అన్వేషించండి

Jailer 2 Release Date: అఫీషియల్... 'జైలర్ 2' రిలీజ్ డేట్ వచ్చేసింది - ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన తలైవా

Jailer 2 Movie: తలైవా రజినీకాంత్ 'జైలర్ 2'పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు.

Rajinikanth's Jailer 2 Release Date Official Announcement: సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023లో రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ డీసెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు తలైవా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. జైలర్‌కు సీక్వెల్ రెడీ అవుతుండగా టీజర్ సైతం ఆకట్టుకుంది. 

రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ప్రస్తుతం 'జైలర్ 2' షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... తాజాగా కేరళ షెడ్యూల్ ముగించుకుని చెన్నై చేరుకున్నారు రజినీకాంత్. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 'షూటింగ్ బాగా జరుగుతోంది.' అంటూ తలైవా చెప్పగా... రిలీజ్ ఎప్పుడు ఉంటుంది సార్? అన్న ప్రశ్నకు 2026, జూన్ 12న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Also Read: 'ఓజీ' రివ్యూ: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందా? సినిమా హిట్టా? ఫట్టా?

ఈ మూవీలో ఫస్ట్ పార్టులో నటించిన వారంతా కనిపించనున్నారు. రజినీ కాంత్ భార్యగా రమ్యకృష్ణ కీలక రోల్ ప్లే చేశారు. ఇక మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, సునీల్, మిర్నా మేనన్, వినాయకన్ కీలక పాత్రలు పోషించారు. తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా... సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ మూవీని నిర్మించారు. దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కిన 'జైలర్' రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

దీనికి సీక్వెల్ సైతం అంతకు మించిన స్థాయిలో తెరకెక్కుతుండగా టీజర్ అనౌన్స్‌మెంట్ వీడియో అదరగొట్టింది. రజినీకాంత్ స్టైల్‌గా కళ్లజోడు పెట్టుకుని ఉంటే వెనుకాల బ్లాస్ట్ జరగడం... ఆయన గ్రేస్ వేరే లెవల్‌లో ఉంది. ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కుటుంబానికి విగ్రహాల చోరీ ముఠా వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. తన కుటుంబాన్ని అంతం చేయాలని చూసిన ముఠా నాయకున్ని సదరు పోలీస్ ఆఫీసర్ ఎలా అంతం చేశాడు? ఈ క్రమంలో ఆయన తెలుసుకున్న షాకింగ్ నిజం? ఇవన్నీ ఫస్ట్ పార్టులో చూపించగా దానికి సీక్వెల్‌గా ఇంట్రెస్టింగ్ స్టోరీతో 'జైలర్ 2' తెరకెక్కనుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Streamings : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు డోంట్ మిస్
Horror Thriller OTT : ఆ 'రాత్రి' ఏం జరిగింది? - ఎక్స్‌క్లూజివ్‌గా మరో హారర్ అంథాలజీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆ 'రాత్రి' ఏం జరిగింది? - ఎక్స్‌క్లూజివ్‌గా మరో హారర్ అంథాలజీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Medical Thriller OTT : మరో ఓటీటీలోకి వచ్చేసిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ - 'కికు చిరంజీవి' ఎందులో చూడొచ్చంటే?
మరో ఓటీటీలోకి వచ్చేసిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ - 'కికు చిరంజీవి' ఎందులో చూడొచ్చంటే?
January 12 Vidudala : జనవరి 12 విడుదల ఫస్ట్ సాంగ్ - రజనీ కాంత్ మూవీ సీన్ వాడేసిన అనిల్ రావిపూడి... ప్రమోషనల్ వీడియో చూడాల్సిందే
జనవరి 12 విడుదల ఫస్ట్ సాంగ్ - రజనీ కాంత్ మూవీ సీన్ వాడేసిన అనిల్ రావిపూడి... ప్రమోషనల్ వీడియో చూడాల్సిందే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget