అన్వేషించండి

Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో బిగ్ అప్‌డేట్‌- పోలీసుల అదుపులో అనుమానితుడు 

Saif Ali Khan Attack: జనవరి 16 రాత్రి సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారిస్తున్నారు. ఈకేసులో కీలక పురోగతి సాధించినట్టు సమాచారం.  

Saif Ali Khan Attack: జనవరి 16న సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన జరిగింది. అప్పటి నుంచి నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని విచారించారు. ఇంకా విచారిస్తున్నారు. వందల సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతి చోటుకు ముంబై పోలీసులు వెళ్తున్నారు. అక్కడ జల్లెడ పడుతున్నారు. ఈక్రమంలోనే కీలక పురోగతి సాధించినట్టు సమాచారం అందుతోంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

రైలులో పారిపోతున్న టైంలో ఆ అనుమాతిడిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాము వెతుకుతున్న నిందితుడు ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అనంతరం స్థానిక పోలీసుల సహాయంతో ప్రయాణికుడిని రైలు నుంచి దింపేశారు. అతని పేరు ఆకాష్ కైలాష్ కన్నౌజియాగా చెబుతున్నారు. 

ఆ వ్యక్తి సైఫ్ అలీఖాన్ కేసులో ఇప్పటికే విడుదల చేసిన వీడియోల్లో కనిపించే అనుమానితుడిగా ఉన్నట్టు విచారిస్తున్న వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అతనే ఈ పని చేసినట్టు కచ్చితమైన ఆధారాలు మాత్రం లభించలేదని తెలుస్తోంది. 

అనుమానితుడిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు?
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన నిందితుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించి, కేసులో అతని పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు దాదాపు 50 మందిని విచారించారు. ఈ కేసులో 35 బృందాలు రంగంలోకి దిగి నిందితులకు సంబంధించిన ఆధారాలు వెతికే పనిలో నిమగ్నమయ్యాయి.

సైఫ్ కేసులో దాడి నిందితుడి గుర్తింపు?
సైఫ్‌పై దాడి జరిగి 60 గంటలకుపైగా అయింది. ఇంత వరకు ఎలాంటి పురోగతి లేదంటున్న టైంలో నిందితుడిని గుర్తించినట్టు తెలుస్తోంది. సీసీటీవీలో నిందితుడిని పోలిన ఫోటో ఒకటి బయటికి వచ్చింది. అయితే అతడే నిందితుడిని పోలీసులు ఇంకా ప్రకటించలేదు. సైఫ్‌పై హత్యాకాండకు పాల్పడింది కూడా అతనే అయి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది.

నిందితుడి నేర చరిత్రపై దర్యాప్తు 
నిందితుడిని గుర్తించిన పోలీసులు అతని నేర చరితపై దర్యాప్తు చేస్తున్నారు. సైఫ్‌పై జరిగిన దాడిలో ఇతడే నిందితుడిగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ముంబైలోని తూర్పు శివారు ప్రాంతంలో డిసెంబర్ 11న ఇలాంటి ఘటనకు పాల్పడుతుండగా ప్రజలు పట్టుకున్నారు. అయితే అతడిని మానసిక రోగిగా భావించి పోలీసులకు అప్పగించకుండా విడిచిపెట్టారు. పట్టుబడిన తర్వాత, నిందితుడు తనను తాను డెలివరీ బాయ్ అని చెప్పుకుంటూ తిరిగాడు. దీనిపై ఆదివారం పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Local Elections: తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సమరానికి రంగం సిద్ధం! ఏ క్షణమైనా జీవో జారీ!
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సమరానికి రంగం సిద్ధం! ఏ క్షణమైనా జీవో జారీ!
AP DSC Recruitment: పండుగలా కొత్త టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు - గురువారం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో వేడుక
పండుగలా కొత్త టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు - గురువారం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో వేడుక
Asia Cup 2025 Team India In Final: ఫైన‌ల్లో టీమిండియా.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఈ ఘ‌న‌త‌.. రాణించిన అభిషేక్, కుల్దీప్.. బంగ్లా-పాక్ మ‌ధ్య నాకౌట్.. గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు..
ఫైన‌ల్లో టీమిండియా.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఈ ఘ‌న‌త‌.. రాణించిన అభిషేక్, కుల్దీప్.. బంగ్లా-పాక్ మ‌ధ్య నాకౌట్.. గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు..
OG Yakuza Gangs: ఓ చిల్లర గ్యాంగ్‌ దేశాన్ని ఏలే స్థాయికి ఎదిగింది.  ఓజీలోని యకూజా గ్యాంగ్స్… చరిత్ర తెలిస్తే వణికిపోతారు
ఓ చిల్లర గ్యాంగ్‌ దేశాన్ని ఏలే స్థాయికి ఎదిగింది. ఓజీలోని యకూజా గ్యాంగ్స్… చరిత్ర తెలిస్తే వణికిపోతారు
Advertisement

వీడియోలు

Pakistan vs Sri Lanka Asia Cup 2025 | డూ ఆర్ డై మ్యాచ్ లో స‌త్తా చాటిన పాక్
India vs Bangladesh Preview Asia Cup 2025 | నేడు బాంగ్లాదేశ్ తో తలపడనున్న ఇండియా
Arjun Tendulkar vs Samit Dravid | సమిత్ ద్రవిడ్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్
Abrar Ahmed vs Wanindu Hasaranga Asia Cup 2025 | అహ్మద్ vs హసరంగా
Sports Tales | గ్యాంగ్‌స్టర్స్‌ని జెంటిల్‌మెన్‌గా మార్చిన క్రికెట్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Local Elections: తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సమరానికి రంగం సిద్ధం! ఏ క్షణమైనా జీవో జారీ!
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సమరానికి రంగం సిద్ధం! ఏ క్షణమైనా జీవో జారీ!
AP DSC Recruitment: పండుగలా కొత్త టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు - గురువారం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో వేడుక
పండుగలా కొత్త టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు - గురువారం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో వేడుక
Asia Cup 2025 Team India In Final: ఫైన‌ల్లో టీమిండియా.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఈ ఘ‌న‌త‌.. రాణించిన అభిషేక్, కుల్దీప్.. బంగ్లా-పాక్ మ‌ధ్య నాకౌట్.. గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు..
ఫైన‌ల్లో టీమిండియా.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఈ ఘ‌న‌త‌.. రాణించిన అభిషేక్, కుల్దీప్.. బంగ్లా-పాక్ మ‌ధ్య నాకౌట్.. గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు..
OG Yakuza Gangs: ఓ చిల్లర గ్యాంగ్‌ దేశాన్ని ఏలే స్థాయికి ఎదిగింది.  ఓజీలోని యకూజా గ్యాంగ్స్… చరిత్ర తెలిస్తే వణికిపోతారు
ఓ చిల్లర గ్యాంగ్‌ దేశాన్ని ఏలే స్థాయికి ఎదిగింది. ఓజీలోని యకూజా గ్యాంగ్స్… చరిత్ర తెలిస్తే వణికిపోతారు
OG Movie Review - 'ఓజీ' రివ్యూ: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందా? సినిమా హిట్టా? ఫట్టా?
'ఓజీ' రివ్యూ: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందా? సినిమా హిట్టా? ఫట్టా?
Telugu Thalli Flyover:తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను 'తెలంగాణ తల్లి'గా పేరు మార్పు- జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం 
తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను 'తెలంగాణ తల్లి'గా పేరు మార్పు- జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం 
Jailer 2 Release Date: అఫీషియల్... 'జైలర్ 2' రిలీజ్ డేట్ వచ్చేసింది - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన తలైవా
అఫీషియల్... 'జైలర్ 2' రిలీజ్ డేట్ వచ్చేసింది - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన తలైవా
TGPSC Group -1 Selected List: గ్రూప్‌-1 సెలెక్టెడ్‌ జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ-తుది ఎంపిక హైకోర్టు తీర్పునకు లోబడే ఉంటుందన వెల్లడి 
గ్రూప్‌-1 సెలెక్టెడ్‌ జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ-తుది ఎంపిక హైకోర్టు తీర్పునకు లోబడే ఉంటుందన వెల్లడి 
Embed widget