ భాగం. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో సింగం, సింగం రిటర్న్స్, సింబా, సూర్య వంశీ లాంటి కాప్ చిత్రాలతో డైరెక్టర్ రోహిత్ శెట్టి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. అదే ఊపుతో 'సింగం అగైన్' మూవీని 'సింగం'కి సీక్వెల్ లో మూడవ భాగంగా తెరపైకి తీసుకొచ్చాడు. 2011లో 'సింగం' మూవీ రిలీజ్ కాగా, సీక్వెల్ గా 'సింగం రిటర్న్స్' 2014లో వచ్చింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత 'సింగం అగైన్' అంటూ దీనికి మరో సీక్వెల్ ని కంటిన్యూ చేశారు.

Also Read: ఈ వారం టీవీ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయ్... ఫస్ట్ ప్లేస్ ఎవరిది? టాప్ 10లో ఏవేవి ఉన్నాయో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Baa Baa Black Sheep OTT : రెండు ఓటీటీల్లోకి న్యూ ఏజ్ కామెడీ డ్రామా - సీఎం మెచ్చిన మూవీ... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లోకి న్యూ ఏజ్ కామెడీ డ్రామా - సీఎం మెచ్చిన మూవీ... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
OTT Crime Thriller: రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
Haiku Movie OTT : లేడీస్ కాలేజీలో ఒక్కడే అబ్బాయి - ఓటీటీలోకి శ్రీదేవి లవ్ రొమాంటిక్ డ్రామా 'హైకూ'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లేడీస్ కాలేజీలో ఒక్కడే అబ్బాయి - ఓటీటీలోకి శ్రీదేవి లవ్ రొమాంటిక్ డ్రామా 'హైకూ'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget